Tim David: ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ లో అత్యంత ప్రమాదకరమైన బ్యాటర్లలో ఆస్ట్రేలియాకు చెందిన టిమ్ డేవిడ్ ఒకరు. టిమ్ డేవిడ్ బ్యాట్ పట్టాడంటే విధ్వంసమే. బరిలోకి దిగాడు అంటే సిక్సర్ల సునామి సృష్టిస్తాడు. మిడిల్ ఆర్డర్ నుంచి ఫినిషర్ వరకు తన పాత్రలో బలమైన ప్రదర్శన చేయగల సత్తా ఉన్న ఆటగాడు టిమ్ డేవిడ్. ఇతడి పూర్తి పేరు తిమోతి హేస్ డేవిడ్. 1996 మార్చి 16న ఇతడు సింగపూర్ లో జన్మించాడు. టిమ్ డేవిడ్ తండ్రి రాడ్ డేవిడ్. టిమ్ తండ్రి 1997 ఐసీసీ ట్రోఫీలో సింగపూర్ తరపున ఆడిన ఓ క్రికెటర్.
Also Read: Sameer Rizvi : సమీర్ రిజ్వి అరాచకం… 9 సిక్సులు, 3 బౌండరీలతో రెచ్చిపోయాడుగా.. ఇదిగో వీడియో
టిమ్ కుటుంబం 1990 లలో ఆస్ట్రేలియా నుండి సింగపూర్ కి వెళ్ళింది. అక్కడ అతని తండ్రి ఇంజనీర్ గా పనిచేశాడు. టిమ్ డేవిడ్ కి రెండేళ్ల వయసు ఉన్న సమయంలో వీరి కుటుంబం తిరిగి ఆస్ట్రేలియాకు వచ్చింది. ఆ తర్వాత తన బాల్యంలో ఎక్కువ భాగం అతడు పెర్త్ లో గడిపాడు. టిమ్ డేవిడ్ మొదట సింగపూర్ తరపున ప్రారంభ క్రికెట్ ఆడాడు. 2019 జూలైలో సింగపూర్ తరపున అంతర్జాతీయంగా క్రికెట్ లో అరంగేట్రం చేశాడు. ఇతడు కుడి చేతివాటం బ్యాటర్ మరియు కుడి చేతివాటం ఆఫ్ బ్రేక్ బౌలర్. సింగపూర్ క్రికెట్ తరఫున 14 టీ-20 మ్యాచ్ లు ఆడిన టిమ్ డేవిడ్.. 2022 టీ-20 ప్రపంచ కప్ కోసం ఆస్ట్రేలియా జట్టులో భాగమయ్యాడు.
అనంతరం టీమిండియా – ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ తో ఆస్ట్రేలియా క్రికెట్ లో అరంగేట్రం చేశాడు. ఇక 2022 టీ-20 ప్రపంచ కప్ కోసం ఆస్ట్రేలియా జట్టులో భాగమయ్యాడు. టిమ్ డేవిడ్ ప్రపంచంలో అత్యంత ప్రజాధారణ పొందిన టీ-20 టోర్నమెంట్, 2020 – 21 లో హోవర్ట్ హరికేన్స్ తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అలాగే పాకిస్తాన్ సూపర్ లీగ్, లాహోర్ కలందర్స్, ముల్తాన్ సుల్తాన్ జట్టులో భాగంగా ఉన్నాడు. ఇక ముఖ్యంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ {IPL} లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రస్తుతం ప్రతినిత్యం వహిస్తున్నాడు.
అయితే అంతర్జాతీయ క్రికెట్ లో ఇతడిని చాలా తక్కువ మంది మాత్రమే చూశారు. ఇతడు ఫ్రాంచైజీ క్రికెట్ నుంచి ఎక్కువగా గుర్తింపు పొందాడు. బిగ్ బాష్ లీగ్, పాకిస్తాన్ సూపర్ లీగ్, టి-20 బ్లాస్ట్, ది హండ్రెడ్ లీగ్ వంటి టోర్నమెంట్లలో ఇతడు ఓ అద్భుతమైన బ్యాట్స్మెన్. అలాగే పార్ట్ టైం ఆఫ్ స్పిన్నర్ గా తనదైన ముద్ర వేశాడు. ఇతడు యూఏఈ లో ఆడుతున్న సందర్భంలో ఐపీఎల్ 2021 సీజన్ లో రెండవ లెగ్ కోసం ఫిల్ అలెన్ కి బదులుగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇతడిని దక్కించుకుంది. కానీ ఆ సీజన్ లో ఇతడికి కేవలం ఒక మ్యాచ్ లో మాత్రమే ఆడే అవకాశం లభించింది. అందులో టిమ్ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేయగలిగాడు.
ఆ తర్వాత మళ్లీ వేలం కోసం తన పేరును నమోదు చేసుకున్నాడు. ఇక 2002 ఐపీఎల్ సీజన్ లో ముంబై ఇండియన్స్ ఇతడిని వేలంలో దక్కించుకుంది. ఆ తర్వాత 2024 వరకు ముంబై జట్టుకే ప్రతినిత్యం వహించాడు. ఆ తర్వాత 2025 సీజన్ లో రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు ఐపీఎల్ మెగా వేలంలో టీమ్ డేవిడ్ ని దక్కించుకుంది. ఈ సీజన్ లో అతడు ఆడిన ప్రతి మ్యాచ్ లోను బెస్ట్ ఇన్నింగ్స్ తో పాటు ఆర్సిబి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఇక ఇటీవల సౌత్ ఆఫ్రికా తో జరిగిన టి-20 సిరీస్ లో కూడా అద్భుతంగా రాణించాడు.
ముఖ్యంగా రెండవ టి-20 మ్యాచ్ లో ఏకంగా 125 పరుగులు చేసి సునామీ సృష్టించాడు. అయితే తన కెరీర్ మొదట్లో సింగపూర్ కి ఆడిన టిమ్.. ఆ తర్వాత ఆస్ట్రేలియా జట్టు తరుపున ఆడాలని ఎన్నో కలలు కన్నాడు. కానీ సంతదేశం వల్లే తనని ఎంతగానో అవమానించారు. అతడికి అవకాశాలు రాకుండా ఇబ్బందులకు గురి చేశారు. ఇలా తన కెరీర్ ప్రారంభంలో సొంత దేశం వాళ్ళే ఛీ కొట్టిన నేపథ్యంలో.. ఇప్పుడు ప్రపంచాన్ని ఏలుతున్నాడు. ఆర్సిబి జట్టులోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఆ జట్టు కప్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. దీంతో టిమ్ డేవిడ్ ని ఆర్సిబి అభిమానులు గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారు.
?utm_source=ig_web_copy_link