BCCI president: భారత క్రికెట్ నియంత్రణ మండలి {BCCI} అధ్యక్ష పదవికి రోజర్ బిన్నీ రాజీనామా చేశారు. దీంతో ఆయన స్థానంలో తాత్కాలిక అధ్యక్షుడిగా రాజీవ్ శుక్లా బీసీసీఐ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించారు. సెప్టెంబర్ 9 నుండి ఆసియా కప్ 2025 ప్రారంభానికి ముందు అనూహ్యంగా రోజర్ బిన్నీ రాజీనామా చేయడం క్రికెట్ ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది. ప్రస్తుతం బీసీసీఐలో నెలకొన్న రాజకీయాలే ఆయన రాజీనామాకు కారణమని కొందరు విశ్లేషిస్తున్నారు.
అయితే మరికొందరు మాత్రం రోజర్ బిన్నీ ప్రస్తుతం అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని.. అందువల్లే ఆయన బీసీసీఐ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారని కామెంట్స్ చేస్తున్నారు. కాగా 2022 అక్టోబర్ లో భారత క్రికెట్ నియంత్రణ మండలి {BCCI} అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ ఎంపికైన విషయం తెలిసిందే. అయితే 2025 జూలై 19న ఆయనకి 70 ఏళ్ళు నిండిన నేపథ్యంలో.. బీసీసీఐ రాజ్యాంగం ప్రకారం ఆఫీస్ బేరర్ 70 ఏళ్లు దాటిన వ్యక్తి పదవిలో ఉండకూడదు. ఈ కారణంగా 1983 ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడైన రోజర్ బిన్నీ.. జూలై 19 తర్వాత ఆ పదవికి అనర్హుడు.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం బోర్డ్ ఉపాధ్యక్షుడిగా మరియు ప్రస్తుత పాలనలో అత్యంత సీనియర్ ఆఫీసర్ గా ఉన్న రాజీవ్ శుక్ల.. బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడతారని గతంలో వార్తలు వైరల్ గా మారాయి. కానీ ఇటీవల నేషనల్ స్పోర్ట్స్ బిల్ పార్లమెంటులో ఆమోదం పొందింది. దీని ప్రకారం క్రీడా సంఘాల ఆఫీస్ బేరర్ల వయోపరిమితిని 75 సంవత్సరలకు పెంచారు. మరోవైపు బీసీసీఐ కూడా ఓ క్రీడా సమైక్యగా ఈ బిల్లు పరిధిలోకి రావడంతో.. ఈ నిబంధన కూడా దానికి వర్తించనుంది. దీంతో రోజర్ బిన్నీ మరికొంత కాలం బీసీసీ అధ్యక్షుడిగా కొనసాగేందుకు మార్గం సుగమయింది. కానీ తాజాగా ఆయన ఆకస్మిక రాజీనామా అందరినీ విష్మయానికి గురిచేసింది.
ఇక ఇప్పటివరకు భారత క్రికెట్ నియంత్రణ మండలి {బిసిసిఐ} అధ్యక్షులుగా వ్యవహరించిన వారి వివరాలు పరిశీలిస్తే.. 1. ఆర్.ఇ. గ్రాంట్ గోవన్ 1928 – 1933, 2. సికందర్ హయత్ ఖాన్ 1933 – 1935, 3. నవాబ్ హమీదుల్లా ఖాన్ 1935 – 1937, 4. మహారాజా కె.ఎస్. దిగ్విజయ్ సింగ్ 1937 – 1938, 5. పి సుబ్బరాయన్ 1938 – 1946, 6. ఆంథోనీ ఎస్ డి’మెల్లో 1946 – 1951, 7. జె.సి. ముఖర్జీ 1951 – 1954, 8. విజయనగరం మహారాజ్ కుమార్ 1954 – 1956, 9. సర్దార్ సుర్జిత్ సింగ్ మజితియా 1956 – 1958, 10. ఆర్.కె. పటేల్ 1958 – 1960, 11. ఎం.ఎ. చిదంబరం 1960 – 1963, 12. మహారాజా ఫతేసింగ్‌రావ్ గైక్వాడ్ 1963 – 1966,
13. జెడ్ఆర్ ఇరానీ 1966 – 1969, 14. ఎన్ ఘోష్ 1969 – 1972, 15. సాయంత్రం రుంగ్తా 1972 – 1975, 16. రాంప్రకాష్ మెహ్రా 1975 – 1977, 17. ఎం చిన్నస్వామి 1977 – 1980, 18. ఎస్.కె. వాంఖడే 1980 – 1982, 19. ఎన్.కె.పి. సాల్వే 1982 – 1985, 20. ఎస్ శ్రీరామన్ 1985 – 1988, 21. బి.ఎన్.దత్ 1988 – 1990, 22. మాధవరావు సింధియా 1990 – 1993, 23. IS బింద్రా 1993 – 1996, 24. రాజ్ సింగ్ దుంగార్పూర్ 1996 – 1999, 25. ఎసి ముత్తయ్య 1999 – 2001, 26. జగ్మోహన్ దాల్మియా 2001 – 2004, 27. రణబీర్ సింగ్ మహేంద్ర 2004 – 2005, 28. శరద్ పవార్ 2005 – 2008, 29. శశాంక్ మనోహర్ 2008 – 2011, 30. ఎన్ శ్రీనివాసన్ 2011 – 2013, 31. జగ్మోహన్ దాల్మియా 2013 – 2013, 32. ఎన్ శ్రీనివాసన్ 2013 – 2014, 33. శివలాల్ యాదవ్ 2014 – 2014, 34. సునీల్ గవాస్కర్ 2014 – 2014, 35. జగ్మోహన్ దాల్మియా 2015 – 2015, 36. హశాంక్ మనోహర్ 2015 – 2016, 37. అనురాగ్ ఠాకూర్ 2016 – 2017, 38. సి.కె. ఖన్నా 2017 – 2019, 39. సౌరవ్ గంగూలీ 23 అక్టోబర్, 2019 – 2022, 40. రోజర్ బిన్నీ అక్టోబర్ 2022 నుండి 2025 ఆగస్టు 29 వరకు.