HBD Nagarjuna : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నవ మన్మధుడిగా.. కింగ్ హీరోగా పేరు సొంతం చేసుకున్నారు నాగార్జున (Akkineni Nagarjuna). దివంగత నటులు అక్కినేని నాగేశ్వరరావు(Akkineni Nageswara Rao) వారసులుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాగార్జున.. అతి తక్కువ సమయంలోనే ఊహించని పాపులారిటీ సొంతం చేసుకున్నారు. మాస్, యాక్షన్, ఫ్యామిలీ ఓరియెంటెడ్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ఈయన.. ఇప్పుడు రూ.100 కోట్ల టార్గెట్గా సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. తన సినీ కెరియర్ లో 100వ సినిమాగా రాబోతున్న చిత్రంతో ఎలాగైనా సరే వంద కోట్లు కొట్టాలని గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు.
ఈ రోజైనా నాగ్ 100వ సినిమా అనౌన్స్మెంట్ ఉంటుందా?
ఇదిలా ఉండగా ఈరోజు ఆయన పుట్టినరోజు.. కనీసం ఈ రోజైనా ఆయన 100వ మూవీకి సంబంధించిన అనౌన్స్మెంట్ ఉంటుందని అభిమానులు ఆశగా ఎదురు చూడగా.. ఆఖరికి నిరాశ మిగిలిందని చెప్పాలి. చివరిగా ‘నా సామి రంగ’ మూవీతో మల్టీస్టారర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగార్జున.. మూడేళ్లు అవుతున్నా.. సోలో హీరోగా మరో మూవీ ప్రకటించలేదు ప్రస్తుతం తమిళంలో సూపర్ హిట్ అందుకున్న ఒక మూవీని ఇప్పుడు రీమేక్ చేయబోతున్నారని.. అదే నాగార్జున 100 సినిమా అంటూ వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. కానీ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మాత్రం ఇంకా వెలువడలేదు.
ఆలస్యానికి కారణం..?
ఇలాంటి సమయంలో నాగార్జున తన వందవ సినిమా ప్రకటించడంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నారు అనే వార్తలు వైరల్ అవుతున్నాయి. దీనికి కారణం తన 100వ సినిమాతో రూ.100 కోట్ల కలెక్షన్స్ వసూలు చేయాలనే లక్ష్యంతో.. అటు స్టోరీ విషయంలో కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నారని అందుకే ఆ 100వ చిత్రానికి ఆలస్యం చేస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికీ సీనియర్ హీరోలలో 100కోట్ల మార్కు టచ్ చేయనిది ఒక నాగార్జున మాత్రమే. ఈ జాబితాలో నిన్న మొన్నటి వరకు వెంకటేష్ ఉండేవారు.కానీ ఆయన ఈ ఏడాది అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో 100 కోట్లు కొట్టి ఆయన కూడా ఆ లక్ష్యాన్ని చేదించాడు. ఇప్పుడు నాగార్జున మాత్రమే మిగిలి ఉన్నారు. అందుకే తను రాబోయే చిత్రం చాలా స్పెషల్ గా ఉండాలని.. ఈ 100వ సినిమాతో వంద కోట్ల క్లబ్లో చేరాలని గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు నాగార్జున.
సరైన స్టోరీ తో ఆడియన్స్ ముందుకు వస్తారా?
మొత్తానికైతే స్టోరీ వల్లే సినిమా అనౌన్స్మెంట్ ఆలస్యం అవుతోంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. సాధారణంగా నాగార్జున కథల ఎంపిక విషయంలో చాలా కాన్ఫిడెంట్ గా ఉంటారు. మంచి కాన్సెప్ట్లే తీసుకుంటారు. బంగార్రాజు సినిమా తర్వాత వచ్చిన ‘నా సామి రంగా’ సినిమా కూడా మంచి విజయం అందుకుంది. కానీ కమర్షియల్ గా పెద్దగా సక్సెస్ అందుకోలేదు. మరి ఇప్పటికైనా తన లక్ష్యాన్ని చేరుకుంటాడో లేదో చూడాలి.
క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతో దూసుకుపోతూ..
ఇకపోతే నా సామి రంగా సినిమా తర్వాత హీరోగా మరో సినిమా అనౌన్స్ చేయకపోయినా క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. అందులో భాగంగానే శేఖర్ కమ్ముల (Sekhar Kammula) దర్శకత్వంలో ధనుష్ (Dhanush ) హీరోగా వచ్చిన ‘కుబేర’ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్ర చేసి ఆకట్టుకున్నారు. అలాగే ఇటీవల రజనీకాంత్ (Rajinikanth) హీరోగా నటించిన కూలీ(Coolie ) సినిమాలో విలన్ పాత్ర పోషించి మెప్పించారు.
ALSO READ:Kakinada Sridevi: అరుదైన గౌరవం అందుకున్న కోర్టు బ్యూటీ.. అదృష్టం కదా!