Illegal Brick Kilns: స్వేచ్ఛ బ్యూరో: జిల్లా కేంద్రానికి సమీపంలో ఇటుక బట్టీల దందా యథేచ్ఛగా సాగుతోంది. ఏ చిన్న పరిశ్రమ ఏర్పాటు చేయాలన్న దానికి అనుమతులు తప్పనిసరి. అటువంటి చిన్న తరహా పరిశ్రమగా పిలుచుకునే ఇటుక బట్టీల నిర్వహణకు ఎటువంటి అనుమతులు తీసుకోకుండా ఈ బట్టీల్లో ఉపయోగించే ముడి పదార్థాల వల్ల ప్రకృతి విఘాతం కలుగుతుంది. ఇటుక బట్టీలు నిరంతరం కాలుష్యాన్ని వెదజల్లడమే కాకుండా ప్రభుత్వ ఆదాయానికి కూడా నిర్వాహకులు గండి కొడుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. సమాజానికి హాని కలుగుతున్నా దందా రోజు రోజుకి విస్తరిస్తోంది.బట్టిల నిర్వహణను నిబంధనల ప్రకారం పరిశ్రమల శాఖ వారు అనుమతించాలి .ఎటువంటి అనుమతులు లేకుండా యదేచ్ఛగా నిర్వహిస్తున్న ఇట్టుక బట్టిల నిర్వహణ గద్వాల జిల్లాలో నడుస్తోంది. నిబంధనలను ఉల్లంఘించి కొందరు అక్రమార్కులు పచ్చని పంట పొలాల్లో కాలుష్య కొర్రలను నింపుతూ పక్కన ఉన్న పంట పొలాలతో పాటు సమీప రోడ్డు మార్గం గుండా వెళుతున్న వాహనదారులు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
గద్వాల పట్టణానికి సమీపంలోని వీరాపురం గ్రామ సమీపంలో దర్జాగా వందల ఎకరాలలో ఇటుక బట్టీలు ఏర్పాటు చేసి వ్యాపారం కొనసాగిస్తున్నారు. గద్వాల నుంచి సమీప గ్రామాలకు వెళ్లే పూడూరు రహదారి గుండా అనేక వాహనాలు గోపల్ దిన్నె, ఇటిక్యాల మండలంలోని పలు గ్రామాలకు వాహనాలు నిరంతరాయంగా రాకపోకలు కొనసాగుతున్నాయి. దీంతో వాహనదారులు ఇటుక బట్టీల ప్రాంతంలోకి రాగానే పొగ కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వ్యవసాయ భూమిని వ్యవసాయేతర పనులకు ఉపయోగించేటప్పుడు తప్పనిసరిగా ల్యాండ్ కన్వర్షన్ తీసుకోవాలి. ఇటుక బట్టీల నిర్వహణ సీజనల్ గా ఉంటుంది. దీనికి వన్ టైం ల్యాండ్ కన్వర్షన్ తీసుకుంటే సరిపోతుంది. కానీ ఇటుక బట్టీల నిర్వాహకులు ల్యాండ్ కన్వర్షన్ తీసుకోకుండానే బట్టీలను నిర్వహిస్తున్నారు. ల్యాండ్ కన్వర్షన్ తర్వాత ఏ పంచాయతీ పరిధిలో నిర్వహిస్తున్నారో ఆ పంచాయతీ అధికారుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి తీసుకున్న తర్వాత బట్టిలలో తయారు చేసే ఇటుకల సామర్థ్యంను బట్టి పన్నులు చెల్లించాలి. బట్టీల నిర్వాహకులు పంచాయతీల అనుమతులు తీసుకోక పోగా పంచాయతీలకు ఎటువంటి పన్నులు చెల్లించడం లేదని సమీప పొలాల రైతులు వాపోతున్నారు. బట్టీలలో నీటి కోసం విద్యుత్ మోటర్లు వినియోగిస్తున్నారు రాత్రిపూట కూలీలు పనులు చేసేందుకు దీపాలను వెలిగిస్తారు. వీటికి విద్యుత్ అవసరం. అయితే బట్టీల యజమానులు విద్యుత్ అధికారుల ఎటువంటి అనుమతులు తీసుకోకుండానే విద్యుత్తును ఆయా గ్రామాల్లో వినియోగిస్తున్నట్లు ఆరోపణ వినిపిస్తున్నాయి.
