కదులుతున్న రైళ్ల నుంచి పడి ప్రతి ఏటా పదుల సంఖ్యలో ప్రయాణీకులు ప్రాణాలు కోల్పోతున్నారు. రైలు ఆగిన తర్వాతే ఎక్కడం, దిగడం చేయాలని రైల్వే అధికారులు చెప్తున్నప్పటికీ ప్రయాణీకులు పట్టించుకోవడం లేదు. ఫలితంగా ఎంతో మంది చనిపోతున్నారు. తాజాగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోనూ ఇలాంటి ఘటనే జరిగింది. కదులుతున్న రైల్లో నుంచి పడిపోయిన వ్యక్తిని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) కానిస్టేబుల్ కాపాడారు. ప్లాట్ ఫారమ్ మీది నుంచి పట్టాల మధ్యలోకి పడిపోయే వ్యక్తిని ప్రాణాలకు తెగించి కాపాడాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
సెప్టెంబర్ 26న సికింద్రాబాద్ స్టేషన్ లో కదులుతున్న రైలు నంబర్ 12796 (SC–BZA) ఎక్కేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు ఓ వ్యక్తి జారిపడిపోయాడు. పక్కనే ప్లాట్ ఫారమ్ మీద ఉన్న RPF కానిస్టేబుల్ బి ప్రవీణ్ కుమార్ వెంటనే స్పందించిన సదరు వ్యక్తిని రైలు కింద పడకుండా లాగేశాడు. క్షణాల్లో అతడిని ప్రాణాలతో బయటపడేశాడు. ఈ ఘటనలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
RPF personnel B. Praveen Kumar saved a 37 year old passenger's life at Secunderabad Railway Station. He saw the passenger slipping between a moving train and the platform, and with swift action, pulled him to safety, thereby avoiding a fatal accident. @XpressHyderabad pic.twitter.com/6iUQSJWmAC
— Revanth Chithaluri (@RevanthCh_) September 30, 2025
అటు కానిస్టేబుల్ ప్రవీణ్ చాకచక్యంగా వ్యవహరించి ఓ ప్రయాణీకుడి ప్రాణాలను కాపాడటం పట్ల RPF ఉన్నతాధికారులు అతడిని ప్రశంసించారు. ప్రయాణీకుల భద్రత విషయంలో రైల్వే పోలీసులు ఎలా వ్యవహరిస్తారని చెప్పేందుకు ఇదో ఉదాహారణగా అభివర్ణించారు. “సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో 37 ఏళ్ల ప్రయాణికుడి ప్రాణాలను RPF కానిస్టేబుల్ బి. ప్రవీణ్ కుమార్ కాపాడారు. కదులుతున్న రైలు, ప్లాట్ ఫారమ్ మధ్య ప్రయాణీకుడు జారిపోవడాన్ని ఆయన గమనించి, ఫాస్ట్ గా స్పందించి అతడిని సురక్షితంగా పైకి లాగాడు. ప్రాణాలను కాపాడాడు. అతడి స్పాంటేనియస్ ను మెచ్చుకుంటున్నాం. అతడి సాహసానికి గుర్తింపుగా తగిన బహుమతిని అందించబోతున్నాం” అని రైల్వే అధికారులు ప్రకటించారు. అదే సమయంలో ప్రయాణీకులు రైళ్లు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
Read Also: వామ్మో.. రైల్వే ట్రాక్ దగ్గర గొడుగు పట్టుకుంటే ఇంత డేంజరా? మీరు అస్సలు ఇలా చేయకండి!
అటు నెటిజన్లు కూడా కానిస్టేబుల్ ప్రవీణ్ సాహసాన్ని మెచ్చుకుంటున్నారు. ఒకవేళ అతడు అక్కడ లేకుండా సదరు ప్రయాణీకుడు ప్రాణాలు కోల్పోయే వాడని చెప్తున్నారు. ఆ ప్రయాణీకుడు లేచిన టైమ్ బాగుంది కాబట్టే ప్రవీణ్ అక్కడ ఉన్నాడని కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read Also: డెలివరీ బాయ్ ను చేజ్ చేసిన 10 మంది పోలీసులు.. అసలు ఏమైందంటే?