BigTV English

Monalisa: సౌత్ లోకి కుంభమేళా మోనాలిసా ఎంట్రీ.. ఏ హీరో సినిమానో తెలుసా..?

Monalisa: సౌత్ లోకి కుంభమేళా మోనాలిసా ఎంట్రీ.. ఏ హీరో సినిమానో తెలుసా..?

Monalisa: మన నుదుటి రాత దేవుడు ఎలా రాస్తే అలానే జరుగుతుంది అని పెద్దలు చెబుతుంటారు. పాప, పుణ్యాలు అనేది కాస్త ఆలస్యమైనా కచ్చితంగా జరుగుతాయని అన్నది ఎంత నిజమో అదృష్టం తలుపు తడితే వాళ్ల దశ మారడం అంతే నిజం. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నామని డౌట్ మీకు రావచ్చు.. కుంభమేళా సమయంలో పూసలమ్ముకుంటూ కనిపించిన ఓ 16 ఏళ్ల అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. కొంతమందికి నమ్మశక్యం కాకపోయినా సరే ఇది నిజమే. పూసల అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న కుంభమేళా మోనాలిసా ఒక్కసారిగా పాపులర్ అయిపోయింది. తేనె కళ్ళ సుందరిగా పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు ఒక్కో సినిమాతో తన టాలెంట్ ని నిరూపించుకుంటుంది. ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఏ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ వస్తుందో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..


సౌత్ సినిమాలోకి  తేనెకళ్ల సుందరి ఎంట్రీ …

అదృష్టం అనేది ఎప్పుడు ఎలా తలుపుతడుతుందో చెప్పడం కష్టం. ఒక్కొక్కసారి ఊహించకుండానే అనుకోని స్థాయి, గుర్తింపు లభిస్తూ ఉంటాయి. సరిగ్గా ఇప్పుడు ఒక అమ్మాయి జీవితంలో అలాగే జరిగిందని చెప్పాలి. మహా కుంభమేళాలో పూసలు అమ్ముకోవడానికి వచ్చిన ఒక అమ్మాయికి ఇప్పుడు అభిమానులు నీరాజనం పడుతున్నారు. ఎక్కడికి వెళ్లినా ఆమెను చూడడానికి ఎగబడుతున్నారు. ఆ ముద్దుగుమ్మ మరెవ్వరో కాదు మోనాలిసా భోంస్లే.. ఒక్క వీడియోతో ఆమె ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఇప్పుడు సినిమాలతో బిజీ అయిపోయింది.


 

బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీ పై కన్నేసింది.. ఓ మలయాళీ సినిమాలో ఆఫర్ రావడంతో త్వరలో సౌత్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది మోనాలిసా. ఈ మధ్యే పూజా కార్యక్రమాలు కూడా పూర్తిచేసుకున్న సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే స్టార్ అవ్వబోతుంది. అందుతున్న సమాచారం ప్రకారం నాగమ్మ సినిమాలో లీడ్ రోల్ చేస్తుందని టాక్.. ఇందులో నటుడు కైలాష్ కూడా కనిపించనున్నారు.. జీలీ జార్జ్ నిర్మించనున్న ‘నాగమ్మ’ సినిమాకు పి. బీను వర్గీస్ దర్శకుడు.. సెప్టెంబర్ లో షూటింగ్ మొదలు కాబోతుందని సమాచారం..

Also Read : ఐటీలో జాబ్.. సినిమాల వల్ల చాలా నష్టపోయాను.. రాగ్ మయూర్ సంచలన వ్యాఖ్యలు..

‘సాదగి’ సాంగ్ తో పాపులర్…

ఈ అమ్మడు జీవితం ఊహించని విధంగా మారుతుంది.. రోజు రోజుకు బిజీగా మారుతుంది. ‘ది డైరీ ఆఫ్ మణిపూర్’ అనే బాలీవుడ్ సినిమాలో నటిస్తోంది. ఇది ఇంకా విడుదల కాలేదు కానీ ఇప్పుడు మరో మూవీ లైనప్ లోకి వచ్చేసింది. నటనలోకి ప్రవేశించే ముందు, మోనాలిసా ఓ సాంగ్ చేసింది. ‘సాదగి’ పేరుతో విడుదలైన సాంగ్ బాగా పాపులర్ అయ్యింది. ఈమె ఒక్క సినిమాకు లక్షల్లో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. చూస్తుంటే అతి కొద్ది రోజుల్లోనే స్టార్ హీరోయిన్ అయిన ఆశ్చర్యపోనవసరం లేదు. మరి సౌత్ లో ఈ అమ్మడు క్రేజ్ పెరుగుతుందేమో చూడాలి..

Related News

Chiranjeevi: మెగాస్టార్ గొప్ప మనసు.. మహిళా అభిమానికి అందమైన బహుమతి..

Vishal Sai Dhanshika: ఘనంగా సాయి ధన్సికతో హీరో విశాల్ ఎంగేజ్మెంట్.. ఫోటోలు వైరల్!

Komali Prasad: ఆశగా ఎదురుచూస్తున్నా.. ఊహించని కామెంట్స్ చేసిన నాని హిట్ 3 బ్యూటీ!

Nikhil Siddhartha: నిఖిల్ అన్నా.. స్వయంభు ఉన్నట్టా .. లేనట్టా ?

HBD Nagarjuna : 100 కోట్ల టార్గెట్ గా 100వ మూవీ… అందుకే ఈ ఆలస్యం

Big Stories

×