KCR Meeting: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈసారి హాట్‌హాట్‌గా సాగుతాయా? మాజీ సీఎం కేసీఆర్ హాజరవుతున్నారా? కాళేశ్వరం రిపోర్టుపై సభలో చర్చ నేపథ్యంలో వస్తున్నారా? లేదా? కాకపోతే ఈ అంశంపై బాధ్యతలు హరీష్‌రావుకి అప్పగించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శనివారం నుంచి మొదలుకానున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో మాజీ సీఎం కేసీఆర్‌తో ఆ పార్టీ కీలక నేతలు సమావేశమయ్యారు. అసెంబ్లీ సమావేశాల్లో అధికార పార్టీని ఇరుకునే పెట్టే అంశాలపై క్షుణ్నంగా చర్చించారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక గురించి అసెంబ్లీలో చర్చ జరగనుంది. దీనికి మాజీ సీఎం కేసీఆర్ హాజరుకావాలని భావించారు. కాకపోతే గడిచిన నాలుగైదు రోజులుగా అనారోగ్యం ఆయన బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆ నివేదికపై మాట్లాడే బాధ్యతను హరీష్‌రావుకు అప్పగించినట్టు తెలుస్తోంది.
ఎందుకంటే రిపోర్టులో కేసీఆర్‌తోపాటు హరీష్‌రావు ప్రస్తావించడంతో ఆయనకు ఆ సబ్జెక్టుపై అవగాహన ఉంటుందని భావించిన అప్పగించినట్టు పార్టీ వర్గాల మాట. అధికార పక్షం నుంచి ఎదురుదాడి మొదలైన సమయంలో కేటీఆర్ కూడా జోక్యం చేసుకుంటారు. అలాగే జగదీష్‌రెడ్డితోపాటు కొందరు నేతలు సైతం దీనిపై సభలో మాట్లాడనున్నారు.
ALSO READ: పోచారం డ్యామ్ వద్ద ఆర్మీ ఆపరేషన్.. వరదల్లో 50 మంది గ్రామస్తులు
కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చించేందుకు తగినంత సమయం ఇవ్వాలని బీఆర్ఎస్ నేతలు కోరే అవకాశం ఉంది. అసెంబ్లీలో కమిషన్ నివేదిక పెట్టడానికి ముందే తమకు రిపోర్ట్ ఇవ్వాలని ఆ పార్టీ నేతలు సూచించారు. ఈ నేపథ్యంలో గురువారం అసెంబ్లీ సెక్రటరీతో ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు.
ఆయన నుంచి ఎలాంటి సమాధానం వచ్చిందో తెలీదు. ప్రభుత్వం మాత్రం నివేదిక సభ్యులందరికీ ఇచ్చిన తర్వాత చర్చ పెట్టాలని డిసైడ్ అయ్యింది. అయితే దీనిపై మాట్లాడటానికి తమకు ఇంకా సమయం కావాలని చర్చను డైవర్ట్ చేసే అవకాశాలున్నట్లు అధికార పక్షం భావిస్తోంది. కాళేశ్వరం నివేదిక నేపథ్యంలో ఈసారి సమావేశాలు హాట్ హాట్‌గా జరగడం ఖాయమన్నమాట.