E-Paper
Advertisement

పాకిస్తాన్ ప్లేయ‌ర్ కు బూట్లు అమ్ముకుంటోన్న విరాట్ కోహ్లీ?

పాకిస్తాన్ ప్లేయ‌ర్ కు బూట్లు అమ్ముకుంటోన్న విరాట్ కోహ్లీ?
Advertisement

Nashra Sandhu wearing Virat Kohli brand One 8 shoes:  టీమిండియా స్టార్ క్రికెట‌ర్ విరాట్ కోహ్లీ (Virat Kohli ) వివాదంలో చిక్కుకున్నారు. క్రికెట్ తో పాటు వ్యాపార రంగాల్లో దూసుకు వెళ్తున్న విరాట్ కోహ్లీ.. ఇటీవల One 8 పేరుతో షూ బ్రాండ్ లాంచ్ చేశారు. అయితే విరాట్ కోహ్లీకి సంబంధించిన బ్రాండ్ కావడంతో ఈ బూట్లను కొనుగోలు చేసేందుకు జనాలు ఆసక్తి చూపిస్తున్నారు. దేశ విదేశాల్లో ఈ బూట్ల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే పాకిస్తాన్ ప్లేయర్ నష్రా సంధు ( Nashra Sandhu ) కూడా విరాట్ కోహ్లీకి సంబంధించిన షూ ధరించారు. ఈ సంఘటనకు సంబంధించిన ఫోటోలు తాజాగా బయటకు వచ్చాయి. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ పై సోషల్ మీడియాలో మళ్లీ జనాలు ట్రోలింగ్ చేస్తున్నారు. పగోడికి కూడా బూట్లు ఇస్తున్నావా? ఫ్రీగా ఇచ్చావా? లేదా పాకిస్తాన్ లో కూడా కంపెనీ ఓపెన్ చేసావా ? అంటూ నిలదీస్తున్నారు.

పాకిస్తాన్ ప్లేయ‌ర్ కు బూట్లు అమ్ముకుంటోన్న విరాట్ కోహ్లీ?

ఉమెన్స్ ఆసియా కప్ 2026 టోర్నమెంట్ (Women’s Asia Cup 2026 Tournament) చాలా ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఈ టోర్నమెంట్ లో భాగంగా ఇప్పటికే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ (India vs. Pakistan) మ్యాచ్ జరిగింది. ఇందులో టీమిండియా గెలువగా.. నిన్న హాంకాంగ్ తో పాకిస్తాన్ తలబడింది. ఇందులో పాకిస్తాన్ ప్లేయర్ నష్రా సంధు ( Nashra Sandhu ) అద్భుతంగా రాణించి పాకిస్తాన్ జట్టును గెలిపించారు. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీకి సంబంధించిన One 8 బూట్లు ఆమె ధరించి కనిపించారు. ఇక్కడే వివాదం రాజుకుంది.

Advertisement

Tanveer Ahmed On IND VS PAK: అదరగొట్టిన ఇండియా, పాకిస్తాన్ మరో ఘోర ఓటమి…ఫిక్సింగ్ చేశారంటూ త‌న్వీర్ ఆరోప‌ణ‌లు

ఆమెకు ఫ్రీగానే విరాట్ కోహ్లీ షోలు ఇస్తున్నాడని చర్చ మొదలైంది. దీంతో విరాట్ కోహ్లీ దేశ ద్రోహి అంటూ మళ్ళీ సోషల్ మీడియాలో ఓ నినాదాన్ని ఎత్తుకున్నారు నెటిజన్స్. అయితే విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ మాత్రం ట్రోలర్స్ కు కౌంటర్ ఇస్తున్నారు. విరాట్ కోహ్లీ అంతర్జాతీయ మార్కెట్లో తన షూ విక్రయించుకుంటున్నాడు.. వాటిని ఇండియావాడు ఒక్కడే కాదు.. ప్రపంచంలోని నలుమూలల ఉన్న జనాలు కొనుగోలు చేసుకోవచ్చని పేర్కొంటున్నారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ క్రికెటర్లు కూడా కొనుగోలు చేసి ఉంటారని చురకలు అంటిస్తున్నారు. ఇందులో విరాట్ కోహ్లీ చేసిన తప్పేంటి అని ప్రశ్నిస్తున్నారు. కావాలని విరాట్ కోహ్లీని విలన్ చేసేందుకుగాను కొంతమంది కుట్రలు చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు.

కోహ్లీ షూలు ధ‌రించి అద‌రగొట్టిన పాక్ ప్లేయ‌ర్‌

Advertisement

హాంకాంగ్ తో సోమ‌వారం జ‌రిగిన మ్యాచ్ లో నష్రా సంధు ( Nashra Sandhu ) అద్భుతంగా రాణించి పాకిస్తాన్ జట్టును గెలిపించారు. ఈ సంద‌ర్భంగా ఆమె కోహ్లీ షూలు ధ‌రించారు. ఈ నేప‌థ్యంలో 6 వికెట్లు ప‌డ‌గొట్టి… మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నారు. అంతేకాదు, పాకిస్తాన్ ను సెమీస్ కు తీసుకెళ్లారు నష్రా సంధు.

PCB confiscate mobile phones of Pakistan cricketers : పాకిస్తాన్ జ‌ట్టులో పెను ప్ర‌కంప‌న‌లు…ప్లేయ‌ర్ల మొబైల్ ఫోన్లను లాగేసుకున్న PCB

Related News

టీమిండియాకు ప్లాట్ పిచ్ లు..పాకిస్తాన్ కు క‌ఠిన‌మైన పిచ్ లా ? ఇంగ్లండ్ పై ఫైర్‌

షోయ‌బ్ అక్త‌ర్ ను ధోని స్లెడ్జింగ్ చేసి, పాకిస్తాన్ కొంప‌ముంచాడు

మొహ్సిన్ న‌ఖ్వీ నోట్లో మ‌ట్టి కొట్టిన బీసీసీఐ…ఆసియా క‌ప్ ఫైన‌ల్స్ కు జై షా !

2017లో విరాట్ కోహ్లీని చూసి ప్యాంట్ త‌డుపుకున్నా..అమీర్ సంచ‌ల‌నం !

ఒరేయ్ వాహాబ్ రియాజ్…మాకు ఆసియా క‌ప్ వ‌ద్దు రా, ద‌మ్ముంటే టీమిండియాను ఓడించండి

నేను రాజ‌కీయాల్లోకి వ‌స్తే, ఇమ్రాన్ ఖాన్ లాగా కుక్క చావు చ‌చ్చేవాడిని

పాకిస్తాన్ ప‌త‌నానికి ఆకిబ్ జావేదే కార‌ణం..ఆ 7 గురు క్రికెట‌ర్ల జీవితాల‌తో ఆడుకుంటున్నాడు

Big Stories

Advertisement
×