Nagarjuna: టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో నాగార్జున (Nagarjuna) కి ఢిల్లీ హైకోర్టులో భారీ ఊరట కలిగింది. ముఖ్యంగా ఆయన వేసిన పిటీషన్ ను పరిశీలించిన ఢిల్లీ ధర్మాసనం ఆయనకు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో నాగార్జున ఊపిరి పీల్చుకున్నారు. మరి అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం..
ఇటీవల నాగార్జున తన వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పించాలి అని కోర్టులో పిటిషన్ వేయగా.. ఇప్పుడు ఆయన హక్కులకు రక్షణ కల్పిస్తూ ఢిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన పేరు, ప్రతిష్ట , గొంతు, వ్యక్తిత్వానికి సంబంధించిన ఇతర అంశాలను ముందస్తు అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం ఎవరు కూడా ఉపయోగించకూడదు అని జస్టిస్ తేజస్ కారియా మంగళవారం రోజు ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వులలో భాగంగా ఇకపై గుర్తు తెలియని వ్యక్తులు, సంస్థలు, వెబ్సైట్లు ఇలా ఎవరైనా సరే నాగార్జున వ్యక్తిత్వానికి సంబంధించిన కంటెంట్ ను ఉపయోగించకూడదు అని, ముఖ్యంగా ఆయన అనుమతి లేకుండా ప్రసారం చేయడం, షేర్ చేయడం, దుర్వినియోగం చేయడం పూర్తిగా నిషిద్ధం. ఇలా చేస్తే కఠిన చర్యలు తప్పవు అంటూ న్యాయమూర్తి తన ఉత్తర్వులలో తెలిపారు.
ALSO READ:Singer Zubeen Garg: జుబీన్ గార్గ్ కేసులో ట్విస్ట్.. మరో వ్యక్తి అరెస్ట్!
చట్టపరమైన చర్యలు తీసుకుంటాం..
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (AI) , మిషన్ లెర్నింగ్, డీప్ ఫేక్స్ , జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, ఫేస్ మార్కింగ్ చేయడం లాంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలకు బాధ్యతలు అవుతారని కూడా న్యాయమూర్తి హెచ్చరించారు. అంతేకాదు నాగార్జున తన పిటీషన్ లో పేర్కొన్న వెబ్సైట్ లింకులను కూడా 72 గంటల్లో తొలగించాలని, ఆయా సంస్థలకు కూడా ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. యూఆర్ఎల్ లను అన్నింటినీ బ్లాక్ చేసేలా.. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ డిపార్ట్మెంట్ ఆఫ్ ఢిల్లీ కమ్యూనికేషన్ లు చర్యలు తీసుకోవాలని కూడా కోరింది. ఇక తదుపరి విచారణను 23కు వాయిదా వేసింది కోర్ట్.
అసలేం జరిగిందంటే?
అసలు విషయంలోకి వెళ్తే.. గత వారం ఏఐ సహాయంతో పోర్నోగ్రఫీ కంటెంట్ లింక్స్ క్రియేట్ చేసి పరువు కి భంగం కలిగించారని.. అనుమతి లేకుండా ఫోటోలు, వీడియోలు, పేరు ఉపయోగించి వెబ్సైట్స్ బిజినెస్ చేస్తున్నాయని, అలాగే ఏఐ సహాయంతో యూట్యూబ్ షార్ట్స్, వీడియోలు క్రియేట్ చేయడం , వాటికి నాగార్జున హ్యాష్ ట్యాగ్ ఇవ్వడం చేస్తున్నారని దీనివల్ల నాగార్జున వ్యక్తిగత హక్కులకు భంగం వాటిల్లుతోందని, వీటిపై చర్యలు తీసుకోవాలని నాగార్జున తరపు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు . అంతేకాదు టీ షర్టుల పైన ఆయన ఫోటో ముద్రించి బిజినెస్ చేస్తున్నట్లు తెలిపారు.. ఇవన్నీ కూడా నాగార్జున అనుమతి లేకుండా చేస్తూ ఆయన పరువుకు భంగం కలిగిస్తున్నారని దయచేసి వీటిని ఆపాలి అని తమ పిటీషన్ లో పేర్కొన్నారు. అంతేకాదు వ్యక్తిగత హక్కులను కాపాడాలని పిటీషన్ లో కోరిన నాగార్జున తరపు న్యాయవాది.. అందులో ఏఐ వీడియోలు అప్లోడ్ చేసిన 14 వెబ్సైట్ లింకులను కూడా జోడించి వెంటనే వీటిని కూడా తొలగించాలని డిమాండ్ చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఆయనకు అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేసింది.
ఇప్పటివరకు కోర్టును ఆశ్రయించిన సెలబ్రిటీస్ వెళ్లే..
ఇకపోతే నాగార్జున మాత్రమే కాకుండా ఇప్పటికే అమితాబ్ బచ్చన్, కరణ్ జోహార్, అనిల్ కపూర్, ఐశ్వర్యరాయ్ , అభిషేక్ బచ్చన్ వంటి వారు కూడా ఇదే విషయంలో కోర్టును ఆశ్రయించి ఊరట పొందిన విషయం తెలిసిందే.