BigTV English

Vinayaka Temple: రోజుకి వెయ్యి బిందెల నీటితో దేవుడికి స్నానం చేయించే ఆలయం ఇదొక్కటే

Vinayaka Temple: రోజుకి వెయ్యి బిందెల నీటితో దేవుడికి స్నానం చేయించే ఆలయం ఇదొక్కటే

Vinayaka Temple: ఆది దేవుడు వినాయకుడికి ఎన్నో ఆలయాలు ఉన్నాయి . అరుదైన చరిత్ర ఉన్న ఆలయాల్లో ముఖ్యమైంది గుడ్డట్టు మహాగణపతి టెంపుల్. ఏనుకు ఆకారంలో వెలిసిన కొండ మధ్య స్వామి స్వయంభుగా వెలిశాడు. ఇక్కడ బొజ్జ గణపయ్య నీటిలోనే దర్శనమిస్తుంటాడు. ప్రతీ రోజు వెయ్యి బిందెల నీటితోనే స్నానం చేయించడం ఈ ఆలయం ప్రత్యేకతల్లో ఒకటి.


ఈ గుడికి 1700 ఏళ్ల చరిత్ర ఉంది. మన దేశంలో నీటిలో ఉన్న ఒక్కే ఒక్క గణపతి ఆలయం ఇది మాత్రమేనని చెప్పచ్చు. నిద్రిస్తున్న ఏనుగు మాదిరిగా కనిపించే గుహ మధ్యలో స్వామి వారు ఉద్భవించారు. మూడు అడుగుల ఎత్తున నల్లరాతి విగ్రహంలో స్వామి దర్శనం జరుగుతుంది. నీటిలో ఉండే విగ్రహానికి పూజలు చేస్తూనే మరో విగ్రహం ఉంచి ఆలయాన్ని నిర్మించారు. చల్లని నీళ్లతో వినాయకుడ్ని పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని శివుడు వరమిచ్చాడు. అందుకే నిత్యం ఈ గుడిలో స్వామికి నీళ్లతోనే అభిషేకాలు చేస్తుంటారు.

స్వామికి అభిషేకం చేసిన నీటిని పన్నీర్, ప్రసాదం చేయడానికి ఉపయోగిస్తారు. ఉడిపికి దగ్గర్లో ఉండే ఈ ఆలయంలో స్వామికి ఎప్పుడంటే అప్పుడు సేవ చేయలేరు. అభిషేక సేవ కోసం మీరు పేరు ఇస్తే ఆరేళ్ల తర్వాత మీకు అవకాశం రావచ్చు. అప్పటి వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. గుడట్ట గణపతికి చాలా మహమాన్విత దేవుడి ఇక్కడ భక్తుల్ని విశ్వసిస్తుంటారు. కోరికన కోరికలు తీరుస్తాడని నమ్ముతుంటారు.


శివుని శక్తులు ఇక్కడ ఉన్నాయన్న నమ్మకంతో గణపతికి కూడా రుద్రాభిషేకాలు నిర్వహించడం ఆలయం ప్రత్యేకతలో ఒకటని చెప్పాలి. అభిషేక చూసేందుకు ఉదయం పదకొండున్నర సమయంలో మాత్రమే మొదటిసారి వచ్చే భక్తులకి అనుమతి ఇస్తారు. త్రిపురసురుడు అనే రాక్షసుడ్ని చంపే క్రమంలో శివుడు విసిరిన త్రిశూలం నుంచి తప్పించుకోవడానికి చేసిన ప్రయత్నంలో గణేశుడు తేనెతో ఉన్న కొలనులో పడ్డాడని పురాణాలు చెబుతున్నాయి. జీవితంలో ఒక్కసారైనా ఈ గుడిలో పూజ చేస్తే మంచిదని పెద్దలు చెబుతున్నారు.

Related News

Chanakya Niti: చాణక్య నీతి: కుటుంబ పెద్ద ఆ ఒక్క పని చేస్తే చాలు – ఆ ఇల్లు బంగారంతో నిండిపోతుందట

Vastu Tips: వాస్తు ప్రకారం.. ఇంట్లో డబ్బు ఎక్కడ దాచాలి ?

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Big Stories

×