God Prasadam : ఇంట్లో పూజ చేసే సమయంలో దీపారాధన చేయడం ఎంత ముఖ్యమో… దేవునికి నైవేద్యం సమర్పించడం అంతే ముఖ్యం. వివిధ రకాల పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తుంటారు. పండుగ రోజు అయితే ప్రత్యేక వంటకాలను వండి నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు. దేవునికి చక్కెర నైవేద్యంగా పెట్టరాదని కొందరు అంటుంటారు. కానీ ఏ దేవుని కైనా చక్కెర నైవేద్యంగా పెట్టడం దోషమేమీ కాదని న వేద పండితుల అభిప్రాయం
అంతే కాదు మనం చేసే ఏ శాకాహార పదార్థం అయినా దేవునికి నైవేద్యంగా పెట్టడంలో తప్పు లేదని చెబుతున్నారు. ఎంతో భక్తి శ్రద్ధలతో రుచిగా శుభ్రంగా చేసి దేవునికి నైవేద్యంగా పెట్టి పూజించడం వల్ల దేవుని అనుగ్రహం పొందుతామని… మనస్ఫూర్తిగా చేసే ఏ నైవేద్యం అయినా దేవుడు సంతోషంగా ఆరగించి మన కోరికలను నెరవేరుస్తారని చెబుతున్నారు. మంచి మనసుతో ఏ పదార్ధాన్ని నైవేద్యంగా పెట్టినా భగవంతుడు తప్పక ఆరగిస్తారు.
మనం ఏ పదార్ధాలైతే తీసుకుంటామా వాటిని దేవుడికి పెట్టడం దోషమేమీ కాదు. నిజంగా మన దేవుడికి ప్రసాదం, నైవేద్యం ఆ భగవంతుడు ఆరగించడు. వాటిని మనమే స్వీకరిస్తాం.ఇంకా చెప్పాలంటే మనం తినాలనుకున్న ఆహారాన్ని నైవేద్యాంగా పెట్టి తీసుకోవడం వల్ల ధర్మబద్దంగా మన కోరికలు తీర్చుకున్నట్టువుతుంది. అలా చేయడం వల్ల అది మనల్ని ఉద్దరిస్తుంది. ఆహారంగా తీసుకోవడానికి భగవంతుడు మనకు ఆ పదార్ధాలను చెప్పడానికి కృతజ్ఞత తీర్చుకోవడం కిందే లెక్కభావించాలి.
కొందరు దేవుళ్లకు ప్రత్యేకమైన నైవేద్యాలు ఉంటాయి.విఘ్నేశ్వరునికి కుడుములు, వెలగ పళ్ళు… అమ్మవారికి చక్కెర పొంగలి, పులిహోర ప్రీతికరమని మన పురాణాలు చెబుతున్నాయి. అయితే మన హిందువులు కూడా వీటిని పాటిస్తూ ఆయా దేవుళ్ళకు ప్రత్యేక పండుగ నాడు వారికిష్టమైన నైవేద్యాలను చేసి సమర్పించి పూజలు నిర్వహిస్తారు. ఇలా దేవునికి నైవేద్యం పెట్టడం వలన పూజ అయ్యాక పూర్తి ఫలితం అందుతుందని వేద పండితులు అంటున్నారు. అయితే మిగిలిన రోజులలో సాధారణ నైవేద్యాలను సమర్పించడం సాధారణంగా చూస్తూనే ఉంటాం. అరటి పళ్ళు, ఏదైనా పండు లేదా ఎక్కువగా చక్కెరను దేవునికి నైవేద్యంగా పెట్టి నిత్య పూజలు చేస్తుంటారు.