BigTV English

Alum Brings Happiness To Home : ఆలమ్ ముక్క అదృష్టాన్ని తెస్తుందా…?.

Alum Brings Happiness To Home : ఆలమ్ ముక్క అదృష్టాన్ని తెస్తుందా…?.

Alum Brings Happiness To Home:ప్రతీ ఇంటికి నరఘోష, నరదిష్టి కలుగుతుంటాయి. వాటిని పోగొట్టుకోవడానికి ఎన్నో మార్గాలున్నాయి. కొంతమంది ఎంత కష్టపడినా ఆర్ధికంగా నిలదొక్కకో లేక ఇబ్బది పడుతున్నారు. ఇంట్లో ప్రతీ ఒక్కరిని ఏదో ఒక సమస్య వేధిస్తుంటుంది. అలాంటి వారు కష్టాలు నుంచి బయట పడటానికి ధనాకర్షణ కలగడానికి పటిక ముక్క ఉపయోగపడుతుంది. నెగిటివ్ ఫోర్స్ నుంచి బయటపడటానికి, వ్యాపార సముదాల్లో జనాకర్షణ సాధించడానికి పటిక ముక్క చాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు. పరిహార శాస్త్రంలో పటికకు విశేషమైన ప్రాధాన్యం ఉంది. పటికను ఆలమ్ అని కూడా అంటాం. మనం నిత్యం వెళ్లే బార్బర్ షాపుల్లో ఆలమ్ ను కూడా వాడుతుంటారు.


నర పీడ తొలగిపోవడానికి ఇంటి ముందు పటిక వేలాడ దీయడం చేస్తే సమస్య తొలగిపోతుంది. నల్లని రంగు లేదా ఎర్రటి రంగు గుడ్డలో చుట్టి పటికను ఇంటి ముందు పెట్టుకోండి. గాజు గిన్నెలో పటికి ముక్క పెట్టి ఇంట్లో ఏదో ఒక మూల పెట్టాలి. నెల రోజులపాటు దాన్నికదిలించకుండా అలానే ఉంచాలి. పిల్లలు కానీ, పెద్దవాళ్లు కూడా ముట్టుకోవద్దు ఆ 30 రోజులూ… తర్వాత ఆ పటికను తీసి బయట ఎక్కడో చోట మట్టి తీసి అందులో పెట్టి పూడ్చేయాలి. పెరట్లో ఈ పని చేయద్దు. ఇలా చేస్తే నర ఘోష, నరపీడ అన్ని తొలగిపోతాయి.

కొంతమంది వ్యాపారులు తమ బిజినెస్ సరిగా సాగడం లేదని…డబ్బు కూడా నిలువ ఉండడం లేదని బాధపడుతుంటారు. అలాంటి వాళ్లను పటిక ముక్కను పొడి చేసి నీళ్లలో వేసి మరిగించి ఆ నీళ్లతో ఇల్లు లేదా దుకాణం తడిగుడ్డ పెట్టుకుంటే సమస్య పరిష్కారం అవుతుంది. దీనివల్ల పటికలోని పాజిటివ్ వైబ్రేషన్స్ ఇల్లంతా వ్యాపిస్తాయి.


పీడకలలు ఎక్కువగా వచ్చే వాళ్లు పటిక దిండు కింద పెట్టుకుని నిద్రపోతే హాయిగా విశ్రమిస్తారు. అలాంటి కలల నుంచి దూరం అవవుతారు.దుష్ట శ‌క్తుల‌ను త‌రిమేందుకు కూడా ఆల‌మ్ ప‌నిచేస్తుంది. ఆల‌మ్ ముక్క‌ను ఇంట్లో ఉంచ‌డం వ‌ల్ల దుష్ట‌శ‌క్తుల ప్ర‌భావం త‌గ్గుతుంది. దిష్టి ఏర్ప‌డ‌కుండా ఉంటుంది.

Tags

Related News

Navratri: నవరాత్రి 9వ రోజు.. దుర్గాదేవిని ఇలా పూజిస్తే సకల సంపదలు !

Bathukamma 2025: సద్దుల బతుకమ్మ.. పేరు వెనక అసలు కథ ఇదే !

Ramayana Story: ఎలుక పై మూడు గీతలు వెనుక శ్రీరాముడి మహిమ? మీకు తెలుసా?

Navratri Day 8: నవరాత్రుల్లో 8వ రోజు.. సరస్వతి దేవిని ఎలా పూజించాలి ?

Bathukamma 2025: వెన్నముద్దల బతుకమ్మ ప్రత్యేకత ఏంటి ?

Navaratri 2025: మహాచండీ దేవిని 7వ రోజు ఎలా పూజించాలి ? సమర్పించాల్సిన నైవేద్యం ఏంటి ?

Navaratri 2025: నవరాత్రి 6వ రోజు.. లలితా దేవిని ఏ విధంగా పూజించాలో తెలుసా ?

Bathukamma 2025: వేపకాయల బతుకమ్మ.. ఆ పేరు వెనక కథ, సమర్పించాల్సిన నైవేద్యం ఏంటి ?

Big Stories

×