BigTV English

Puri Jagannath: పూరీ జగన్నాథ రథం అక్కడ మాత్రమే ఆగిపోతుందా….

Puri Jagannath: పూరీ జగన్నాథ రథం అక్కడ మాత్రమే ఆగిపోతుందా….
Puri Jagannath: పూరీ జగన్నాథ రథం అక్కడ మాత్రమే ఆగిపోతుందా....


Puri Jagannath: పూరీ జగన్నాథుడు మహిళలు ఎన్నో ఉన్నాయి . ముఖ్యంగా ఆషాఢమాసంలో జరిగే రథయాత్ర చూడటానికి లక్షలాది భక్తులు పూరికి తరలివస్తుంటారు. కొన్ని కోట్లమంది ఆ రథోత్సవాన్ని టీవీలు, ఇతర మీడియాల ద్వారా తిలకించి పునీలవుతుంటారు. జగన్నాథుడి రథయాత్ర జరిగేటప్పుడు గుడి దాటిన ఒక ప్రాంతానికి ఆగుతుంది. ఈవిషయంలో బయట రకరకాల ప్రచారం జరుగుతోంది. కాని వాస్తవం ఏంటంటే ఏటా జరిగే రథయాత్ర లో రథం ఒక చోట కావాలనే ఆపుతారు.  సాలా భేగమ్ అనే ముస్లిం భక్తుడి సమాధి దగ్గర కొన్ని క్షణాలు నిలిపి ఉంచుతారు. రథం అక్కడ దానంతట అది ఆగదు.  అక్కడ ఆపుతారంతే. కానీ రథం అక్కడే ఆగిపోతుందని ప్రచారం జరుగుతోంది. దీని వెనుక ఒక కథ ఉంది.

లాల్ భేగ్ అనే ముస్లిం సామంత రాజు ఉండేవాడు. అతని కొడుకి పేరు సాలా భేగ్. చిన్న వయసులోనే తన  పరాక్రమంతో యుద్ధంలో దడ పుట్టించేవాడు. వయసులో వచ్చేటప్పుడు బాగా గర్వం పెరిగి తనను కొట్టేవాడు లేని గర్వంతో పొంగిపోయేవాడు. ఒకసారి యుద్ధంలో ఉండే వెనకి వచ్చి వ్యక్తి కత్తితో దాడి చేయడంతో తలకి బాగా దెబ్బతగిలింది. ఎన్ని వైద్యాలు చేసినా కోలుకోలేదు. అతను చనిపోవడం ఖాయమని డాక్టర్లు తేల్చేశారు.  ఆరోగ్యంతో ఉన్నప్పుడు గర్వంతో విర్రవీగిన అతడి అహంకారం నేలకి వచ్చేసింది. ఒక స్థితిలో తండ్రి అతడ్ని పూర్తిగా వదిలేశాడు. కానీ సాలాభేగ్ తల్లి మాత్రం అతడికి ధైర్యం చెప్పేది. ఆమె జగన్నాథుడి భక్తురాలు. ఆ దేవుడు నీకు అండగా ఉండాడని బాధపడుతున్న కుమారుడికి ధైర్యం చెప్పేది. 11 రోజులపాటు జగన్నాథుడి స్త్రోత్రాన్ని జపించమని చెప్పింది. పదకొండో రోజు రాత్రి స్వామి కలలో కనిపించి విభూదిని దెబ్బ తగిలిన చోట అద్దుకోమని చెప్పాడట. నిద్రలోనే అతను స్వామి చెప్పినట్టు చేశాడు. తెల్లారే సరికి గాయం కాస్త మాయమైంది.

ఇదంతా జగన్నాథ స్వామి మహిమ అని తెలుసుకున్నా సాలా భేగ్ స్వామి దర్శనం కోసం పూరీకి వెళ్లగా అన్యమత్తస్థుడు కావడంతో  అక్కడ అడ్డుకున్నారు. సాధారణ సమయంలో ఇతర మతస్తుల్ని గుడిలోకి అనుమతించరు. కానీ రథయాత్ర సమయంలో మాత్రం ఎవరైనా సరే ఉత్సవ విగ్రహాల్లో ఉన్న  స్వామిని దర్శనం చేసుకోవచ్చు. సరిగ్గా బేగ్ ఆ సమయంలోనే పూరికి బయలుదేరాడు. కానీ చీకటి పడిపోవడంతో మనస్సులో స్వామిని తలుచుకుని దర్శనం కల్పించమని ప్రాధయేపడ్డాడు. విచిత్రంగా రథం కూడా ఒక చోట వచ్చి ఆగిపోయింది. ఎంత లాగినా ముందుకు కదల్లేదు. అప్పుడు అతని అక్కడికి వచ్చి స్వామిని తనివీ తీరా చూసుకున్న తర్వాతే రథం ముందుకు కదిలింది. ఈవిషయం అందరికి తెలిసింది. అప్పటి నుంచి ప్రతీ ఏటా పూరీ వచ్చి అతడు రధయాత్ర సమయంలో స్వామి దర్శనం చేసుకునేవాడు. ముస్లిం రాజుల ఎవరూ పూరీ జోలికి వెళ్లకుండా తర్వాత చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. అతడు  ప్రాణం విడిచిన చోటే స్వామి రథయాత్ర వెళ్లే గుండీచా మార్గంలో అతని సమాధి ఉంది.  ఆఘటనకు గుర్తుగా ప్రతీ ఏటా సాలాభేగ్ సమాధి దగ్గరకి రాగానే కాసేపు రథాన్ని నిలిపి ఉంచుతారు. అదీ అసలు సంగతి.


Related News

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Big Stories

×