Apple – Samsung: భారతదేశంలోని ప్రీమియం స్మార్ట్ ఫోన్ మార్కెట్లో పోటీ రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కొన్ని కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రత్యర్థి కంపెనీల ఫోన్లతో నేరుగా పోల్చి ప్రకటనలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల చైనా ఆధారిత స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ షియోమిపై ఆపిల్, సామ్‌సంగ్ వేరుగా లీగల్ నోటీసులు జారీ చేశారు. షియోమి భారత్‌లో విడుదల చేసిన కొన్ని ప్రకటనల్లో తన ఫోన్లను ఆపిల్, సామ్‌సంగ్ ఫోన్లతో పోల్చి ప్రదర్శించడంతో ఇరు కంపెనీల బ్రాండ్ విలువకు నష్టం వస్తుందనే కారణంతో ఈ చర్య చేపట్టబడినట్లు సమాచారం.
ఈ ఏడాది ప్రారంభంలో షియోమి న్యూస్ పేపర్ ప్రకటనలలో ఐఫోన్16 ప్రో మ్యాక్స్ ధర, సాంకేతిక వివరాలు, లక్షణాలను తన ఫోన్లతో పోల్చి ప్రచారం చేసింది. అంతే కాక, షియోమి సోషల్ మీడియా వేదికలపై కొన్ని ఫోన్లను సామ్‌సంగ్ ఫోన్లతో పోల్చుతూ, స్మార్ట్ టీవీలను కూడా టార్గెట్ చేసింది. ఈటీ నివేదికలో పేర్కొన్న విధంగా, ఆపిల్, సామ్‌సంగ్ తమ బ్రాండ్ విలువను రక్షించుకోవడానికి షియోమికి సీస్ అండ్ డిసిస్ట్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.
భారతదేశం ప్రపంచంలో అత్యంత పెద్ద, ముఖ్యమైన స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లలో ఒకటిగా ఉంది. 2025 సంవత్సరపు మొదటి ఆరు నెలలలో (జనవరి–జూన్) భారతదేశంలో సుమారు 7 కోట్ల స్మార్ట్‌ఫోన్లు అమ్మకానికి పంపడం జరిగింది. ఈ మార్కెట్‌లో వివో 19శాతం వాటాతో ముందుండగా, సామ్‌సంగ్ 14.5శాతం వాటాతో రెండవ స్థానంలో ఉంది. అయితే ప్రీమియం సెగ్మెంట్‌లో ఆపిల్, సామ్‌సంగ్ ఆధిక్యత కలిగిన కంపెనీలుగా కొనసాగుతున్నాయి.
Also Read: Pocharam Dam: పోచారం డ్యామ్ వద్ద ఆర్మీ ఆపరేషన్.. వరదల్లో 50 మంది గ్రామస్తులు
2025 సంవత్సరంలో ఆపిల్ కంపెనీ భారత్‌లో మొత్తం 59లక్షల స్మార్ట్‌ఫోన్లను రీటైల్ స్టోర్స్, డీలర్లు, మార్కెట్‌కి పంపి అందుబాటులోకి తెచ్చింది. ఇది 2024 పోలిస్తే, 2025లో ఆపిల్ భారత మార్కెట్‌లో 21.5% ఎక్కువ ఫోన్లను షిప్ చేసింది. సీఈవో టిమ్ కుక్ జూన్ క్వార్టర్ ఇన్నింగ్స్ కాల్‌లో తెలిపారు. భారత మార్కెట్ ఆపిల్ కోసం అత్యంత లాభదాయకంగా మారింది, ఐఫోన్ అమ్మకాలు 10శాతం కంటే ఎక్కువ పెరిగాయి.
ఈ అమ్మకాలను దృష్టిలో ఉంచుకొని, ఆపిల్ భారతదేశంలో తన మరిన్ని స్టోర్స్ ను పెంచేందుకు సిద్ధమైంది. వచ్చే వారంలో పూణెలో కొత్త స్టోర్ ప్రారంభం కానుంది. అంతేకాక, భారత్ ఆపిల్ కోసం మేజర్ మాన్యుఫాక్చరింగ్ హబ్‌గా మారింది. కంపెనీ భారత్‌లోని 5 ఫ్యాక్టర్‌లో ఐఫోన్17 ఉత్పత్తిని పెంచడం కోసం ప్లాన్ చేస్తోంది. అదే సమయంలో, అమెరికాకు అమ్మే ఫోన్లలో కేవలం భారత్‌లో ఉత్పత్తి అయినవి మాత్రమే ఉండేలా చేస్తుంది.
ఇక ఇతర స్మార్ట్‌ఫోన్ తయారీదారులు కూడా భారత్‌లో ఉత్పత్తిని పెంచడం ద్వారా దేశం ఫోన్ల దిగుమతులపై ఆధారాన్ని తగ్గిస్తూ, ఎగుమతులను పెంచింది. ఆపిల్ 2024లో భారత్ నుండి ఐఫోన్ ఎగుమతులలో 1 లక్ష కోటి రూపాయలను అధికమించిందనే చెప్పాలి. స్యామ్సంగ్ 2023–24 ఆర్థిక సంవత్సరంలో 52 బిలియన్ డాలర్ల విలువైన ఫోన్‌లను ఎగుమతి చేసింది.