Also Read: Telangana Congress: కాంగ్రెస్‌లో పదవులు పొంది.. కంటికి కనిపించని మహిళా ఫైర్ బ్రాండ్స్..?
అటవి శాఖ నియమ నిబంధనల మేరకు సహజ వనరుల రక్షణ, భూమి నీటి వనరులను కాపాడడం, చెట్టు నరికివేతను అడ్డుకోవడం ఇసుక బట్టీల కోసం బంకమట్టి సేకరణ పంట చెరుకు కోసం చెట్లను ఇష్టానుసారంగా నరికివేసి బట్టీలలో వేసి కాలుస్తూ నిబంధనలకు తూట్లు పెడుతున్నారు దీనికి తోడుగా బట్టీలలో పనిచేస్తున్న కార్మికుల సంక్షేమం కోసం నిర్వాహకులు ఎలాంటి వస్తువులు కల్పించడం లేదు చిన్నారులు సైతం పట్టినలో పనులు చేస్తున్నారు. కార్మిక శాఖ అధికారులు సైతం వారికి అండగా ఉంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి కాలుస్తుంటారు అది కాస్త వారం పది రోజుల్లో పాటు కాలుతుంది దానికి వరి పొట్టు వంట చెరుకు అవసరం వారం పది రోజుల పాటు బట్టీలలో మంటలు వస్తున్నాడంతో ఆ ప్రాంతంలోని భూమి పరులు వేడెక్కుతాయి పక్కనే ఉన్న మొక్కలు సైతం వాడిపోతున్నయి భూగర్భ జలాలు అడుగంటడంతోపాటు భూ వాయు కాలుష్యాలు పెరిగిపోతున్నాయి. నిత్యం బట్టీలలో కాలుష్యం రావడం వల్ల వల్ల ప్రధానంగా గాలి కాలుష్యం ఎక్కువగా ఉంటుంది . గాలి ద్వారా దుమ్ము ధూళి పొగ విపరీతంగా వ్యాపిస్తుంది.వాటి వల్ల ప్రజలకు, వాహనదారులకు అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. బట్టీల్లోంచి గాలి ఎంతవరకు వ్యాపిస్తుందో ఆ ప్రాంతం మొత్తం కాలుష్యంగా మారుతుంది. దీంతో ప్రతినిత్యం ఆ మార్గం గుండా ప్రయాణించే సమీప గ్రామాల ప్రజలు ఇక తయారీ కేంద్రాలకు సమీపంలోకి రాగానే తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
ప్రతినిత్యం మా గ్రామం నుంచి వీరాపురం మీదుగా గద్వాలకి వెళుతుంటాం. బట్టీల సమీపంలోకి రాగానే వాయు కాలుష్యం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఇటీవల ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఒక జంట పగ వల్ల రోడ్డు కనిపియాక అకస్మాత్తుగా కిందపడి గాయాల పాలయ్యారు. నిబంధన ఉల్లంఘించి నిర్వహిస్తున్న ఇటుక బట్టీల నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలి. రోడ్డు గుండా కనీసం కాలుష్యం వెదజల్లకుండా గ్రీన్ మ్యాట్ ఏర్పాటు చేయకుండా తండా నిర్వహిస్తున్నడంతో పొగ వల్ల ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు రోడ్డు ప్రమాదాలకు కారణం అవుతున్న వారిపై చర్యలు తీసుకోవాలి.
ఇటుక బట్టీల నిర్వాహకులు యథేచ్ఛగా భూ కాలుష్యంతో పాటు వాయు కాలుష్యాన్ని ఖాతరు చేయకుండా వ్యవసాయ పొలాలలో దందా నిర్వహిస్తూ సమీప పంట పొలాల రైతులతో పాటు ఈ మార్గం గుండా ప్రయాణించే మేము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలి.
Also Read: Jangaon Police: జనగామ పోలీస్ స్టేషన్‌లో దారుణం.. సర్పంచ్ కేసును స్వీకరించని సీఐ సత్యనారాయణ