BigTV English

Prediction for 1St January 2023 : జనవరి 1న ఈ ఒక్కపని చేస్తే ఏడాదంతా అన్నీ శుభాలే…

Prediction for 1St January  2023 : జనవరి 1న ఈ ఒక్కపని చేస్తే ఏడాదంతా అన్నీ శుభాలే…

Prediction for 1St January 2023 : ఈ సారి జనవరి 1 , 2023 సంవత్సరం ఆదివారంతో ప్రారంభమవుతోంది. ఆంగ్లనామ సంవత్సం మొదటి రోజు ఏ రాశి వారైనా, ఏ నక్షత్రం వారైనా నానబెట్టిన గోధుమలు, బెల్లం గోవుకి తినిపించాలి. అలా చేస్తే గోమాత అనుగ్రహం సకలదేవతల అనుగ్రహం కలుగుతుంది. దానం ద్వారా జాతక దోషాలు పోగొట్టుకోవడానికి కేజీ పావు గోధుమలు ఎర్రని రంగు వస్త్రంలో మూట కట్టి బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. ఆ దానం కూడా ఉదయం ఆరు నుంచి ఏడు గంటల లోపు కానీ మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు గంటల లోపు కానీ రాత్రి 8 గంటల నుంచి 9 గంటల లోపు చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అన్నిరంగాల్లో సక్సెస్ సొంతం చేసుకోవాలంటే ఇంట్లో పూజ చేసుకునే సమయంలో గోధుమల దీపాన్ని వెలుగించుకోవాలి. పూజ గదిలో ఒక పళ్లంలో కుప్పలా గోధుమలు పోసి అందులో వెండి దీపం లేదా మట్టి దీపంలో ఆవు నెయ్యి పోసి 12 ఒత్తులతో దీపాన్ని వెలిగించాలి. ఇలా ఎవరైతే ద్వాదశ జ్యోతులు వెలిగిస్తారో వారికి ఏడాది మొత్తం అదృష్టం , ఐశ్వర్యం కలిసి వస్తుందని శాస్త్రం చెబుతోంది.


12 ఒత్తులు విడివిడిగా పెట్టి వెలిగించడం ద్వాదశ, ఆదిత్య లకు సంకేతం. ఆదివారానికి అధిపతి సూర్యుడు. ద్వాదశ ఒత్తులు సూర్యుడికి ఇష్టం కాబట్టి ఇలా గోధుమల మధ్యలో దీపం వెలిగిస్తే విశేషంగా కలిసి వస్తుంది. దీపం కొండెక్కాక పళ్లెంలోని గోధుమలు గోమాతకు తినిపించవచ్చు లేదంటే ఎవరూ తొక్కని చోట మొక్కల మొదల్లో వేయవచ్చు కాదంటే.. పారే నీళ్లల్లో కలిపేయాలి. ప్రతీ ఒక్కరు జనవరి 1న అష్టాక్షరీ మంత్రం జపించుకోవాలి. సూర్యుడికి అధిష్టాన దైవం శ్రీ మహా విష్ణువు . అందువల్ల ఆ రోజు 108 సార్లు లేదా 54 లేదా 21 సార్లు ఓం నమో నారాయణ నాయ అనే మంత్రాన్ని జపిస్తే మంచి జరుగుతుందని జ్యోతిష్య పురాణం చెబుతోంది.

అలాగే జనవరి 1న ఆదిత్య హృదయ చదువుకున్నా ,సూర్యాష్టకం చదువుకున్నా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. 2023లో సొంతం ఇల్లు యోగం కలగాలంటే నానబెట్టిన కందులు ఆవుకి ఆహారంగా తినిపించాలి. స్నానం చేసే నీళ్లల్లో నల్ల నువ్వులు, ఉసిరికాయ పొడి కలుపుకుని ఐదు నిమిషాల తర్వాత స్నానం చేయాలి. తర్వాత దక్షిణ దిక్కులో పీట ఏర్పాటు చేసి పసుపు, కుంకుమ రాసి పీట పైట త్రిబుజాకారంలో ముగ్గు వేసి మట్టి ప్రమిదిలో 9 వత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. న్యూమరాలిజీ పరంగా 1-1-2023 మొత్తం కలిపితే తొమ్మిది వచ్చింది కాబట్టి ఇలా దీపాన్ని వెలిగిస్తే కుజుడు బ్రహ్మాండంగా దీవిస్తాడు . ఈ వేళ సుబ్రహ్మణ్యస్వామికి ఆలయానికి వెళ్లినా, లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్లి అక్కడ అర్చన, అభిషేకం చేయించుకుంటే ఉత్తమ ఫలితం దక్కుతుంది.


Tags

Related News

Navratri: నవరాత్రి 9వ రోజు.. దుర్గాదేవిని ఇలా పూజిస్తే సకల సంపదలు !

Bathukamma 2025: సద్దుల బతుకమ్మ.. పేరు వెనక అసలు కథ ఇదే !

Ramayana Story: ఎలుక పై మూడు గీతలు వెనుక శ్రీరాముడి మహిమ? మీకు తెలుసా?

Navratri Day 8: నవరాత్రుల్లో 8వ రోజు.. సరస్వతి దేవిని ఎలా పూజించాలి ?

Bathukamma 2025: వెన్నముద్దల బతుకమ్మ ప్రత్యేకత ఏంటి ?

Navaratri 2025: మహాచండీ దేవిని 7వ రోజు ఎలా పూజించాలి ? సమర్పించాల్సిన నైవేద్యం ఏంటి ?

Navaratri 2025: నవరాత్రి 6వ రోజు.. లలితా దేవిని ఏ విధంగా పూజించాలో తెలుసా ?

Bathukamma 2025: వేపకాయల బతుకమ్మ.. ఆ పేరు వెనక కథ, సమర్పించాల్సిన నైవేద్యం ఏంటి ?

Big Stories

×