AP RDMHS: ఏపీ రాష్ట్ర నిరుద్యోగ అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్.. ఏపీ వైద్యారోగ్య శాఖలో పలు ఉద్యోగాలను నింపేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత కలిగిన అభ్యర్థులకు ఇది గోల్డెన్ అపార్చునిటీ అని చెప్పవచ్చు. టెన్త్, డీఫార్మసీ/బీఫార్మసీ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం ఉంటుంది. సొంత రాష్ట్రంలో ఉద్యోగం చేసుకునే అవకాశం వచ్చింది. అర్హత ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హత, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం, దరఖాస్తు విధానం, వయస్సు తదితర వివరాల గురించి క్లియర్ కట్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
రాజమహేంద్రవరంలోని రీజినల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ (AP RDMHS) లో కాంట్రాక్ట్ విధానంలో ఖాళీగా ఉన్న ఫార్మసీ ఉద్యోగాల భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి అభ్యర్థులు ఆసక్తి కలిగిన అభ్యర్థులు అక్టోబర్ 3వ తేదీ నుంచి 15 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు.
మొత్తం ఉద్యోగ వెకెన్సీల సంఖ్య: 12
రీజినల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ లో ఫార్మసీ ఆఫీసర్ (ఫార్మసిస్ట్ గ్రేడ్-2) ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.
పోస్టులు- వెకెన్సీలు
ఫార్మసీ ఆఫీసర్ (ఫార్మసిస్ట్ గ్రేడ్ 2) : 12 పోస్టులు
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో టెన్త్, డీఫార్మసీ లేదా బీఫార్మసీ పాసై ఉండాలి. ఈ అర్హత ఉన్న వారు వెంటనే దరఖాస్తు చేసుకోండి.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తుకు ప్రారంభ తేది: అక్టోబర్ 3
దరఖాస్తుకు చివరి తేది: అక్టోబర్ 15
వయస్సు: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 42 నుంచి 52 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
జీతం: సెలెక్ట్ అయిన వారికి గౌరవ ప్రదమైన జీతం ఉంటుంది. నెలకు రూ.32,670 వేతనం ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: ఓసీ అభ్యర్థులకు రూ.500 ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.300 ఫీజు ఉంటుంది.
నోటిఫికేషన్ కు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించండి.
అఫీషియల్ వెబ్ సైట్: https://krishna.ap.gov.in/
అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి. అక్టోబర్ 3 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అవుతోంది. సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం కూడా ఉండును. నెలకు రూ.32,670 వేతనం ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం.. అక్టోబర్ 3 నుంచి స్టార్ అయ్యే ఈ దరఖాస్తు ప్రక్రియకు అప్లై చేసుకోండి.
నోటిఫికేషన్ కీలక సమాచారం:
మొత్తం ఉద్యోగ వెకెన్సీల సంఖ్య: 12
దరఖాస్తుకు చివరి తేది: అక్టోబర్ 15
ALSO READ: TCS Layoffs: ఆందోళనలో TCS ఉద్యోగులు, ఏకంగా 30 వేల ఉద్యోగాలు అవుట్!