BigTV English

Mahesh Babu: అమ్మో .. నా వల్ల కాదు.. షూటింగ్ క్యాన్సిల్.. మహేష్ తీరుపై మేకర్స్ అసహనం

Mahesh Babu: అమ్మో .. నా వల్ల కాదు.. షూటింగ్ క్యాన్సిల్.. మహేష్ తీరుపై మేకర్స్ అసహనం

Mahesh Babu: సాధారణంగా హీరోలు షూటింగ్ కోసం చాలా కష్టపడతారని వింటూనే ఉంటాం. ఎండ, చలి, వాన అని తేడా లేకుండా షూటింగ్ చేస్తూ ఉంటారు. అందుకే వారు అన్ని కోట్లు తీసుకుంటారు. అయితే అందరూ ఒకేలా ఉండరు. సూపర్ స్టార్స్.. షూటింగ్స్ లో ఎక్కువ కష్టపడరు. ఇప్పుడైతే అన్ని డూప్స్ చేస్తున్నారు. ఫేస్ మాత్రం హీరోది పెడుతున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజమెంత అనేది పక్కన పెడితే తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు సున్నితత్వం వలన రెండు కోట్ల సెట్ వేస్ట్ అయ్యిందని రూమర్స్ మొదలయ్యాయి.


ప్రస్తుతం మహేష్ బాబు.. రాజమౌళి దర్శకత్వంలో SSMB29 సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే.  బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే సౌత్ ఆఫ్రికాలో ఒక లాంగ్ షెడ్యూల్ పూర్తయ్యింది. దీనికన్నా ముందు రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక భారీ సెట్ వేశారట. దానికి దాదాపు రెండు కోట్లు ఖర్చు చేశారని టాక్. ఆరు బయట చెరువు పక్కన పెద్ద సెట్ కావడంతో ఎండ విపరీతంగా ఉందట.

ఇక మొదటి నుంచి ఎండలో పని చేయలేని మహేష్.. ఈ సెట్ కు వచ్చి అరగంట కూడా షూటింగ్ చేయలేకపోయాడట. అమ్మో.. నా వల్ల కాదు అంటూ అరగంటలోనే షూటింగ్ క్యాన్సిల్ చేసి వెళ్ళిపోయాడట. మహేష్ ఇలా అంటాడు అనే మేకర్స్ ముందే అన్ని జాగ్రత్తలు తీసుకున్నారని, అయినా కూడా ఎండ కొంచెం కూడా తగలని శరీరం కావడంతో.. ఆ కొంచెం వేడిని కూడా తట్టుకోలేక మహేష్ చేతులు ఎత్తేశాడని సమాచారం. దీంతో రెండు కోట్ల సెట్ వేస్ట్ అయ్యిందని, దీనివలన  నిర్మాతలకు చాలా నష్టం వాటిల్లిందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.


నిజం చెప్పాలంటే మహేష్ కు ఇదేమి కొత్త కాదు. గతంలో కూడా చాలాసార్లు ఇలానే చేశాడు. బ్రహ్మోత్సవం సమయంలో కూడా ఒక సాంగ్ షూట్  ఆరుబయట చేయాల్సి వస్తే ఎండ అని మేకర్స్ ను ఇబ్బంది పెట్టినట్లు వార్తలు వచ్చాయి. అంతేకాకుండా మహర్షి సినిమా సమయంలో కూడా ఎండ తగలకుండా పొలం సెట్ కూడా ఏసీ గదుల్లోనే వేశారని టాక్. ఇలా మహేష్ సున్నితత్వం వలన మేకర్స్ చాలా ఇబ్బందులకు గురి అయ్యారని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. మరి ఇందులో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది.

Related News

Vishal Sai Dhanshika: ఘనంగా సాయి ధన్సికతో హీరో విశాల్ ఎంగేజ్మెంట్.. ఫోటోలు వైరల్!

Komali Prasad: ఆశగా ఎదురుచూస్తున్నా.. ఊహించని కామెంట్స్ చేసిన నాని హిట్ 3 బ్యూటీ!

Nikhil Siddhartha: నిఖిల్ అన్నా.. స్వయంభు ఉన్నట్టా .. లేనట్టా ?

HBD Nagarjuna : 100 కోట్ల టార్గెట్ గా 100వ మూవీ… అందుకే ఈ ఆలస్యం

Monalisa: సౌత్ లోకి కుంభమేళా మోనాలిసా ఎంట్రీ.. ఏ హీరో సినిమానో తెలుసా..?

Big Stories

×