Weight Gain: బరువు పెరగడం అనేది చాలామందికి ఒక సవాలనే చెప్పాలి. కొందరు బరువు తగ్గడానికి ప్రయత్నిస్తే.. మరికొందరు ఆరోగ్యకరమైన రీతిలో బరువు పెరగాలని కోరుకుంటారు. బరువు పెరగడానికి చాలా మార్గాలు ఉన్నప్పటికీ.. పండ్ల రసాలు ఒక సులభమైన పద్ధతి. ఇవి కేవలం పోషకాలను అందించడమే కాకుండా, శరీరానికి అవసరమైన క్యాలరీలను కూడా ఇస్తాయి. మరి బరువు పెరగడానికి ఎలాంటి ఫూట్ జ్యూస్‌లు తాగాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బరువు పెరగడానికి జ్యూస్‌లు:
ఫ్రూట్ జ్యూస్‌లలో సహజమైన చక్కెరలు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని అందిస్తాయి. కానీ.. బరువు పెరగడానికి పండ్ల రసాలను ఎంపిక చేసుకునేటప్పుడు.. కేవలం పండ్లతో మాత్రమే కాకుండా.. వాటికి కొన్ని ఇతర పదార్థాలను కలపడం ద్వారా క్యాలరీల సంఖ్యను పెంచుకోవచ్చు. పండ్ల రసాలలో కార్బోహైడ్రేట్లు, కొన్ని సందర్భాల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు కలపడం ద్వారా బరువు పెరగడానికి అవి మరింత ప్రభావవంతంగా పనిచేస్తాయి.
బనానా మిల్క్ షేక్:
బరువు పెరగడానికి అరటిపండు అద్భుతంగా పనిచేస్తుంది. అరటిపండ్లలో అధిక మొత్తంలో కార్బోహైడ్రేట్లు, క్యాలరీలు ఉంటాయి. అరటిపండును పాలు, తేనె లేదా పీనట్ బటర్ కలిపి షేక్ లాగా తయారు చేసి తీసుకుంటే.. అది క్యాలరీల సంఖ్యను బాగా పెంచుతుంది. ఈ షేక్ ఉదయం పూట లేదా వ్యాయామం తర్వాత తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.
మామిడిపండు షేక్:
మామిడిపండులో సహజమైన చక్కెరలు, క్యాలరీలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. మామిడిపండును పాలు లేదా పెరుగుతో కలిపి షేక్ చేసుకుని తాగితే.. బరువు త్వరగా పెరగడానికి సహాయపడుతుంది. మామిడిపండులో ఉండే ఫ్రక్టోస్ (పండ్లలోని చక్కెర) శరీరానికి శక్తిని అందిస్తుంది.
ఖర్జూరం, పాల షేక్:
ఖర్జూరంలో సహజమైన చక్కెరలు, ఇనుము, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఖర్జూరాలను పాలతో కలిపి షేక్ చేసుకుంటే.. అది బరువు పెరగడానికి శక్తివంతమైన డ్రింక్ అవుతుంది. ఈ డ్రింక్ రుచికరంగా ఉండటమే కాకుండా.. శరీరానికి తక్షణ శక్తిని కూడా ఇస్తుంది. దీనిలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
అవకాడో షేక్:
అవకాడో ఆరోగ్యకరమైన కొవ్వులకు నిలయం. ఇది బరువు పెరగడానికి చాలా మంచిది. అవకాడోను పాలు, తేనె లేదా కొబ్బరి పాలతో కలిపి షేక్ చేసుకుంటే, క్యాలరీల సంఖ్య పెరుగుతుంది. అవకాడో షేక్ గుండె ఆరోగ్యానికి కూడా మంచిది.
Also Read: జుట్టు చిట్లిపోతోందా ? ఇలా చేసి చూడండి !
కొబ్బరిపాలు, డ్రై ఫ్రూట్స్ షేక్:
బరువు పెరగడానికి ఇది ఒక అద్భుతమైన డ్రింక్. కొబ్బరి పాలు, జీడిపప్పు, బాదం, ఎండు ద్రాక్ష వంటి డ్రై ఫ్రూట్స్‌ను కలిపి బ్లెండ్ చేసుకుంటే.. అది క్యాలరీలు, ఆరోగ్యకరమైన కొవ్వులు, పోషకాలను అందిస్తుంది. ఈ షేక్ బరువు పెరగడానికి సహాయపడుతుంది అంతే కాకుండా శరీరానికి అవసరమైన పోషణను ఇస్తుంది.
బరువు పెరగడానికి పండ్ల రసాలు ఒక సులభమైన, ఆరోగ్యకరమైన మార్గం. అయితే.. కేవలం పండ్ల రసాలపై ఆధారపడకుండా.. పౌష్టికాహారం తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. నిపుణుల సలహా తీసుకొని.. మీ డైట్ లో ఈ జ్యూస్ లను చేర్చుకుంటే, మీరు ఆరోగ్యకరమైన రీతిలో బరువు పెరగవచ్చు.