UP News: కారణాలు ఏమైనా కావచ్చు. విచిత్రమైన సంఘటనలకు ఉత్తరప్రదేశ్ వేదిక అయ్యింది.. అవుతూనే ఉంది. యూపీకి చెందిన 75 ఏళ్ల వ్యక్తి రెండో వివాహం చేసుకున్నాడు. తొలిరోజు రాత్రి బాగానే ఎంజాయ్ చేశాడు. రెండో పెళ్లి ఆనందం తన జీవితంలో చివరి క్షణం అవుతుందని అతనికి తెలియదు. మరుసటి రోజు ఉదయం అతడి ఆరోగ్యం క్షీణించడం, ఆ తర్వాత మృతి చెందడం జరిగిపోయింది. ఆయన బంధువులు అంతిమ సంస్కారాలను నిలిపివేశారు. మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
యూపీలో విచిత్ర ఘటన
ఉత్తరప్రదేశ్‌లో జౌన్‌పూర్‌లోని కుచ్‌ముచ్ గ్రామంలో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది.75 ఏళ్ల వ్యక్తి పేరు సంగ్రూరామ్. ఏడాది కిందట అతడి భార్య మరణించింది. ఆయనకు పిల్లలు లేరు, ఒంటరిగా జీవిస్తున్నాడు. కొంత భూమి ఉండడంతో వ్యవసాయం ద్వారా వచ్చిన డబ్బులతో జీవితం సాగిస్తున్నాడు. సంగ్రూరామ్ ఒంటరి తనం చూసి చాలామంది ఆయనకు ఓ సలహా ఇచ్చారు.
ఈ వయస్సులో ఎందుకు ఇబ్బందులు ఎందుకని, మరో వివాహం చేసుకోవాలని సలహా ఇచ్చారు. ఇరుగుపొరుగువారు కలిసి జలాల్‌పూర్ ప్రాంతానికి చెందిన 35 ఏళ్ల మహిళ మన్భవతిని చూశారు. ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆమె కూడా ఒంటరిగా జీవనం సాగిస్తోంది. ఆమెని రెండో వివాహం చేసుకున్నాడు పెద్దాయన. సంగ్రూరామ్-మన్భవతి జంట స్థానిక కోర్టులో తమ వివాహాన్ని నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత సమీపంలోని ఓ ఆలయంలో సాంప్రదాయ ఆచారాలు ప్రకారం పెళ్లి చేసుకున్నాడు.
తొలిరోజు రాత్రి ఏం జరిగింది?
మంగళవారం ఉదయం ఈ దంపతుల వివాహం జరిగింది. తొలిరోజు రాత్రి భార్యాభర్తలు చక్కగా మాట్లాడుకున్నారు. ఇంటి బాధ్యతలు నిర్వహిస్తూ పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటానని భార్యకు హామీ ఇచ్చాడు. తొలిరాత్రి ఎక్కువ సేపు కొత్త దంపతులు మాట్లాడుకుంటూ కాలం గడిపేశారు. మరుసటి రోజు ఉదయం నాటకీయ పరిణామాల మధ్య రామ్ ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించింది.
ALSO READ: ఖర్గేకు అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు
ఇరుగు పొరుగువారి సహాయంతో అతడ్ని ఆసుపత్రికి తరలించారు. వైద్యుడు వచ్చేలోపు మృతి చెందాడు. సంగ్రురామ్ మరణ వార్త గ్రామమంతా వ్యాపించింది. ఈ విషయం తెలిసి స్థానికులు దిగ్భ్రాంతి చెందారు. సంగ్రురామ్ బ్రదర్, మేనల్లుళ్లకు ఈ విషయం తెలిసింది. వారంతా ఢిల్లీలో ఉంటున్నారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే కుచ్‌ముచ్ గ్రామానికి వచ్చేశారు.
ఉళ్లోవారు జరిగినదంతా చెప్పారు. సంగ్రురామ్ మృతిని అనుమానాస్పదంగా అభివర్ణించారు, ఆయన అంత్యక్రియలను నిలిపి వేశారు. స్థానికులు మాత్రం దహన సంస్కారాలు చేయాలని వారిపై ఒత్తిడి తెస్తున్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తారా? మరణానికి కారణాలను తెలుసుకున్న తర్వాత అంత్యక్రియలు నిర్వహిస్తారా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
75 वर्ष क़े बुजुर्ग ने 35 वर्ष की महिला से विवाह रचाया… सुहागरात में ही चली गई जान
UP क़े ज़िला जौनपुर क़े 75 वर्षीय संगरूराम की पत्नि की पिछले वर्ष पत्नि की मौत क़े बाद संतानहीन बुजुर्ग ने 35 वर्ष की महिला मनभावती संग ब्याह रचा लिया।
29 सितंबर को उन्होंने जलालपुर क्षेत्र की… pic.twitter.com/mP4zJ9vND3
— True Story Delhi (@TrueStoryDelhi) September 30, 2025