Budget Bikes: దసరా పండుగ సీజన్ లో, వివిధ డిస్కౌంట్లు, ఆఫర్లుతో 100సిసి బైక్ కొనడానికి ఇది గొప్ప టైమ్. తక్కువ బడ్జెట్‌లోనూ మంచి మైలేజీ, తక్కువ రిపేర్ ఖర్చు, నమ్మకమైన పనితీరు ఉన్న బైక్‌లను సులభంగా కొనుగోలు చేయవచ్చు. కానీ ఎక్కువ బడ్జెట్ ఉంటే ఎలా కొనాలి అనుకునే వారికి తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైక్‌లు మీ కోసం తీసుకుని వచ్చాము. ఇప్పుడు, రూ. 80,000 కంటే తక్కువ ధరలో మార్కెట్‌లో లభించే టాప్ 6 బైక్‌లు ఏమిటో తెలుసు కుందామా.
1. హోండా షైన్ 100:
హోండా షైన్ 100 ప్రీమియం కమ్యూటర్ బైక్. 98.98సిసి ఎయిర్-కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్, 7.41 పిఎస్ పవర్, 8.05 ఎన్ఎం టార్క్ తో వస్తుంది.
మైలేజీ: లీటర్‌కి 65-70 కిలోమిటర్లు
ధర: రూ. 63,191వేలు (జిఎస్‌టి తగ్గింపు తర్వాత) 3 సంవత్సరాలు 42,000 కి.మీ వారంటీ
కలర్స్: మూడు రంగుల్లో లభించడమే కాకుండా, నగరాల్లో సులభంగా రైడ్ చేయడానికి ఇది మంచి బైక్.
2. బజాజ్ ప్లాటినా 110
బజాజ్ ప్లాటినా 110 బడ్జెట్-ఫ్రెండ్లీ కమ్యూటర్. 115.45cc DTS-i ఇంజిన్ 8.6 PS పవర్, 9.81 Nm టార్క్ తో ఉంది. 5-స్పీడ్ గేర్‌బాక్స్, గరిష్ట వేగం, లీటర్‌కి 90. 11L ఫ్యూయల్ ట్యాంక్, 200mm గ్రౌండ్ క్లియరెన్స్, కొత్త టెయిల్‌లైట్ డిజైన్
మైలేజీ: 60-65 kmpl
ధర: రూ. 69,284, రోజువారీ రైడ్స్‌కు తక్కువ ఖర్చులో చక్కటి ఎంపిక.
3. హీరో స్ప్లెండర్ ప్లస్
భారతదేశంలో అత్యంత ప్రసిద్ధ 100cc బైక్. i3S (Idle Start-Stop) టెక్నాలజీతో 4-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్. 5 సంవత్సరాల వారంటీ ఇస్తున్నారు.
మైలేజీ: 60-70 kmpl
ధర: రూ. 73,902 ఉంది. నమ్మకమైన, లాంగ్-టర్మ్ కమ్యూన్టర్ కోసం సరైనది.
4. బజాజ్ సిటీ 110X
బజాజ్ సిటీ 110X బైక్ చూడటానికే కాదు, యువతకు ఉపయోగకరంగా ఉండే బైక్. దీని స్ట్రోక్ ఇంజిన్ 115.45cc 4 కాగా, 8.6 PS పవర్, 10.5L ఫ్యూయల్ ట్యాంక్. దీని గరిష్ట వేగం 90 kmph ఉంది.
మైలేజీ: 65-70 kmpl
ధర: రూ. 67,284 అందుబాటులో ఉంది. నగర రోడ్లపై సులభంగా రైడ్ చేయగల ఆర్బన్ కమ్యూటర్.
5. హీరో ప్యాషన్ ప్లస్
హీరో ప్యాషన్ ప్లస్ దీని గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే, ఇప్పటి వరకు చెప్పిన బైక్స్ కన్నా మరింత స్టైలిష్ గా ఉంటుంది. ఇందులో 97.2cc ఎయిర్-కూల్డ్ ఇంజిన్, స్టైలిష్ డిజైన్, USB ఛార్జింగ్ పోర్ట్, సైడ్ స్టాండ్ ఇండికేటర్. టెలిస్కోపిక్ ఫ్రంట్, ట్విన్ ట్యూబ్ రియర్ సస్పెన్షన్. 10L ఫ్యూయల్ ట్యాంక్, 18-ఇంచ్ అల్లాయ్ టైర్లు స్టైలిష్ తగ్గట్టు ఉంది.
మైలేజీ: 60-65 kmpl
ధర: రూ. 76,691 మాత్రమే ఉంది. యువతను ఆకట్టుకునే ఐకానిక్ లుక్ కలిగి ఉంటుంది.
6. హోండా Livo
హోండా Livo అంటేనే మోడరన్ కమ్యూటర్ స్టైల్ అని చెప్పొచ్చు. దీని 109.51cc ఎయిర్-కూల్డ్ SI ఇంజిన్. 18-ఇంచ్ ట్యూబ్‌లెస్ టైర్లు, 6L ఫ్యూయల్ ట్యాంక్
మైలేజీ: 60-65 kmpl
ధర: రూ. 79,809 అందుబాటులో ఉంది. స్మూత్ రైడింగ్ , ఫ్యూయల్ ఎఫిషియెన్సీ కోసం పర్ఫెక్ట్.
హోండా, హీరో మోడల్స్ మైలేజీకి ముందుగా ఉంటాయి, బజాజ్ మోడల్స్ తక్కువ ధరలో అదనపు ఫీచర్స్ అందిస్తాయి. దసరా ఆఫర్లు, ఫైనాన్సింగ్ ఆప్షన్స్ డీలర్ల వద్ద తనిఖీ చేయండి. మీ అవసరానికి తగినది ఎంచుకొని, పండుగ రైడింగ్ ఆనందించండి!