Youtuber Nandana: ప్రముఖ యూట్యూబర్ నందు అలియాస్ నందూస్ వరల్డ్ కపుల్స్ నందన, మధుకర్ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. యూకే లో నివసిస్తున్న ఈ దంపతులు విదేశాలలో ఉద్యోగాలు ,వీసా స్పాన్సర్షిప్ ల పేరిటం పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడ్డారు. లక్షల రూపాయలు వీరి చేతిలో పెట్టి మోసపోయిన బాధితులు వీరిపై ఆరోపణలు చేస్తూ పోలీసు కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారం కారణంగా నందన (Nandana)మధుకర్ (Madhukar) గత కొంతకాలంగా అజ్ఞాతంలో ఉన్నారు. అయితే ఇటీవల ఉన్న ఫలంగా నందన ఇండియా రావడంతో ఆమెపై లుక్ అవుట్ నోటీసులు ఉన్న నేపథ్యంలో పోలీసులు అరెస్టు చేశారు.
పోలీసులు నందనను అరెస్టు చేయడమే కాకుండా నేడు ఈమెను ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కు విచారణకు తీసుకువచ్చారు. సుమారు నాలుగు గంటల పాటు విచారణ అనంతరం నందన తిరిగి వెళ్ళిపోయారు. అయితే ఈమె మీడియాతో మాట్లాడటానికి మాత్రం ఇష్టపడలేదని తెలుస్తోంది. పోలీస్ విచారణలో భాగంగా నందన వీసా స్కాన్ (Visa Scam)కి సంబంధించి కొన్ని కీలక విషయాలను తెలిపినట్టు సమాచారం. పోలీస్ విచారణలో భాగంగా వీసా స్కాంపై తనకు ఎలాంటి విషయాలు తెలియదని నందన తెలిపినట్టు తెలుస్తోంది.
ఈ వ్యవహారం మొత్తం తన భర్త మధుకర్ చూసుకుంటారని నందన తన భర్తను ఈ వ్యవహారంలో పూర్తిగా ఇరికించిందని చెప్పాలి. ఇక పోలీసులు ఈ స్కాం గురించి వివిధ రకాల ప్రశ్నలు వేసినప్పటికీ ఆమె మాత్రం సరైన సమాధానం చెప్పకుండా ఆ ప్రశ్నలను దాటవేసినట్లు సమాచారం. ఈ కుంభకోణంలో భాగంగా ఆమె నుంచి సమాధానాలు రాబట్టడం కోసం పోలీసులు ప్రయత్నాలు చేసినప్పటికీ నందన మాత్రం ఎలాంటి కీలక సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ కేసు విచారణలో భాగంగా ఈ నెల 16వ తేదీ హాజరుకావాలని నందనకు నోటీసులు ఇచ్చినట్లు ఇబ్రహీంపట్నం సీఐ సుబ్రహ్మణ్యం తెలిపారు. ఇక ఈ వ్యవహారంలో తన భర్త మధుకర్ పేరును ఉపయోగించడంతో త్వరలోనే మధుకర్ ను కూడా ఈ విచారణకు పిలిపిస్తామని సీఐ తెలియజేశారు.
నందన మధుకర్ “డెస్టినీ కన్సల్టెన్సీ” అని పేరుతో ప్రవేట్ సంస్థలను నడుపుతూ లండన్ లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగుల నుంచి ఒక్కొక్కరి వద్ద సుమారు 20 లక్షల వరకు వసూలు చేసినట్టు బాధితులు ఆరోపణలు చేస్తూ వీరిపై ఫిర్యాదులు చేశారు. మరి ఇలాంటి మోసపూరిత వాగ్దానాల ద్వారా ఈ దంపతులు ఎంత మొత్తంలో డబ్బును సంపాదించారు? ఈ స్కాం వెనుక ఎంత మంది బాధితులు ఉన్నారు? ఈ స్కాం వెనుక గల ఆరోపణలు ఏంటి? ఈ స్కాం వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారనే పూర్తి వివరాలను త్వరలోనే తెలుసుకుంటామని సీ ఐ సుబ్రహ్మణ్యం తెలిపారు. మరి తదుపరి విచారణలో భాగంగా ఈ స్కామ్ గురించి నందన మధుకర్ నిజాలను ఒప్పుకుంటారా లేదా అనేది తెలియాల్సి ఉంది.
Also Read: త్రిషకు అండగా కంగనా.. ఉదయ్ నిధి స్టాలిన్ కు గట్టి కౌంటర్!