Marriages : మేనరికాలు మన హిందూ మతంలో మంచి వ్యవస్థ అన్న చాలా మందిలో ఉంది. కుటుంబాలకు, మేనరికాలకు , భారత ఆర్ధిక వ్యవస్థకు గొప్ప సంబంధాలున్నాయి. ఒక కుటుంబంలో మేనత్త కూతురో, మేనత్త కొడుకుతోనే వరుసలు కలిపి పెళ్లిళ్లు చేసేవారు. గతంలో 10, 12 ఏళ్లకే ఇలాంటి పెళ్లిళ్లు జరిగేవి. అప్పుడున్న స్థితిగతులను బట్టి అలా చేసేవారు.
హిందూ సంప్రదాయంలో అమ్మాయైనా, అబ్బాయైనా తల్లిదండ్రులు భారంగా కాదు బాధ్యతగా భావిస్తుంటారు. ఒక కుటుంబంలో అమ్మాయిని మేనరికం ఇచ్చేటప్పుడు అమ్మాయితోపాటు స్త్రీ ధనం కూడా ఇచ్చేవారు. తర్వాత కాలంలో ఇది కట్నాలుగా మరో రూపంలోకి మారిపోయాయి.
అప్పట్లోదేశంలో మేనరికాల పేరుతో అమ్మాయి, అబ్బాయిని ఒక కుటుంబం నుంచి కుటుంబంలోకి ఇచ్చి ధనాన్ని కూడా ఇచ్చేవారు. దీని వల్ల ధనమంతా ఆ కుటుంబంలోనే ఉండేది . బయటకి పోయేది కాదు. అమ్మాయిని ఇస్తున్నారంటే డబ్బు, బంగారం, పొలం ఇవన్నీ ఇచ్చేవారు. కానీ వాటిని ఎవరూ ముట్టుకునే వారు కాదు. స్త్రీధనంగానే చూసేవారు.
తరాలు మారుతున్నా కూడా ఆయా కుటుంబాల మధ్యే ధనమంతా తిరిగేది. బయటకిపోయేది కాదు. ఒక తరంలో వాళ్లిస్తే..మరో తరంలో వీళ్లు ఇచ్చేవారు. వీరి మధ్యలోనే పిల్లలు ఉండేవాళ్లు. ధనం కూడా ఉండేది. అట్లా ప్రతీ కుటుంబం ఆర్ధిక స్థోమతను కలిగి ఉండేవి. అందుకే ఆ కాలంలో దొంగతనాలు కూడా చాలా తక్కువ. ఇదంతా బ్రిటీష్ వాళ్లు మనదేశంలోకి రాక ముందు.
ఇలా మేనరికాల వల్ల దేశంలో ఏ వ్యాపారం చేసినా సంపద అంతా మనదేశాన్ని దాటి పోలేదు. మూడు వైపుల సముద్రం కూడా ఉండటం వల్ల వ్యాపారమంతా ఇక్కడే జరిగేది. పంట పండిచినోడు, అది కొన్న వాడు ఇదే దేశానికి చెందిన వారే చేసే వారు. అలా సంపాదన అంతా రెట్టింపైంది. అందుకే మనదేశం ధనికదేశంగా ఉండేది. మేనరికాలు కూడా కుటుంబాల మధ్య సాగడం వల్ల ఆ కుటుంబాలు సంపన్న కుటుంబాలుగా మారిపోయాయి. ఈ సంపదను కొల్లగొట్టలంటే ఈ వ్యవస్ధను మార్చేయాలన్న లక్ష్యంతో మేనరికాలను లక్ష్యంగా చేసుకుని ప్రచారం మొదలుపెట్టారు. మేనరికాలు చేసుకుంటే అవలక్షణంగా పిల్లలు పుడతారని సమాజంలోకి వెళ్లేలా చేశారు.
దీని వల్ల క్రమంగా మేనరికాలు పోయాయి. దేశంలోని సంపద తరలిపోవడం జరిగిపోయింది. మేనరికం కాకపోయినా వేరే వాళ్లను చేసుకున్నా అవలక్షణాలతో పుట్టిన పిల్లలు ఉన్నారు. బలమైన మేనరిక వ్యవస్థను కుట్రతోనే వాళ్లు నాశనం చేశారు. దేశ సంపద కొల్లగొట్టడానికి ఇతర దేశస్థులు చేసిన అనేక కుట్రల్లో ఇది కూడా ఒకటి.