BigTV English

OTT Movie : పర్యావరణం అంటే పరవశించిపోతారా ? ఈ సినిమాను చూశాక పారిపోతారు భయ్యా

OTT Movie : పర్యావరణం అంటే పరవశించిపోతారా ? ఈ సినిమాను చూశాక పారిపోతారు భయ్యా

OTT Movie : ఈ ఏడాది నెట్‌ఫ్లిక్స్‌లో ఒక ప్రత్యేకమైన డాక్యుమెంటరీ సిరీస్ స్ట్రీమింగ్ కి వచ్చింది. ఇది జంతువుల జీవితాన్ని హారర్ సినిమాలా చూపిస్తుంది. సాధారణ డాక్యుమెంటరీలా కాకుండా, ఈ సిరీస్ ప్రకృతిలోని భయంకరమైన విషయాలను ఉత్కంఠగా, భయపెట్టే విధంగా చూపిస్తుంది. ఈ సిరీస్ జంతువుల పోరాటాన్ని ఒక థ్రిల్లర్ సినిమాలా ఫీల్ అయ్యేలా చేస్తుంది. ఈ సిరీస్‌లో జంతువుల జీవితంలోని నిజమైన సంఘటనలను తీసుకుని, వాటిని భయంకరంగా, సినిమాటిక్‌గా చూపించడం జరిగింది. ఈ డాక్యుమెంటరీ సిరీస్ పేరు ఏమిటి ? స్టోరీ ఎలా ఉంటుంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.


నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్

‘నైట్‌మేర్స్ ఆఫ్ నేచర్’ (Nightmares of Nature) 2025లో విడుదలైన అమెరికన్ హారర్ సై-ఫై డాక్యుమెంటరీ మినీ సిరీస్. దీనిని బ్లమ్‌హౌస్ టెలివిజన్, ప్లిమ్సాల్ ప్రొడక్షన్స్ కలసి నిర్మించాయి. ఈ సిరీస్ 2025 సెప్టెంబర్ 30న నెట్‌ఫ్లిక్స్‌లో ప్రీమియర్ అయింది. 3 ఎపిసోడ్‌లతో (ప్రతి ఎపిసోడ్ 44 నిమిషాలు) IMDbలో 7.5/10 రేటింగ్ పొందింది. సీజన్ 2, 2025 అక్టోబర్ లో విడుదల కానుంది.

సీజన్ 1 – (క్యాబిన్ ఇన్ ది వుడ్స్)

మొదటి సీజన్‌లో మూడు ఎపిసోడ్‌లు ఉన్నాయి. అవి ఉత్తర అమెరికా అడవుల్లో జరుగుతాయి. కథలో మూడు జంతువులు, ఒక ప్రెగ్నెంట్ ఎలుక, ఒక చిన్న రాకూన్, ఒక కప్ప పిల్ల ప్రధాన పాత్రలుగా ఉన్నాయి. ఈ జంతువులు అడవిలో భయంకరమైన ప్రమాదాల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాయి. తోడేళ్లు, గుడ్లగూబలు, ఇతర జంతువులు వీటిని వేటాడుతుంటాయి. ఈ సమయంలో ఒక రాత్రి భారీ వర్షం వస్తుంది. దీంతో ఈ మూడు జంతువులు ఒక పాడుబడిన క్యాబిన్‌లో దాక్కుంటాయి. కానీ ఈ క్యాబిన్ కూడా అనుకున్నంత సేఫ్టీ ఉండదు. వర్షం, చీకటి, బయట ఉన్న జంతువులు ఈ క్యాబిన్‌ను ఒక ఉచ్చులా మారుస్తాయి. ఎలుక, రాకూన్, కప్ప పిల్ల భయంతో వణికిపోతుంటాయి. ఒక్కో జంతువు తనదైన రీతిలో బయటపడేందుకు పోరాడుతుంది. కానీ అడవిలోకి తిరిగి వెళ్లాలంటే మరిన్ని ప్రమాదాలు ఎదురవుతాయి. కథ చివర్లో ఈ జంతువులు ప్రాణాలతో బయటపడతాయా ? అనేది ఈ సిరీస్ ని చూసి తెలుసుకోవాల్సిందే.


సీజన్ – 2 (లాస్ట్ ఇన్ ది జంగిల్)

సెంట్రల్ అమెరికా రెయిన్‌ఫారెస్ట్‌లో జరుగుతుంది. ఇది అక్టోబర్ 2025 చివర్లో విడుదలవుతుంది. ఇందులో కొత్త జంతువులు ప్రధాన పాత్రలు పోషిస్తాయి. ఇవి భయంకరమైన వాంపైర్ ఫిష్, కీటకాలు, మాంసాన్ని తినే చెట్ల వంటి ప్రమాదాలను ఎదుర్కొంటాయి. ఈ సీజన్ కూడా జంతువుల బతుకు పోరాటాన్ని, ఒక హారర్ సినిమాలా చూపిస్తుంది. ఇందులో ప్రతి జంతువు తన శత్రువుల నుంచి తప్పించుకోవడానికి, బతకడానికి చేసే ప్రయత్నాలు ఉత్కంఠగా ఉంటాయి.

Read Also : చావడానికెళ్లి సీరియల్ కిల్లర్ చేతిలో అడ్డంగా బుక్కయ్యే అమ్మాయి… గూస్ బంప్స్ తెప్పించే సర్వైవల్ థ్రిల్లర్

Related News

OTT Movie : నాలుగడుగుల అంకుల్ తో ఆరడుగుల ఆంటీ డేటింగ్ …. వద్దంటూనే వదలకుండా ఆ పని … క్లైమాక్స్ వరకు అరుపులే

OTT Movie : ఫ్రెండ్ భార్యతో యవ్వారం… నిద్ర కరువయ్యే కథ సామీ… ఆ సీన్లు కుడా

OTT Movie : 16 ఏళ్ల టీనేజ్ గర్ల్ కు పవర్స్… ఒక్కొక్కడినీ చిత్తుచిత్తుగా కొట్టి తరిమేసే పిల్ల పిశాచాలు… పిల్లలకు పండగే

OTT Movie : డ్రగ్స్ మత్తులో దెయ్యాలని పిలిచే మెంటలోడు… కట్ చేస్తే ఒక్కొక్కడికి ఉంటదిరా చారీ

Idli Kottu OTT: ధనుష్ ఇడ్లీకొట్టు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్.. స్ట్రీమింగ్ అప్పుడే!

OTT Movie : భార్య ఉండగానే మరో అమ్మాయితో… పెళ్ళాన్ని లేపేయడానికి మాస్టర్ ప్లాన్… క్లైమాక్స్ ట్విస్టుకు ఫ్యూజులు అవుట్

OTT Movie : పిల్లలు పుట్టట్లేదని ఫ్యూజులు అవుట్ అయ్యే పని… ఆ టెస్టుకు మాత్రం ఒప్పుకోని భర్త… లాస్ట్ ట్విస్ట్ హైలెట్

Big Stories

×