BigTV English
Advertisement

Bahubali: The Epic Collections: బాహుబలి ది ఎపిక్ కలెక్షన్స్.. మొత్తం ఎన్ని కోట్లు రాబట్టిందంటే?

Bahubali: The Epic Collections: బాహుబలి ది ఎపిక్ కలెక్షన్స్.. మొత్తం ఎన్ని కోట్లు రాబట్టిందంటే?

Bahubali:బాహుబలి (Bahubali) తెలుగు సినిమా చరిత్రను తిరగరాసిన మూవీ.. రాజమౌళి (Rajamouli) ఆలోచనలు ఎలా ఉంటాయో బాహుబలి సినిమా కళ్లకు కట్టినట్టు చూపించింది. ఆయన ఇప్పటివరకు ఇండియన్ సినీ హిస్టరీలోనే రానటువంటి సినిమాతో మన ముందుకు వచ్చారు. అయితే బాహుబలి మొదట రిలీజ్ అయిన సమయంలో టాక్ చూసి రాజమౌళి చాలా హర్ట్ అయ్యారట. సినిమా డిజాస్టర్ అనుకున్నారట. కానీ రెండు మూడు రోజుల్లో సినిమా ఫలితం తెలిసిపోయింది. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఖ్యాతిని ఎక్కడికో తీసుకువెళ్లింది. మొదటి పార్ట్ వచ్చిన సమయంలో క్లైమాక్స్ లో బాహుబలిని కట్టప్ప చంపే సీన్ ఉంటుంది. ఆ క్లైమాక్స్ చూసిన ప్రతి ఒక్కరూ బాహుబలికి అంత విధేయుడిగా ఉండే కట్టప్ప అసలు బాహుబలిని ఎందుకు చంపారని ఎంతోమంది జుట్టు పీక్కున్నారు. చాలా సందర్భాల్లో రాజమౌళికి, మిగతా చిత్ర యూనిట్ కి అసలు బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు? అనే ప్రశ్న ఎదురైంది. అది తెలియాలంటే పార్ట్ -3 చూడాల్సిందే అని సస్పెన్స్ లో పెట్టారు.


రూ.100 కోట్ల టార్గెట్ తో బాహుబలి ది ఎపిక్ రిలీజ్..

కట్టప్ప బాహుబలిని చంపడంపై పలు మీమ్స్ కూడా వైరల్ అయ్యాయి. అలా ఫైనల్ గా బాహుబలి 2 విడుదలయ్యాక దానికి ఆన్సర్ దొరికింది.అలా బాహుబలి 2 ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసుకున్న బాహుబలి 1, బాహుబలి 2 రెండు సినిమాలను కలిపి ‘బాహుబలి ది ఎపిక్’ పేరుతో రీ రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. అలా గత నెల అక్టోబర్ 31న బాహుబలి ది ఎపిక్ విడుదలైంది. అయితే ఈ సినిమా రీ రిలీజ్ లో రూ. 100 కోట్ల కలెక్షన్స్ సాధించడమే టార్గెట్ గా పెట్టుకొని థియేటర్లలోకి వచ్చింది. బాహుబలి ది ఎపిక్ మూవీకి వచ్చిన అడ్వాన్స్ బుకింగ్ లు చూసి కచ్చితంగా రూ.100 కోట్లు కొట్టడం గ్యారంటీ అని అనుకున్నారు. కానీ ఎక్కడో దెబ్బ కొట్టింది. 100 కోట్ల టార్గెట్ ఏమో కానీ ఇప్పటివరకు రిలీజ్ అయిన సినిమాల్లో హైయ్యెస్ట్ కలెక్షన్స్ అయితే సాధించింది. బాహుబలి ది ఎపిక్ అక్షరాల 50 కోట్లు వచ్చినట్టు సినీ వర్గాలు వెల్లడించాయి.

ఇప్పటివరకు వచ్చిన కలెక్షన్స్ ఎంతంటే?

