PV Sindhu: భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్, ఒలంపిక్ పతక విజేత, తెలుగు తేజం పీవీ సింధు ప్రస్తుతం ఫామ్ లేక ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. అప్పుడెప్పుడో 2022లో సింగపూర్ ఓపెన్ లో గెలిచిన పీవీ సింధు.. ఆ తర్వాత ఏ మేజర్ టోర్నీ లోను విజేతగా నిలవలేదు. ఈ ఏడాది జూన్ లో జరిగిన మలేషియా మాస్టర్స్ లో తొలి రౌండ్ లోనే వెనుదిరిగింది. గెలవాల్సిన మ్యాచ్ లో పట్టుకోల్పోయి రెండవ రౌండ్ లోనే ఇంటిదారి పట్టింది.
Also Read: Harleen Deol: మోడీ సార్.. ఎందుకు ఇంత హ్యాండ్సమ్ గా ఉంటారు? హర్లీన్ డియోల్ ఫన్నీ క్వశ్చన్
ఇక ఈమె ఆటకు ఎంతోమంది క్రీడాభిమానులు ఉన్నారు. అలాగే సోషల్ మీడియాలో తరచూ ఆక్టివ్ గా ఉండే పీవీ సింధు.. ఇంట్రెస్టింగ్ పోస్ట్ లు పెడుతూ ఉంటుంది. ఈమె పేరు చెప్పగానే అందరికీ బ్యాడ్మింటన్ కోర్టులో ఇండియా జెర్సీ వేసుకొని పథకాల వేట సాగించే ఛాంపియన్ గుర్తుకొస్తుంది. కానీ ఈమెలో మరో యాంగిల్ కూడా ఉంది. తాజాగా తన భర్తతో కలిసి స్విమ్మింగ్ పూల్ లో బికినీలో ఫోటోలతో ఆమె ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది.
తాజాగా తన భర్తతో కలిసి {New zealand} కి విహారయాత్రకు వెళ్లింది పీవీ సింధు. ఈ సందర్భంగా ఆమె తన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి. ప్రస్తుతం సింధు మానసికంగా, శారీరకంగా రిఫ్రెష్ అయ్యేందుకు ఈ విహారయాత్రకు వెళ్లినట్లు సమాచారం. తన భర్త వెంకట దత్తా సాయి తో కలిసి సముద్రం అంచున ఉన్న ఓ రిసార్ట్ లోని స్విమ్మింగ్ పూల్ లో ఆమె సేదతీరుతుంది. ఎప్పుడూ క్రీడా దుస్తులలో తీవ్రమైన ఒత్తిడి మధ్య కనిపించే పీవీ సింధు.. ఈ వెకేషన్ లో పూర్తి భిన్నంగా దర్శనమిచ్చింది. నిరంతరం ఆటపై దృష్టి సారించే సింధు.. ఇలా విరామ సమయాల్లో తనలోని మరో కోణాన్ని అభిమానులతో పంచుకోవడం విశేషం. ఇక ఈ వెకేషన్ అనంతరం ఆమె రాబోయే టోర్నమెంట్ ల కోసం తన ప్రాక్టీస్ ని ప్రారంభించనుంది.
2022 సింగపూర్ ఓపెన్ అనంతరం పివి సింధు మరో మేజర్ టైటిల్ గెలవలేదు. గాయం నుంచి కోలుకుని తిరిగి వచ్చిన తర్వాత ఫామ్ కోసం ఎదురుచూస్తుంది. రాబోయే టోర్నమెంట్ ల కోసం పూర్తిస్థాయిలో సిద్ధం అయ్యేందుకు ఈ విరామం తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే ఈ విరామం అనంతరం ఆమె తిరిగి తన విజయ పరంపరను కొనసాగించాలని ఆమె అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
2024 డిసెంబర్ 22న సాయి దత్తాని వివాహం చేసుకుంది సింధు. ఈ జంట ఇప్పుడు వెకేషన్ లో ఉంది. ఈ సరదా టైం ని ఎంజాయ్ చేస్తుంది. అయితే వైరల్ గా మారిన ఈ ఫోటోలను చూసి సూపర్ మేడం అంటూ నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు. యంగ్ స్టర్స్ కి మీరు ఎప్పుడు ఇన్స్పిరేషన్ అని.. వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేయండని అంటున్నారు. అదే సమయంలో మంచి కం బ్యాక్ ఇచ్చి సరైన టైటిల్ ని సొంతం చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.