Vijay Devarakonda: బుల్లితెరపై ప్రసారమవుతున్న రియాలిటీ షోలో బిగ్ బాస్ (Bigg Boss)కార్యక్రమానికి ఎంతో మంచి ఆదరణ ఉంది. తెలుగులో ఈ కార్యక్రమం ప్రస్తుతం 9 వ సీజన్ ప్రసారమవుతుంది. ఇప్పటికీ మూడు వారాలను ఈ కార్యక్రమం ఎంతో విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా సెలబ్రిటీలతోపాటు ఈసారి కామన్ మ్యాన్స్ కూడా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇలా కామన్ మ్యాన్ క్యాటగిరిలో భాగంగా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన వారిలో ప్రియా శెట్టి(Priya Shetty) కూడా ఒకరు.
ప్రియా శెట్టి మూడో వారంలో ఎలిమినేట్ అవడంతో హౌస్ నుంచి బయటకు వచ్చారు. ఇలా ఈమె హౌస్ నుంచి బయటకు రావడంతో ఈమెకు సంబంధించి ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈమెకు విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) సినిమాలో ఛాన్స్ వచ్చింది కానీ వదులుకున్నారు అనే వార్త చక్కర్లు కొడుతుంది. మొదటి నుంచి కూడా సినిమాలు అంటే ఎంతో పిచ్చి ఉన్న ప్రియా శెట్టి తల్లిదండ్రులకు తెలియకుండా సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు చేశారట ఇందులో భాగంగానే విజయ్ దేవరకొండ హీరోగా నటించిన డియర్ కామ్రేడ్ (Dear Comrade)సినిమాలో ఈమెకు అవకాశం వచ్చిందని తెలుస్తోంది. కొద్దిరోజులపాటు ఈమె ఈ షూటింగ్లో కూడా పాల్గొన్నారట.
ప్రియా శెట్టి సినిమాలలో నటిస్తుందనే విషయం ఈమె తల్లిదండ్రులకు తెలియడంతో ప్రియా పై కోపం తెచ్చుకొని ఆమెను ఇంటికి తీసుకెళ్ళిపోయారట. అనంతరం డియర్ కామ్రేడ్ చిత్ర బృందం ప్రియాని ఈ సినిమా షూటింగ్ కోసం పంపించాలని ఈమె తల్లిదండ్రులను ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా ఒప్పుకోలేదట. ప్రియా శెట్టి సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి కావడంతో సినిమాలలో నటించడానికి తన తల్లిదండ్రులు ఒప్పుకోలేదు ఇక చిన్నప్పటినుంచి సినిమాలలో కొనసాగాలన్న కోరికతో ఉన్న ఈమె తన తల్లిదండ్రుల కోరిక మేరకు మెడిసన్ పూర్తి చేసి డాక్టర్ గా ప్రాక్టీస్ చేస్తున్నారు.
సినిమా ఛాన్సులు వస్తే నటిస్తారా?
ఇకపోతే బిగ్ బాస్ లో కామన్ మ్యాన్ క్యాటగిరిలో అవకాశాలు ఉన్నాయని ప్రకటించడంతో తన కుటుంబ సభ్యుల అంగీకారంతో, వారి ప్రోత్సాహంతోనే అగ్నిపరీక్ష కార్యక్రమంలోకి ఎంట్రీ ఇచ్చి అనంతరం బిగ్ బాస్9(Bigg Boss 9) కార్యక్రమంలో పాల్గొనే అవకాశాన్ని కూడా అందుకున్నారు. ఇక మూడు వారాలపాటు హౌస్ లో కొనసాగిన ప్రియా శెట్టి ప్రస్తుతం సెలబ్రిటీ హోదాని దక్కించుకున్నారు. మరి ఇప్పుడు కనుక తనకు సినిమాలలో అవకాశాలు వస్తే తిరిగి సినిమాలలోకి వస్తారా? లేదంటే తన డాక్టర్ వృత్తిలోనే కొనసాగుతారా? అనే విషయం తెలియాల్సి ఉంది.. విజయ్ దేవరకొండ సినిమాలో ఈమెకు అవకాశం వచ్చింది అంటూ వస్తున్న ఈ వార్తలలో కూడా ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది.
Also Read: Boyapati Sreenu: అఖండ 2 విడుదలపై బోయపాటి క్లారిటీ … కథ మొత్తం దాని చుట్టే అంటూ!