BigTV English

IND Vs PAK : ఆసియా కప్ కంటే ముందు పాకిస్థాన్ ను వణికిస్తున్న రికార్డులు…. టీమిండియాతో పెట్టుకుంటే మాడి మసి అయిపోవాల్సిందే..

IND Vs PAK : ఆసియా కప్ కంటే ముందు పాకిస్థాన్ ను వణికిస్తున్న రికార్డులు…. టీమిండియాతో పెట్టుకుంటే మాడి మసి అయిపోవాల్సిందే..

IND Vs PAK : ఆసియా కప్ 2025 (Asia Cup 2025)  సెప్టెంబర్ 9న ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే. టీమిండియా(Team india) తొలి మ్యాచ్ సెప్టెంబర్ 9న యూఏఈ (UAE) తో తలపడనుంది. సెప్టెంబర్ 14న పాకిస్తాన్ తో మ్యాచ్ ఆడనుంది టీం ఇండియా. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో పలు వార్తలు వినిపిస్తున్నాయి. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే.. ప్రపంచవ్యాప్తంగా ఎంతటి క్రేజీ ఉంటుందో అందరికీ తెలిసిందే. మరోవైపు ఇటీవలే పల్గామ్ లో ఉగ్ర దాడి జరగడంతో ఇరుదేశాల మధ్య అగ్గిస్తే భగ్గుమన్నట్టు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 1947 లో భారత్, పాకిస్తాన్ విభజన తర్వాత తొలిసారిగా 1952లో మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఇరు జట్లు తలపడ్డాయి. ఆతిథ్య భారత్ 2-1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది.


టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ టీ-20 మ్యాచ్ ల వివరాలు

  • డర్బన్ వేదికగా సెప్టెంబర్ 14, 2007న జరిగిన తొలి టీ-20 టై కావడంతో.. బౌల్డ్ ఔట్ ద్వారా ఇండియా విజయం సాధించింది.
  • జొహాన్స్ బర్గ్ వేదికగా సెప్టెంబర్ 24, 2007న జరిగిన టీ-20 వరల్డ్ కప్ ఫైనల్ లో పాకిస్తాన్ పై టీమిండియా 5 రన్స్ తేడాతో విజయం సాధించింది.
  • కొలొంబో లో సెప్టెంబర్ 30, 2012న జరిగిన మ్యాచ్ పాకిస్తాన్ పై టీమిండియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
  • బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియంలో డిసెంబర్ 28, 2012లో జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ పై భారత జట్టు 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.
  • అహ్మదాబాద్ లో డిసెంబర్ 28, 2012లో టీమిండియా పాకిస్తాన్ పై 11 రన్స్ తేడాతో విజయం సాధించింది.
  • మిర్పూర్ లో మార్చి 21, 2014లో జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ పై టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
  • మిర్పూర్ లో ఫిబ్రవరి 27, 2016 పాకిస్తాన్ జట్టు పై భారత జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
  • ఈడెన్ గార్డెన్ లో మార్చి 19, 2016న జరిగినటువంటి మ్యాచ్ లో పాకిస్తాన్ జట్టు పై భారత జట్టు  6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
  • దుబాయ్ లో అక్టోబర్ 24, 2021లో జరిగిన మ్యాచ్ లో టీమిండియా పై పాకిస్తాన్ జట్టు 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
  • దుబాయ్ వేదికగా ఆగస్టు 28, 2022లో జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ జట్టు పై టీమిండియా 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
  • దుబాయ్ వేదికగా సెప్టెంబర్ 04, 2022లో పాకిస్తాన్ జట్టు టీమిండియా పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
  • మెల్ బోర్న్ వేదికగా అక్టోబర్ 23, 2022న జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ పై టీమిండియా 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
  • న్యూ యార్క్ లో జూన్ 09, 2024న జరిగిన మ్యాచ్ లో టీమిండియా పాకిస్తాన్ పై 6 పరుగుల తేడాతో విజయం సాధించింది.
  • ఇప్పటి వరకు మొత్తం 13 మ్యాచ్ లు జరిగితే వాటిలో టీమిండియా 10 మ్యాచ్ ల్లో విజయం సాధించగా.. పాకిస్తాన్ కేవలం 3 మ్యాచ్ ల్లో మాత్రమే విజయం సాధించడం విశేషం.

2007 టీ-20 ప్రపంచ కప్ లో ఉత్కంఠ.. 


