Akhanda 2 : ప్రస్తుతం చాలామంది స్టార్ హీరోల అభిమానులు రికార్డులు గురించి ప్రస్తావన వస్తే కలెక్షన్ల గురించి మాట్లాడుతారు. కానీ ఒకప్పుడు రికార్డు అంటే ఏ సినిమా ఏ థియేటర్ లో ఎన్ని రోజులు ఆడింది అనే దానిపైన డిపెండ్ అయి ఉండేది. ఇప్పుడు సినిమాకి సంబంధించి 50 రోజుల పోస్టర్ చూడటమే గగనం అయిపోయింది.
ఒక సినిమా విడుదలైందంటే నెల తిరగకుండానే ఓటీటీలో కూడా ప్రత్యక్షమవుతుంది. స్టార్ హీరో సినిమాలు విడుదలయితేనే ప్రేక్షకులు భారీ స్థాయిలో సినిమాకు వస్తున్నారు. అయితే వాటి మధ్య కాన్సెప్ట్ బేస్ సినిమాలు ఉన్నా కూడా దానిని ఎంకరేజ్ చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ వర్సెస్ నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ మధ్య వివాదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.
బాలకృష్ణ అసెంబ్లీ వ్యాఖ్యలు తీవ్రదుమారాన్ని రేపాయి. దానిపైన ఏకంగా చిరంజీవి స్పందించారు. ఇప్పుడు సినిమా అప్డేట్ విషయంలో కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు చాలామంది హీరోలు తమ హీరోల సినిమాల గురించి ట్వీట్స్ వేయడం మొదలు పెడుతున్నారు. కానీ ఒకప్పుడు మాత్రం బాలకృష్ణ మరియు చిరంజీవి సినిమాల మధ్య విపరీతమైన మంచి పోటీ నెలకొనేది. అలానే ఇన్ డైరెక్ట్ గా ఒకరి గురించి మరొకరి సినిమాల్లో డైలాగులు కూడా ఉండేవి.
కొద్దిసేపటికి క్రితమే మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా నుంచి అప్డేట్ రాబోతున్నట్లు అనౌన్స్ చేశారు. ఇక తాజాగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న అఖండ 2 సినిమా నుంచి కూడా విషెస్ పోస్టర్ రానున్నట్లు కొద్దిసేపటి క్రితమే అనౌన్స్ చేశారు.
అఖండ 2 సినిమా మీద కూడా మంచి అంచనాలు ఉన్నాయి. డిసెంబర్ నెలలో ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది. హ్యాట్రిక్ హిట్స్ తర్వాత బోయపాటి శ్రీను బాలకృష్ణ కాంబినేషన్లో వస్తున్న సినిమా ఇది. 14 రీల్స్ నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తున్నారు
Dasara celebrations will begin with #Akhanda2Thaandavam ✨🔥#Akhanda2 new poster with festival wishes 💥
Tomorrow at 9.36 AM ❤🔥
— 14 Reels Plus (@14ReelsPlus) October 1, 2025
అఖండ 2 నుంచి అప్డేట్ వస్తుందని ఎవరు ఊహించలేదు. మొత్తానికి వాళ్లు ఇచ్చిన అప్డేట్ తో బాలకృష్ణ అభిమానులు మంచి హై లో ఉన్నారు. గతంలో మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీపడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మెగాస్టార్ రీ ఎంట్రీ సినిమా ఖైదీ నెంబర్ 150 టైంలో కూడా బాలకృష్ణ నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి విడుదలైంది. అయితే అప్పుడు ఆ రెండు సినిమాలు కూడా బానే ఆడాయి. వాటన్నిటిని మించి ఆ సంవత్సరం విడుదలైన శతమానం భవతి మంచి సక్సెస్ సాధించింది.
ఇప్పుడు ఒకేసారి రెండు సినిమాల నుంచి కూడా అప్డేట్స్ వస్తున్నాయి. మళ్లీ బాలయ్య అభిమానులు, చిరు అభిమానులు ఒకరి మీద ఒకరు, సినిమాపై ఒకరు ట్వీట్స్ వేస్తూ సోషల్ మీడియాలో ఫైట్స్ కొనసాగిస్తారు. ఈ సినిమాలు రిలీజ్ డేట్స్ మధ్య ఒక నెల రోజుల గ్యాప్ ఉంది కాబట్టి ఫ్యాన్స్ ఆర్గ్యుమెంట్స్ లో కొద్దిపాటి తీవ్రత తగ్గింది.
Also Read: MSVPG : మన శంకర వరప్రసాద్ గారు దసరా సర్ప్రైజ్, ఫస్ట్ లుక్ పోస్టర్ వైరల్!