OG Success Event : సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన సినిమా ఓ జి. సెప్టెంబర్ 25న ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మొదటి షో పడినప్పుడు నుంచే పాజిటివ్ టాక్ సాధించుకుంది. ఈ సినిమాలో కన్మణి అనే పాత్రలో కనిపించింది ప్రియాంక మోహన్. పవన్ కళ్యాణ్ ను సినిమాలో ఎంత అందంగా చూపించాడో అదే స్థాయిలో ప్రియాంకను కూడా చూపించాడు సుజిత్.
ప్రియాంక యాక్టింగ్ విషయంలో చాలామంది కంప్లైంట్ చేశారు. కానీ లుక్స్ విషయంలో మాత్రం పెద్దగా కంప్లైంట్స్ రాలేదు. ఇకపోతే సినిమాలో వాళ్ళిద్దరి మధ్య పెయిర్ కూడా చాలా బాగుంది. ఈ సినిమాతో ప్రియాంకకి కూడా మంచి పేరు వచ్చింది. ఈ సినిమాకి సంబంధించిన సక్సెస్ ఈవెంట్ నేడు జరుగుతుంది.
ఈ సినిమాలో కన్మణి అనే పాత్ర తనకు చాలా ప్రత్యేకం అని చెప్పింది ప్రియాంక అరుళ్ మోహన్. ఈ క్యారెక్టర్ నాకు ఇప్పుడు హృదయానికి దగ్గరగా ఉంటుంది. ప్రియాంక తమన్ ను ఉద్దేశిస్తూ..
అందరూ చెప్పినట్టు నువ్వు బిగ్గెస్ట్ పిల్లర్ ఈ సినిమాకి. నిన్న ఫోన్ చేసి అందరూ బ్లాక్ వేసుకొని సక్సెస్ ఈవెంట్ కి వస్తున్నారు. మీరు కూడా బ్లాక్ కలర్ బట్టలు వేసుకొని సక్సెస్ ఈవెంట్ కి రండి. అని చెప్పారు. నేను కన్మణి ఎప్పుడూ చీరలు కట్టుకుంటుంది కదా అని తమన్ తో చెప్పాను. లేదు మీరు సారీ కాదు ఖచ్చితంగా బ్లాక్ కలర్ బట్టలు వేసుకొని రావాల్సిందే అని చెప్పారు.
తమన్ నువ్వు ఇచ్చిన మ్యూజిక్ గురించి నేను ముందే చెప్పాను కన్సర్ట్ జరుగుతుంది అని. అలానే థియేటర్లో కూడా మేము చూసినప్పుడు ఒక ట్రాన్స్ లోకి వెళ్లిపోయాం. చాలా స్పెషల్ దానయ్య గారు ఇది నాకు చాలా స్పెషల్ ఫిలిం. బ్యానర్ లో నేను చేసిన రెండవ ఫిలిం. థాంక్యూ సో మచ్.
సినిమాలకు సంబంధించి అసిస్టెంట్ డైరెక్టర్ అనేవారు చాలా కీలకము. తెర పైన కనిపించే ప్రతి పర్ఫెక్షన్ కి వెనక కష్టపడే టీం ఒకటి ఉంటుంది వాళ్లే అసిస్టెంట్ డైరెక్టర్స్. బట్టల విషయంలోనూ ఆర్ట్ వర్క్ విషయంలోనూ అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్వాల్వ్ అవుతూనే ఉంటారు. అయితే అసిస్టెంట్ డైరెక్టర్స్ టీం సుజిత్ కి చాలా పెద్ద సపోర్ట్ అంటూ ప్రియాంక చెప్పారు.
గతంలో పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడుతూ ఇటువంటి టీం నాకు ఉండి ఉంటే నేను పాలిటిక్స్ లోకి వచ్చేవాడిని కాదు సినిమా ఫీల్డ్ లోనే ఉండేవాడిని అంటూ పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు.
Also Read: Akhanda2 : పోటాపోటీగా చిరు, బాలయ్య సినిమా అప్డేట్స్, ఫైట్ కొనసాగుతుందా?