ఇక  2007లో దక్షిణాఫ్రికాలో జరిగిన తొలి టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్ దశలో టీ20 మ్యాచ్‌లో భారత్- పాకిస్థాన్ (Ind-PaK)  జట్లు తలపడ్డాయి.  ఇక ఈ రెండు జట్లు పొట్టి ఫార్మాట్‌లో 13 సార్లు స్క్వేర్ ఆఫ్ అయ్యాయి. భారత్ 9-3తో హెడ్-టు-హెడ్ రికార్డ్‌లో ఆధిక్యంలో ఉంది. ఇరు జట్ల మధ్య జరిగిన ఒక మ్యాచ్ టైగా ముగిసింది. ముఖ్యంగా భారత్ వర్సెస్ పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన తొలి టీ-20 మ్యాచ్ అత్యంత ఉత్కంఠభరితమైన వాటిలో ఒకటిగా గుర్తుండిపోతుంది.

ఎం.ఎస్. ధోనీ కెప్టెన్సీలో భారత్ 141/9 స్కోర్ చేసింది. రాబిన్ ఉతప్ప 39 బంతుల్లో 50 పరుగులు చేశాడు. 142 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ చివరి ఓవర్ లో 12 పరుగులు కావాల్సి ఉండగా.. మిస్బా ఉల్ హక్, ఆల్ రౌండర్ యాసిన్ అరాఫత్ క్రీజులో ఉన్నారు. చివరి ఓవర్ తొలి బంతికి అరాఫత్ సింగిల్ తీసి మిస్బా ఉల్ హాక్ కి స్ట్రైక్ ఇచ్చాడు. అతను తరువాత మూడు బంతుల్లో 10 పరుగులు చేశాడు. రెండు బంతుల్లో ఒక్క పరుగు అవసరం కాగా.. భారత ఆటగాడు శ్రీశాంత్ ఒక డాట్ బాల్ వేశాడు. ఆ తరువాత చివరి బంతికి మిస్బా ఉల్ హాక్ బంతిని కవర్ వైపు కొట్టాడు.

పాకిస్తాన్ ను వణికిస్తున్న టీమిండియా రికార్డులు.. 

దీంతో యువరాజ్ సింగ్ (Yuvaraj Singh)  దానిని నాన్ స్ట్రైకర్స్ ఎండ్ కి విసిరాడు. ఇక్కడ మ్యాచ్ నాటకీయంగా టైగా ముగిసింది. బెయిల్ ను కొట్టడానికి శ్రీశాంత్ అక్కడ ఉన్నాడు. రికార్డు పుస్తకాలలో మ్యాచ్ టైగా నమోదు చేయబడినప్పటికీ.. రెండు జట్లు బౌల్డ్ ఔట్  ఆడాయి. అందులో టీమిండియా విజయం సాధించింది.

అలాగే ఫైనల్ 2007 టీ-20 వరల్డ్ కప్ లో టీమిండియా పాకిస్తన్ పై విజయం సాధించింది. ICC T20 ప్రపంచ కప్‌లలో భారతదేశం 6-1 ఆధిక్యంలో ఉంది. 2021 దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ జట్టు టీమిండియా పై విజయం సాధించింది. ఆసియా కప్ కంటే ముందే పాకిస్తాన్ ను టీమిండియా రికార్డులు వణికిస్తున్నాయనే చెప్పాలి. నెటిజన్లు టీమిండియాతో పెట్టుకుంటే పాకిస్తాన్ మాడి మసీ అయిపోవాల్సిందే అంటూ పేర్కొంటున్నారు.

 

Related News

BCCI president: బీసీసీఐకి కొత్త బాస్.. ఇక టీమిండియాలో పెను మార్పులు!

Tim David: సొంత దేశం వాళ్ళే ఛీ కొట్టారు.. కానీ ఇప్పుడు ప్రపంచాన్ని ఏలుతున్నాడు.. RCB ప్లేయర్ సక్సెస్ వెనుక కన్నీళ్లు

Sameer Rizvi : సమీర్ రిజ్వి అరాచకం… 9 సిక్సులు, 3 బౌండరీలతో రెచ్చిపోయాడుగా.. ఇదిగో వీడియో

Pro Kabaddi League 2025: నేటి నుంచి ప్రో కబడ్డీ లీగ్… తొలి వాచ్ తెలుగు టైటాన్స్ దే…టైమింగ్స్, ఉచితంగా ఎలా చూడాలంటే

OLYMPICS 2036 : 2036 ఒలింపిక్స్ నిర్వహణకు బిడ్.. కావ్య పాప, సంజీవ్ తో రేవంత్ భారీ ప్లాన్

Big Stories

×