మోదీ,కేసీఆర్,కేటీఆర్‌లకు భయపడనంటూ మైనంపల్లి మాట్లాడిన ఆడియో కలకలం రేపింది. అందులో మైనంపల్లి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. తాను తలచుకుంటే ఎవరినైనా మర్డర్ చేయగలనని.. టీడీపీలో ఉన్నప్పుడు నేను ఒక్కడినే సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్ధతిచ్చానని గుర్తుచేశారు. మహేందర్ రెడ్డి, రేవంత్‌రెడ్డిలకు కూడా అప్పట్లో వార్నింగ్ ఇచ్చానన్న మైనంపల్లి.. బాల్క సుమన్‌ను హైదరాబాద్‌లో తిరగలేవని చెప్పా అంటూ తీవ్ర పదజాలంతో మైనంపల్లి మాట్లాడారు.