Vishal Brahma Arrest: ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ 2019లో నిర్మించిన ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్-2’లో సామ్రాట్ పాత్రలో నటించిన బాలీవుడ్ హీరో విశాల్ బ్రహ్మ డ్రగ్స్ కేసులో అరెస్టు అయ్యారు. చెన్నై ఎయిర్ పోర్టు రూ.40 కోట్ల విలువైన డ్రగ్స్ తో విశాల్ బ్రహ్మ డీఆర్ఐ అధికారులకు పట్టుబడ్డారు. అస్సాంకు చెందిన విశాల్ బ్రహ్మ ఎయిర్ ఇండియా విమానంలో సింగపూర్ నుంచి చెన్నైకి తిరిగి వస్తుండగా అధికారులు అతడ్ని తనిఖీ చేయగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఈ డ్రగ్స్ సిండికేట్ వెనుక నైజీరియన్ ముఠా ఉన్నట్లు డీఆర్ఐ వర్గాలు వెల్లడించాయి.
విశాల్ బ్రహ్మకు ఇటీవల సినీ అవకాశాలు తగ్గడంతో ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నాడని, స్నేహితుల ద్వారా నైజీరియా డ్రగ్స్ ముఠా పరిచయమైందని సమాచారం. ఆ ముఠా బ్రహ్మను కాంబోడియా ట్రిప్‌కు తీసుకెళ్లి, భారత్‌కు డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తే కొంత డబ్బు ఇస్తామని ఆశ చూపినట్టు తెలుస్తోంది. రెండు వారాల క్రితం విశాల్ బ్రహ్మ దిల్లీ నుంచి కాంబోడియా వెళ్లారు.
విశాల్ ఇండియాకు తిరిగి వచ్చేటప్పుడు ఓ నైజీరియన్ ట్రాలీ బ్యాగ్ ఇవ్వగా అందులో భారీగా డ్రగ్స్ ఉన్నట్టు సమాచారం. కాంబోడియా నుంచి సింగపూర్ మీదుగా చెన్నై ఎయిర్ పోర్టుకు అక్కడి నుంచి దిల్లీకి రైలులో చేరుకోవాలని నైజీరియా గ్యాంగ్ బ్రహ్మకు సూచించినట్టు డీఆర్ఐ గుర్తించింది.
Also Read: Tandoor Crime: రైలు ఎక్కుతూ జారిపడి ASI మృతి.. వికారాబాద్ జిల్లాలో ఘటన
పునీత్ మల్హోత్రా దర్శకత్వం వహించిన బాలీవుడ్ సినిమా ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’లో సామ్రాట్ అనే సహాయ పాత్ర పోషించిన విశాల్ బ్రహ్మ బాగా పేరు వచ్చింది. ఈ చిత్రంలో టైగర్ ష్రాఫ్, తారా సుతారియా, అనన్య పాండే నటించారు. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ ట్రోఫీ కోసం కళాశాల విద్యార్థుల మధ్య పోటీ, వారి మధ్య స్నేహాలు, ప్రేమ సంబంధాలను చక్కగా చిత్రీకరించారు.