అలా బాహుబలి మూవీ విడుదలైన ఆరు రోజుల్లో దాదాపు 53 కోట్ల గ్రాస్ వచ్చినట్టు సినీ వర్గాలు పేర్కొన్నాయి.ఇక ఇందులో రెండు తెలుగు రాష్ట్రాల్లో 20 కోట్లకు పైగా వసూళ్లు వస్తే విదేశాలలో 12 కోట్లకు పైగా వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది.అలాగే ఒక్క కర్నాటక లోనే ఈ సినిమాకి 5 కోట్లు వచ్చాయట. హిందీ,తమిళంలో కూడా భారీగానే కలెక్షన్స్ వచ్చినట్టు తెలుస్తోంది. అలా మొత్తంగా బాహుబలి ది ఎపిక్ కి 60 కోట్లు లేదా 60 కోట్లు దాటవచ్చు అని సినీ ఇండస్ట్రీ వాళ్ళు అంచనాలు వేస్తున్నారు. అలా 100 కోట్ల టార్గెట్ తో రీ రిలీజ్ చేసిన బాహుబలి ది ఎపిక్ 60 కోట్లతో సరిపెట్టుకుంటుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి.


ALSO READ:#NTR Neel: తారక్ పై నీల్ స్పెషల్ ఫోకస్.. మరీ ఇలా అయితే ఎలా గురూ!

సరైన ప్రమోషన్స్ జరగలేదా?

అయితే బాహుబలి ది ఎపిక్ మూవీ కి ఇతర రాష్ట్రాల్లో కూడా సరైన ప్రమోషన్స్ చేసి ఉంటే కచ్చితంగా మరిన్ని కలెక్షన్స్ పెరిగేవి అని,చిత్ర యూనిట్ సినిమా రీ రిలీజ్ ని అంతగా పట్టించుకోలేదని, ఎవరి షూటింగ్స్ లో వాళ్లు బిజీ బిజీగా ఉండడం వల్ల సినిమా కలెక్షన్స్ కి కాస్త మైనస్ అయ్యిందని మాట్లాడుకుంటున్నారు. ఒకవేళ బాహుబలి ది ఎపిక్ మూవీకి ప్రమోషన్స్ గట్టిగా చేసి ఉంటే మాత్రం కచ్చితంగా 100 కోట్లు కలెక్ట్ చేసి రీ రిలీజ్ మూవీస్ లో అతిపెద్ద మూవీ గా బాహుబలి ది ఎపిక్ కి పేరు వచ్చేదని అంటున్నారు.ఏది ఏమైనప్పటికీ ఇప్పటివరకు రీ రిలీజ్ అయిన సినిమాల్లో హైయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా ఈ మూవీ టాప్ లో ఉంది.

Related News

Shilpa Shetty -Raj Kundra: రూ. 60 కోట్ల మోసం కేసులో బిగ్ ట్విస్ట్… చిక్కుల్లో శిల్పా శెట్టి దంపతులు!

Anasuya Bharadwaj: తమిళ సినిమాలో అనసూయ ఐటెం సాంగ్‌ రిలీజ్‌.. ప్రభుదేవతో రొమాన్స్‌!

The Girlfriend Movie: ‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’ మూవీపై బేబీ నిర్మాత ఎస్‌కేఎన్‌ రివ్యూ.. ఏమన్నారంటే

Sandeep Reddy Vanga : నిర్మాతగా మారిన సందీప్ రెడ్డి వంగ, ప్రభాస్ హీరోగా కొత్త దర్శకుడు పరిచయం

#NTR Neel: తారక్ పై నీల్ స్పెషల్ ఫోకస్.. మరీ ఇలా అయితే ఎలా గురూ!

Actor Death: హీరో యష్ ఛాఛా మృతి.. దుఃఖంలో ఇండస్ట్రీ!

SSMB 29 : మూడు నిమిషాల పాటు వీడియో రెడీ, కథను కూడా చెప్పేస్తారా?

Big Stories

×