BigTV English

Rag Mayur : ఐటీలో జాబ్.. సినిమాల వల్ల చాలా నష్టపోయాను.. రాగ్ మయూర్ సంచలన వ్యాఖ్యలు..

Rag Mayur : ఐటీలో జాబ్.. సినిమాల వల్ల చాలా నష్టపోయాను.. రాగ్ మయూర్ సంచలన వ్యాఖ్యలు..

Rag Mayur : సినీ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వాలంటే ఆసక్తి ఒక్కటే ఉంటే సరిపోదు. ఒకటి కావాలంటే మరొకటి వదులుకోవాలి.. ఆన్ స్క్రీన్ మీద ఫేమస్ అవ్వాలి అంటే కొన్ని కఠిన పరిస్థితులను కూడా ఎదుర్కోవాలని ఇప్పటికే చాలామంది నటీనటులు చెబుతున్నారు.. ఇండస్ట్రీలో ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చిన వాళ్ళు ఎన్నో కష్టాలని అనుభవించి ఇప్పుడు స్టార్లుగా ప్రేక్షకుల హృదయాలల్లో చోటు సంపాదించుకున్నారు. నటన మీద ఆసక్తితో కొందరు మంచి జాబ్ ను కూడా వదులుకున్నారు. పరిస్థితి దారుణంగా మారిన ఒక్క ఛాన్స్ అంటూ ముందుకు సాగుతున్నారు. అలాంటి వారిలో యువ నటుడు రాగ్ మయూర్ ఒకరు. ఐటీ జాబ్ ను వదిలేసి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు..


ఐటీ జాబ్ ను వదిలేసి సినిమాల్లోకి..

మొదటినుంచి కొంతమందికి నటన మీద ఆసక్తి ఉండడంతో సినిమా ఇండస్ట్రీలోకి రావాలని కోరికతో అటుగా అడుగులు వేస్తారు. కానీ కొంతమంది మంచి జాబులు చేస్తూ కూడా నటన మీద ఆసక్తితో ఇండస్ట్రీలో కొనసాగాలని ప్రయత్నాలు చేస్తారు. కొంతమంది ఎంట్రీ ఇచ్చిన తొలినాళ్లలోనే సక్సెస్ అవుతారు.. ఇంకొంతమంది మాత్రం ఇప్పటికీ సక్సెస్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అదృష్టం ఎప్పుడు ఎవరిని వరిస్తుందో చెప్పడం కష్టమే. యువ నటుడు రాగ్ మయూర్ సినిమాలపై ఆసక్తితో ఐటీ జాబు ని వదిలేసి మరి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. తన టాలెంట్ తో వరుసగా సినిమాలలో నటించే అవకాశాన్ని అందుకున్నాడు. కానీ జాబ్ లో సంపాదించినంత సంపాదించలేదంటూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. అందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ఐటీ జాబు లో బాగా సంపాదించే వాడిని.. సినిమాల్లో అంతగా సంపాదించలేదు. కొన్నిసార్లు సినిమాల్లోకి వచ్చి తప్పు చేశానా అని ఆలోచించాను. కానీ నటన పై ఉన్న ఆసక్తి ఆ ఆలోచనని మరిచిపోయేలా చేసింది. ఇప్పుడు ఇలా మీ ముందు కూర్చోబెట్టింది అంటూ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


Also Read: నాగార్జున బర్త్ డే స్పెషల్.. టాలీవుడ్ మన్మధుడి ఆస్తులు ఎన్ని వేల కోట్లంటే..?

రాగ్ మయూర్ చేసిన సినిమాలు.. 

ఒకవైపు జాబ్ చేస్తూ మరో వైపు ఆడిషన్స్ లో పాల్గొన్నాడు. అయితే ఎన్నో అడిషన్స్ ఇచ్చిన తర్వాత 2017లో మెంటల్ మదిలో సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టాడు. 2021లో రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించిన సినిమా బండి, 2023లో తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన కీడా కోలాలో నటనకుగాను మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పటివరకు ఏడు ఎనిమిది సినిమాల్లో నటించాడు. రీసెంట్ గా టాలీవుడ్ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించిన పరదా సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమా ఒకవైపు విమర్శలు అందుకున్న మరోవైపు మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఇక ఈయన సినిమాలతో పాటుగా మోడ్రన్ లవ్ హైదరాబాద్, సివరపల్లి అనే వెబ్ సిరీస్ లలో నటించాడు. అవి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన గురించి ఎన్నో విషయాలను పంచుకున్నారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Related News

HBD Nagarjuna : 100 కోట్ల టార్గెట్ గా 100వ మూవీ… అందుకే ఈ ఆలస్యం

Monalisa: సౌత్ లోకి కుంభమేళా మోనాలిసా ఎంట్రీ.. ఏ హీరో సినిమానో తెలుసా..?

Mahesh Babu: అమ్మో .. నా వల్ల కాదు.. షూటింగ్ క్యాన్సిల్.. మహేష్ తీరుపై మేకర్స్ అసహనం

Kakinada Sridevi: అరుదైన గౌరవం అందుకున్న కోర్టు బ్యూటీ.. అదృష్టం కదా!

Sathyaraj: రజినీకాంత్ తో అందుకే నటించనని చెప్పా.. 18 ఏళ్ల వివాదానికి చెక్ పెట్టిన కట్టప్ప

Big Stories

×