Kangana -Trisha: ఇటీవల కాలంలో సినిమాల విషయాలలోకి రాజకీయ అంశాలను లాగడం రాజకీయాలలో సినీ సెలెబ్రెటీలను టార్గెట్ చేస్తూ విమర్శించడం పరిపాటిగా వస్తుంది. ఇటీవల తమిళ నాడు రాష్ట్ర రాజకీయాలలో భాగంగా ప్రముఖ నటి త్రిష(Trisha)ను సంబోధిస్తూ సినీ నటుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి ఉదయినిది స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ వ్యాఖ్యలపై తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్(Vijay) కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై సినీనటి, ఎంపీ కంగనా రౌనత్ మాట్లాడారు.
తాజాగా మీడియా సమావేశంలో పాల్గొన్న ఈమె ఈ విషయం గురించి ప్రస్తావిస్తూ.. తమిళనాడులో ఏం జరిగిందో అందరికీ తెలుసు రెండు రాజకీయ పార్టీల వివాదంలోకి ఒక గౌరవప్రదమైన నటిని తీసుకొచ్చి తనపై నిందలు వేశారు. అసెంబ్లీ సాక్షిగా ఆమె వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడారు. వేధింపులు వ్యక్తిగత విషయాలకు సంబంధించిన ఘటనలలో ఎల్లప్పుడూ మహిళలనే లక్ష్యంగా చేసుకొని ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని కంగనా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ధోరణి కేవలం ఇండియాలో మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా జరుగుతుందని తెలిపారు.
ఒక మహిళ గౌరవప్రదంగా ఉద్యోగం చేసుకుంటున్న, జీవితంలో విజయం సాధించినా, నాయకురాలిగా అధికారంలో ఉన్న ఆమె వ్యక్తిత్వం పై దాడి చేసి తన వ్యక్తిత్వాన్ని దిగజార్చాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారని , మహిళల పట్ల జరుగుతున్న ఈ దాడులు ఎప్పటికీ ఆగుతాయో అంటూ ఈమె మహిళలను కించపరిచే అంశం గురించి మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇలా నిండు సభలో త్రిష గురించి ఆమె వ్యక్తిత్వం గురించి మాట్లాడిన విధానం తమిళనాడు సినీ రాజకీయాలలో పెద్ద ఎత్తున చర్చలకు కారణమైంది. ఈ నేపథ్యంలోనే కంగనా కూడా తనదైన శైలిలోనే స్పందిస్తూ త్రిషకు అండగా నిలిచారు.
ఇకపోతే త్రిష గురించి ఉదయనిది స్టాలిన్ చేసిన ఈ వ్యాఖ్యల పట్ల తమిళనాడు ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా సీఎం విజయ్ ఈ అంశం గురించి అసెంబ్లీలో మాట్లాడుతూ మహిళల పట్ల అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తే చట్టం చూస్తూ ఊరుకోదు అంటూ హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఇకపోతే ఉదయనిది స్టాలిన్ త్రిష గురించి ఇలా అసెంబ్లీలో మాట్లాడటం వెనుక కారణం లేకపోలేదు. గత కొంతకాలంగా త్రిష విజయ్ వ్యక్తిగత జీవితం గురించి ఎన్నో రకాల వార్తలు వస్తున్న సంగతే తెలిసిందే. వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇదే అదునుగా భావించిన ప్రతిపక్ష పార్టీ త్రిషను ఉద్దేశించి అసెంబ్లీలో అభ్యంతరకరంగా మాట్లాడటం గమనార్హం.
Also Read: మరో మల్టీప్లెక్స్ ప్లానింగ్ లో రౌడీ హీరో..విస్తరిస్తున్న సినీ సామ్రాజ్యం!