OLYMPICS 2036 : హైదరాబాద్ వేదికగా 2036 ఒలింపిక్స్ నిర్వహణకు బిడ్ వేయడం పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ఓ హోటల్ లో కపిల్ దేవ్, పుల్లెల గోపిచంద్, బైచుంగ్ భూటియా, సంజీవ్ గొయెంకా, అభివన్ బింద్రా, కావ్య మారన్, ఉపాసన కొణిదెలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఒలింపిక్స్ బిడ్ తో పాటు క్రీడలు, లాంగ్ టర్మ్ అథ్లెటిక్ డెవలప్ మెంట్, మిని స్టేడియాలు, మౌలిక సదుపాయాల కల్పన పై వీరితో చర్చించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా పలువురు క్రీడాకారులను సీఎం రేవంత్ రెడ్డి సన్మానించారు.
ఒలింపిక్స్ 2036 తెలంగాణలో..
అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. “తెలంగాణ స్పోర్ట్స్ హబ్ బోర్డు సమావేశానికి హాజరయ్యే అవకాశం తనకు దక్కిందని తెలిపారు. 2036 తెలంగాణలో నిర్వహించేందుకు బిడ్ వేస్తున్నామని వెల్లడించారు. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించి.. అట్టడుగు స్థాయి నుంచి ప్రపంచ పర్యావరణ వ్యవస్థతో తెలంగాణ ప్రపంచ క్రీడా గమ్యస్థానంగా ఉంచాలని తాను దృష్టి సారిస్తున్నట్టు తెలిపారు. స్పోర్ట్స్ బడ్జెట్ లో 16 రెట్లు పెంచామని తెలిపారు. అలాగే తెలంగాణలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ప్రారంభం, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు దశల వారిగా పోటీ నిర్వహించాలని.. అలాగే క్రీడాకారులకు ప్రోత్సాహకాలు అవకాశాలను మెరుగు పరచడం వంటి కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలిపారు. కపిల్ దేవ్, అభినవ్ బింద్రా, పుల్లెల గోపీచంద్, భైచుంగ్ భూటియా, ఉపాసన కొణిదెల మరియు డాక్టర్ సంజీవ్ గోయెంకా వంటి దిగ్గజాల నుండి విలువైన అంతర్దృష్టులు ఈ మిషన్‌ను మరింత బలోపేతం చేస్తాయి.
ఖేలో ఇండియా, కామన్వెల్త్ క్రీడలు, ఒలింపిక్స్‌కు ఆతిథ్యమివ్వాలనే ప్రణాళికలతో తెలంగాణ భారతదేశ క్రీడా దృశ్యాన్ని పునర్నిర్వచించటానికి సిద్ధంగా ఉంది” అని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి.
OLYMPICS –2036పై సీఎం రేవంత్ సమీక్షా సమావేశం
తెలంగాణ స్పోర్ట్స్ హబ్ బోర్డు మొదటి సమావేశానికి హాజరైన ముఖ్యమంత్రి
పాల్గొన్న ఉపాసన కొణిదెల, కావ్య మారన్, సంజీవ్ గోయెంకా, కపిల్ దేవ్, పుల్లెల గోపీచంద్ pic.twitter.com/qvUs1NyptW
— BIG TV Breaking News (@bigtvtelugu) August 28, 2025