OG Success Events : సినీ నటుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)హీరోగా నటించిన ఓజీ సినిమా(OG Movie) అద్భుతమైన విజయాన్ని అందుకున్న నేపథ్యంలో నేడు చిత్ర బృందం సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిత్ర బృందంతో పాటు సినిమా డిస్ట్రిబ్యూటర్లు కూడా హాజరై సందడి చేశారు. ఈ సినిమా నైజం డిస్ట్రిబ్యూట్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు(Dil Raju) కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కార్యక్రమంలో భాగంగా నిర్మాత దిల్ రాజు పాల్గొంటూ పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా దిల్ రాజు కళ్యాణ్ తొలి సినిమా గురించి ఓజీ వరకు మాట్లాడుతూ తనపై ప్రశంసలు కురిపించారు. డైరెక్టర్ సుజిత్ పవన్ కళ్యాణ్ అభిమానిగా తనని ఏ విధంగా చూపించాలనుకున్నారో అంతే అద్భుతంగా తెరపై చూపించారని దిల్ రాజు ప్రశంసలు కురిపించారు. తన నిజ జీవితంలో కూడా పవన్ కళ్యాణ్ తనకు ఎంతో స్ఫూర్తిగా నిలుస్తారని తెలియజేశారు. ఇక పవన్ కళ్యాణ్ తన సినీ కెరియర్ లో ఎన్నో ఎత్తు పల్లాలను చూశారు. రాజకీయాలలో కూడా ఆయన ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని నేడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా కొనసాగుతున్నారని ప్రశంసించారు.
ఇలా పవన్ కళ్యాణ్ గురించి దిల్ రాజు మాట్లాడుతూ ప్రశంసలు కురిపించడమే కాకుండా పవన్ కళ్యాణ్ ను సినిమాల విషయంలో ఒక రిక్వెస్ట్ కూడా చేశారు. మీరు రాజకీయాల పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ ప్రతి ఏడాది మాకోసం ఒక సినిమా చేయండి అంటూ ఈ సందర్భంగా దిల్ రాజు పవన్ కళ్యాణ్ ని కోరారు. దిల్ రాజు ఇలా మాట్లాడటంతో వెంటనే సుమ తప్పకుండా చేస్తారు దిల్ రాజు గారు ఎందుకంటే ఆయనే స్వయంగా ఓ జి యూనివర్స్ ప్రకటించారు అంటూ సుమ తెలియజేశారు. అయితే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా కొనసాగుతున్న నేపథ్యంలో తన రాజకీయ వ్యవహారాలతో ఎంతో బిజీగా ఉన్నారు ఇలా రాజకీయాలలో బిజీగా ఉన్న ఈయన ఏడాదికి ఒక సినిమా చేయడం సాధ్యమయ్యే పనేనా అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.
ఓజీ యూనివర్స్ ప్రకటించిన పవన్..
ఇక ఓజీ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న నేపథ్యంలో ఈ సినిమాకి సీక్వెల్ కూడా ఉండబోతోంది అంటూ స్వయంగా పవన్ కళ్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. సీక్వెల్ తో పాటు ప్రీక్వెల్ కూడా ఉంటుందని తెలియజేయడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఓజి సినిమా డిసెంబర్ లో ప్రారంభం కాబోతోందని తెలుస్తోంది. ప్రస్తుతం సుజిత్ నానితో కలిసి బ్లడీ రోమియో అనే సినిమా పనులను ప్రారంభిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ వచ్చేయడానికి ఏప్రిల్ కి పూర్తి కాగా డిసెంబర్ నుంచి ఓజి 2 షూటింగ్ ప్రారంభం కాబోతుందని వెల్లడించారు. ఏది ఏమైనా ఓజీ యూనివర్స్ గురించి స్వయంగా పవన్ కళ్యాణ్ ప్రకటించడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు.
Also Read: Balakrishna: బాలయ్య బ్రాండ్ కొత్త యాడ్ వీడియో… AI తో మ్యానేజ్ చేశారా ఏంటి?