McDonalds: టమాటా బంద్.. మెక్‌డొనాల్డ్స్ పొదుపు చర్యలు..

McDonalds: టమాటా బంద్.. మెక్‌డొనాల్డ్స్‌కు ధరల సెగ..

mcdonalds tomoto
Share this post with your friends

mcdonalds tomoto

McDonalds: టమాటా ధరల ప్రభావం సామాన్యులతో పాటు పెద్దపెద్ద సంస్థలపై కూడా పడుతుంది. సెంచరీ దాటిన టమాటా ధర కొన్నిచోట్ల రూ.200 పైకి చేరుకుంది. ఈ ప్రభావం ఫాస్ట్ ఫుడ్, చైన్ మెక్ డొనాల్డ్స్ పైనా పడింది. దాంతో బర్గర్లలో టమాటాను దూరం పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో మెక్‌డొనాల్డ్స్ తమ రెస్టారెంట్‌లలోని ఆహార ఉత్పత్తుల్లో టమాటాల వాడకాన్ని నిలిపివేస్తున్నట్లు రెస్టారెంట్ వెలుపల అతికించిన నోటీసులో తెలిపింది. మార్కెట్లో నాణ్యమైన టమాటాలు అందుబాటులో లేని కారణంగా బర్గర్లను టమాటా లేకుండానే తినాల్సి ఉంటుందని ముందుగానే నోటిస్ ద్వారా వెల్లడించింది. ఇందుకు సంబంధించిన ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

మెక్‌డొనాల్డ్స్ ప్రకటనను సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్ ఆదిత్య షా ట్విట్టర్ లో తొలుత షేర్ చేశారు. మెక్ డొనాల్డ్ ఢిల్లీ విభాగం ఈ నోటీసును ఉంచిందని, చివరకు మెక్ డొనాల్డ్స్ కూడా టమాటాలను కొనుగోలు చేయలేకపోతోందని ఆదిత్యషా సరదాగా కామెంట్ చేశారు.అత్యుత్తమ పదార్థాలతో ఉత్తమమైన ఆహారాన్ని అందించేందుకు ఎల్లప్పుడూ తాము కట్టుబడి ఉన్నామని, తాము ప్రయత్నించినప్పటికీ, మంచి టమాటాలను తగిన పరిమాణంలో పొందలేకపోతున్నామని మెక్‌డొనాల్డ్స్ నోటీసులో వివరించింది.

టమాటాలు పండే ప్రాంతాల్లో భారీ వర్షాలు, జూన్‌లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతల కారణంగా పంట ఉత్పత్తి తగ్గింది. దీంతో ధరలు భారీగా పెరిగాయి. మరో కొన్ని రోజుల పాటు ధరలు ఈ విధంగా కొనసాగుతాయని మార్కెట్ అధికారులు అంటున్నారు.


Share this post with your friends

ఇవి కూడా చదవండి

High Tension in Chandur : చండూరులో డిష్యూం డిష్యూం.. పోలీసుల లాఠీఛార్జ్..

BigTv Desk

Javeria-Sameer Love Story: దేశాలు దాటిన ప్రేమ.. విలన్ గా మారిన కోవిడ్.. చివరికిలా..

Bigtv Digital

Korean Scientists:బ్రిడ్జిల ధృడత్వాన్ని గమనిస్తూ ఉండే టెక్నాలజీ..

Bigtv Digital

Gold Price: కస్టమర్లకు గుడ్ న్యూస్.. గోల్డ్ రేట్ డౌన్..?

Bigtv Digital

BRS: బీఆర్ఎస్ లోనూ తిరుగుబాట్లు.. కాంగ్రెస్ కల్చర్ తో కేసీఆర్ కు బిగ్ షాక్..

BigTv Desk

ED Raids : ఏపీలో పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఈడీ దాడులు.. ఎందుకంటే?

BigTv Desk

Leave a Comment