BigTV English

Red Flowers on Wednesday: బుధవారం ఎర్రని పూలతో పూజ చేస్తే..

Red Flowers on Wednesday: బుధవారం ఎర్రని పూలతో పూజ చేస్తే..

Red Flowers on Wednesday:బుధవారం గణేశుడికి ప్రీతికరమైన రోజు. బుధవారం రోజున వినాయకుడ్ని పూజించి ,ఉపవాసం చేస్తే స్వామి అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. శ్రీ గణేషుడిని విఘ్నహర్త అంటారు. ఏ పనికి ఆటంకం లేకుండా అన్ని పనిల్లో విజయం లభించేలా చేస్తుంది. అన్ని దేవుళ్ళు దేవతలలో, గణేశుడికి ప్రథమ ఆరాధన స్థానం లభించింది. అందుకే ఏ శుభ కార్యంలోనైనా ముందుగా వినాయకుడిని పూజిస్తారు. విఘ్నేశ్వరుడికి శమీ మొక్క అంటే చాలా ఇష్టమని నమ్ముతారు. బుధవారం నాడు వినాయకునికి శమీ మొక్కను సమర్పిస్తే ఇంట్లో ఐశ్వర్యం, శాంతి నెలకొంటుంది.


వినాయకుని విగ్రహానికి ఉండే రంగు చాలా ముఖ్యమైంది. అది ఆకర్షించే శక్తిని ప్రభావితం చేస్తుంది. మీరు ఆనందం సౌకర్యాన్ని ఆకర్షించాలనుకుంటే తెల్లటి గణపతి విగ్రహం అనువైనది వినాయకుడు,స్వస్తిక్ కలిసిన ఉన్న విగ్రహాన్ని పూజిస్తే వాస్తు దోషాలు పోతాయి.వినాయకుడి విగ్రహంతో పాటు తప్పనిసరిగా ఎలుక విగ్రహం ఉండాలి

శాస్త్రాల ప్రకారం, వినాయకుడికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం. కావున బుధవారం నాడు వినాయకుని పూజలో ఎర్రటి సింధూరం తిలకం రాయండి. దీని వల్ల భక్తునిపై గణేశుడి అనుగ్రహం కురుస్తుంది. గణపతి పూజలో ఎర్ర రంగు వస్తువులను ఉపయోగించాలి . శ్రీ గణపతి రంగు ఎర్రగా ఉంటుంది. ఆయన పూజలో ఎర్రని వస్త్రము ఎర్రని పువ్వులు, రక్తచందనాన్ని ఉపయోగిస్తారు.


పూజలో అన్నం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. వినాయకుడికి అన్నం అంటే చాలా ఇష్టమని చెబుతారు. ఎండు బియ్యం లాంటివి పెట్టకుండా పూజ సమయంలో తడి అన్నం స్వామికి నివేదించాలి. అలా చేస్తే సంతోషించి, అతను కోరుకున్న ఫలితాలను పొందడానికి భక్తులకు దీవెనలు ప్రసాదిస్తాడు.బుధవారం నాడు గణేశుడికి నెయ్యి, బెల్లం సమర్పించాలి. దీంతో వినాయకుడు చాలా సంతోషిస్తాడు. గణేశుడి అనుగ్రహం వల్ల ఇంట్లో ధనానికి సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి. జీవితంలో సంతోషం వస్తుంది. వివాహ సమస్యలు, ఉద్యోగం చేసే చోట సమస్యలు ఉంటే అలాంటి వారు చవితి రోజు వినాయకుడ్ని పూజిస్తే ఉపశమనం పొందుతారు.

Tags

Related News

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Big Stories

×