E-Paper
Advertisement

జియో vs ఎయిర్‌టెల్.. రూ.500 లోపు ప్లాన్లలో ఏది బెటర్? పూర్తి వివరాలు!

జియో vs ఎయిర్‌టెల్.. రూ.500 లోపు ప్లాన్లలో ఏది బెటర్? పూర్తి వివరాలు!
Advertisement

Jio Airtel Plans: మార్కెట్లో టెలికాం ఆపరేటర్ల మధ్య పోటీ రోజురోజుకూ పెరుగుతోంది. ఇందులో భాగంగానే రిలయన్స్ జియో (Reliance Jio), ఎయిర్ టెల్ దాదాపుగా ఒకే ధరకు రెండు అద్భుతమైన ప్లాన్లు తీసుకొచ్చాయి. జియో తీసుకొచ్చిన రూ.500 ప్రీపెయిడ్ ప్లాన్, ఎయిర్‌టెల్ (Bharti Airtel) తెచ్చిన రూ. 489 ప్లాన్ వివిధ రకాల బెనిఫిట్స్ తో ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈ రెండు ప్లాన్లకు సంబంధించిన వివరాలు, వాటి వల్ల యూజర్లకు కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

జియో రూ. 500 ప్రీపెయిడ్ ప్లాన్

జియో రూ. 500 ప్లాన్ ను 28 రోజుల వ్యాలిడిటీతో తీసుకొచ్చింది. ప్రతిరోజూ 2GB హై-స్పీడ్ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు యూజర్లకు లభించనున్నాయి. అంతేకాకుండా అర్హత కలిగిన యూజర్లకు అన్‌లిమిటెడ్ 5G డేటా కూడా పొందొచ్చు. ఈ ప్లాన్ లో యూట్యూబ్ ప్రీమియం, అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ సబ్‌స్క్రిప్షన్లు ఉచితంగా లభించనున్నాయి. జియోటీవీ యాప్ ద్వారా సోనీలివ్, జీ5, సన్ నెక్స్ట్, లయన్స్‌గేట్ ప్లే తదితర ఓటీటీలు ఫ్రీగా చూడొచ్చు.

ఎయిర్‌టెల్ రూ. 489 ప్లాన్ ప్రత్యేకతలు

Advertisement

ఎయిర్‌టెల్ రూ. 489 ప్రీపెయిడ్ ప్లాన్ ను ఏకంగా 77 రోజుల వ్యాలిడిటీతో తీసుకొచ్చింది. ఈ ప్లాన్ కింద మొత్తం కాలానికి 6GB డేటా, ఫ్రీ కాల్స్, 600 ఎస్ఎంఎస్‌లు లభించనున్నాయి. అయితే, ఈ ప్లాన్‌లో అదనంగా ఎలాంటి బెనిఫిట్స్, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు ఉండవని ఎయిర్ టెల్ తెలిపింది.

Also Read: ఆర్థిక సంక్షోభం వస్తే ఎలా భరించాలి? ఎమర్జెన్సీ ఖర్చులకు అప్పు చేయకుండా ఈ 3 పనులు చేయండి

రెండింటిలో ఏ ప్లాన్ బెస్ట్?

Advertisement

ధరల పరంగా చూస్తే జియో రూ. 500 ప్లాన్‌కు 28 రోజుల వాలిడిటీ మాత్రమే ఇస్తుండగా ఎయిర్‌టెల్ రూ. 489 ప్లాన్ మాత్రం ఏకంగా 77 రోజుల సుదీర్ఘ వాలిడిటీని అందిస్తోంది. వాలిడిటీ పరంగా ఎయిర్‌టెల్ బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తోంది. అయితే ఎంటర్‌టైన్‌మెంట్ పరంగా చూస్తే మాత్రం జియో ఎన్నో అద్భుతమైన అదనపు ప్రయోజనాలను అందిస్తోంది.

Also Read: భోగాపురం నుంచి ఢిల్లీకి విమాన సర్వీసు.. పెరుగుతున్న కనెక్టివిటీ, ప్రయాణికుల్లో ఒకటే ఆనందం

Tags

Related News

ఇంటి పైకప్పుపై నీళ్ల బాటిల్ ఎందుకు పెడతారు? 30కి పైగా దేశాలు ఫాలో అవుతున్న ఆశ్చర్యకరమైన ట్రిక్ ఇదే!

రూ.1,299ధరలో బెస్ట్ ఫీచర్స్..తక్కువ ధరలో ప్రీమియం లుక్

ఏసీ కొనడానికి ఇదే రైట్ టైమ్.. చలికాలంలో కొంటే ఎన్ని లాభాలో తెలుసా?

iPhone Duoపై 25% డిస్కౌంట్ అంటూ వల.. సైబర్ నేరగాళ్ల కొత్త ట్రిక్ ఇదే!

నిమ్మకాయను మైక్రోవేవ్‌లో ఉంచితే ఏమవుతుందో తెలుసా? మైండ్ బ్లోయింగ్ ట్రిక్!

బిగ్ స్క్రీన్ లవర్స్ కోసం..అద్భుతమైన స్మార్ట్ టీవీ

చలికాలంలో గీజర్ ఆన్ చేస్తున్నారా? ఈ సీక్రెట్ ట్రిక్స్ పాటిస్తే.. పవర్ బిల్లు భయమే ఉండదు!

Big Stories

Advertisement
×