BigTV English

Balakrishna: బాలయ్య బ్రాండ్ కొత్త యాడ్ వీడియో… AI తో మ్యానేజ్ చేశారా ఏంటి?

Balakrishna: బాలయ్య బ్రాండ్ కొత్త యాడ్ వీడియో… AI తో మ్యానేజ్ చేశారా ఏంటి?

Balakrishna: నందమూరి నట సింహం బాలకృష్ణ (Balakrishna)ఇటీవల కాలంలో ఒకవైపు వరస సినిమాలు చేస్తూనే మరోవైపు పలు బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ భారీగా సంపాదిస్తున్నారు. బాలయ్య సినీ కెరియర్ లో ఇప్పటివరకు ఇలా పలు బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించింది లేదు కానీ, ఇటీవల కాలంలో ఈయన వరుస ప్రమోషన్లను నిర్వహిస్తున్నారు. అయితే ఈ ప్రమోషన్ల ద్వారా వచ్చే డబ్బును ఈయన బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కు విరాళంగా అందజేస్తున్న సంగతి తెలిసిందే. ఇక బాలకృష్ణ మాన్షన్ హౌస్ డ్రింకింగ్ వాటర్ (Mansion House Drinking water)బ్రాండ్ ను ప్రమోట్ చేస్తున్నారు.


దిల్ ఓపెన్ చెయ్..లైఫ్ వెల్కమ్ చెయ్..

తాజాగా మాన్షన్ హౌస్ డ్రింకింగ్ వాటర్ ప్రమోషన్ లో భాగంగా మరొక కొత్త యాడ్ వీడియోని విడుదల చేశారు. ఇక ఈ వీడియోలో భాగంగా బాలకృష్ణ రోబోలతో కలిసి డాన్స్ చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో బాలయ్య మాట్లాడుతూ.. “దూరాలను దూరం చేయి.. అనుకొని బంధాలను దగ్గర చెయ్యి, జిందగీలో ఏదైనా దిల్ ఓపెన్ చెయ్.. లైఫ్ వెల్కమ్ చెయ్యి” అంటూ బాలయ్య మాట్లాడుతూ ఉన్న ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ వీడియోలో బాలయ్య రోబోలతో కలిసి డాన్స్ చేయడంతో ఈ వీడియో పై పలువురు విభిన్న రీతిలో స్పందిస్తున్నారు. బాలకృష్ణకు సంబంధించిన ఈ కొత్త యాడ్ వీడియోని నిజంగానే చేశారా? లేకపోతే ఏఐతో మేనేజ్ చేశారా? అంటూ సందేహాలను వ్యక్తపరుస్తున్నారు.

ఎక్కడికి వెళ్లినా మ్యాన్షన్ హౌస్ ఉండాల్సిందే..

ఈ వీడియోలో బాలకృష్ణ లుక్ రియల్ గా కనిపించని నేపథ్యంలో ఈ విధమైనటువంటి సందేహాలను వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇక బాలకృష్ణ బ్రాండ్ మాన్షన్ హౌస్ అనే సంగతి మనకు తెలిసిందే. అయితే ఈయన ఎక్కడికి వెళ్లినా మెన్షన్ హౌస్ ఆల్కహాల్ బాటిల్ తనతో పాటు తీసుకువెళ్తారు అంటూ బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ ఒక ఇంటర్వ్యూ సందర్భంగా చేసిన ఈ కామెంట్స్ అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి. తాజాగా ఈయన మాన్షన్ హౌస్ డ్రింకింగ్ వాటర్ కు ప్రచారకర్తగా వ్యవహరించడం విశేషం.


ఇక బాలకృష్ణ కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2 సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ పనులన్నింటినీ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్నారు. నిజానికి ఈ సినిమా సెప్టెంబర్ 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా అదే రోజు పవన్ కళ్యాణ్ సినిమా విడుదల అవుతున్న నేపథ్యంలో ఈ సినిమాని వాయిదా వేశారు. ఇక అఖండ 2 డిసెంబర్ 5వ తేదీ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోందని తెలుస్తోంది. మొదటిసారి బాలకృష్ణ నటించిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుండటం విశేషం.. ఇప్పటికే సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమాపై భారీ అంచనాలనే పెంచేశాయి.

Also Read: Samantha: బన్నీ AA 22 లో సమంత స్పెషల్ రోల్.. రెమ్యూనరేషన్ ఎంతంటే?

Related News

Allu Arjun : అల్లు రామలింగయ్య కు అల్లు అర్జున్ నివాళి, బన్నీ కొత్త లుక్ చూసారా?

OG Success Event : బండ్లన్న లేని లోటు తీర్చిన తమన్, నవ్వు ఆపుకోలేక పోయిన పవన్

OG Success Event : నా బలహీనతతో తమన్, సుజీత్ ఆడుకున్నారు. చంపేస్తాను అంటూ పవన్ వార్నింగ్

OG Success Meet : పవన్ కళ్యాణ్ ఆ డిజాస్టర్ సినిమా లేకపోతే నేను లేను, సుజీత్ షాకింగ్ కామెంట్స్

OG Success Event : షాకింగ్ న్యూస్, ఓజీ యూనివర్స్ కు పవన్ కళ్యాణ్ నో? ఆ సైగ కి అర్థం ఏంటి?

OG Success Event: పవన్ కళ్యాణ్ ను ఆ విషయంలో రిక్వెస్ట్ చేసిన దిల్ రాజు.. సాధ్యమయ్యేనా?

OG Success Event : ప్రియాంక మోహన్ బట్టలపై తమన్ షాకింగ్ కామెంట్స్

Akhanda 2 : పోటాపోటీగా చిరు, బాలయ్య సినిమా అప్డేట్స్, ఫైట్ కొనసాగుతుందా?

Big Stories

×