Big Stories

New Clothes : కొత్త బట్టలకు పసుపు ఎందుకు పెడతారో తెలుసా!

New Clothes : ఈ ఆచారాన్ని మన పూర్వీకులు మన ఆరోగ్యం కోసం పెట్టారు. చర్మరోగాల నుంచి క్యాన్సర్‌ వరకూ పసుపు ఎన్నో రోగాలకు ఔషధమని ఎన్నో పరిశోధనల్లో స్పష్టమైంది. ఇలాంటి పసుపుని భారతీయులు తమ జీవితంలోనే ఒక భాగంగా మార్చేసుకున్నారు. నేటి రోజుల్లో కొత్త బట్టలకు పసుపు పెట్టుకునే వాళ్లు తగ్గిపోయారు . అంత అవసరమేంటని అడిగి ఆ పద్ధతిని వ్యతిరేకించ వాళ్లకి లెక్కేలేదు. కానీ కొత్త బట్టల్నీ ఉత్తకుండా వేసుకుంటాం.

- Advertisement -

సాధారణంగా బట్టల తయారీలో రసాయనాలను వాడుతున్నారు. అలాగే పూర్వకాలంలోను గంజి, అద్దకాలతో బట్టలను తయారు చేసేవారు. బట్టలను నేసే ముందు నూలుకు పిండితో తయారైన గంజి పెడతారు. రసాయనాలు, గంజి లాంటి పదార్ధాలైనా నిలువ ఉన్నప్పుడు క్రిములకు ఏర్పడటానికి అవకాశం ఇచ్చినట్టే. కొత్త బట్టలకు పసుపు రాయడం వల్ల సూక్ష్మక్రిములను కొంత వరకైనా నాశనం చేసే అవకాశం ఉంటుంది.. అలాంటి బట్టలను ధరిస్తే చర్మవ్యాధులు వచ్చే అవకాశం ఉంది.

- Advertisement -

చెప్పాలంటే కొత్త బట్టలు ధరించడం ఒక యోగం. చేతిలో డబ్బులు ఆడుతున్నాయి కాబట్టి ఈ మధ్య ఎప్పుడు కావాలంటే అప్పుడు బట్టలు వేసుకోగలుగుతున్నాం.గతంలో పండుగలు, పెళ్లిళ్లు, పుట్టిన రోజు వంటి సందర్భాల్లో మాత్రమే బట్టలు కొనుగోలు చేసేవారు. పసుపును శుభప్రదమైన భావించే సంప్రదాయం ఉంది. కొత్త బట్టలకు పసుపు రాయడం వల్ల గంజి వాసన తగ్గుతుంది.

కొత్త బట్టలకు పసుపు రాయడం అనేది ఇంట్లోని ఆడవారి చేతుల మీదుగా జరుగుతుంది. అలా వారి ఆశీర్వచనం, ప్రేమ కూడా అందించినట్లు అవుతుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News