Mother Dairy Election: ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ లో మదర్ డైరీ ఎన్నిక చిచ్చుపెట్టింది. అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మధ్య ఆరోపణలు అలజడి రేపుతున్నాయి. ప్రభుత్వ వెబ్ ఆలేరు ఎమ్మెల్యే బీరుల ఐలయ్య పై తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేయల్ సంచలన ఆరోపణలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. అసలు జిల్లా కాంగ్రెస్ పార్టీలో మదర్ డైరీ ఎన్నికలు ఎందుకు అంత కాకరేపుతున్నాయి? వారి అంతర్యుద్ధమే డైరెక్టర్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు రెండు సీట్లు కట్టుబెట్టిందా?
బీఆర్ఎస్‌కు చెందిన లక్ష్మీనరసింహారెడ్డికి ఐలయ్య మద్దతు
మదర్ డైరీ ఎన్నికలు ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీలో చిచ్చురేపాయి.. ఈ విషయంలోనే తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వే బేర్ల ఐలయ్యపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ అభ్యర్థి రచ్చ లక్ష్మీ నరసింహ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ మద్దతి ఇస్తుందని దీనికి బేర్ల ఐలయ్య యాదాద్రి జిల్లా పార్టీ అధ్యక్షుడు అండం సంజీవ రెడ్డి ప్రధాన కారకులని సామీలు ఫైర్ అయ్యారు. మదర్ డైరీలో మూడు డైరెక్టర్ స్థానాలకు గాను ఒకటి మహిళకు రిజర్వ్ కాగా ఎమ్మెల్యే వేముల వీర్యసం వర్గం నుంచి క్యాండిడేట్ జయశ్రీకి మరో స్థానం నుంచి సామేలు క్యాండిడేట్ ప్రవీణ్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని తీర్మానించారు.
మూడో స్థానం నుంచి మోత్కూరు మాజీ ఎంపీపీ భర్త లక్ష్మీనర్సింహారెడ్డి..
మూడో డైరెక్టర్ స్థానం మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ బలపరిచిన మోత్కూరు మాజీ ఎంపీపి భర్త రచ్చ లక్ష్మీ నరసింహా రెడ్డికి ఇవ్వాలని ఒప్పందం జరిగిందట. అయితే నరసింహా రెడ్డికి కాంగ్రెస్ మద్దతు ఇవ్వటాన్ని సామీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో లక్ష్మీ నరసింహా రెడ్డి మోత్కూరులో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా తనను ఓడగొట్టేందుకు పని చేశాడని సామీలు ఆరోపిస్తున్నారు. మోత్కూరులో రాజకీయంగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్కు అన్ని విధాలుగా సహకరించే వ్యక్తి కావడంతో సామీలు లక్ష్మీ నరసింహా రెడ్డికి సపోర్ట్ చేయటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారట.. అయితే నరసింహా రెడ్డి డిసిసి అధ్యక్షుడు అండం సంజీవరెడ్డి సమీప బంధువు కావడంతోని ఆయన బీఆర్ఎస్ అయినప్పటికీ బీర్ల ఐలయ్య సపోర్ట్ చేస్తున్నాడని సామీలు ఆరోపించారు. బీఆర్ఎస్ క్యాండిడేట్ కి సపోర్ట్ ఇస్తే బీర్ల ఐలయ్య రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
పీసీసీ చీఫ్‌కు ఎమ్మెల్యే సామేలు ఫిర్యాదు
రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తుంటే తన నియోజక వర్గంలో మాత్రం బతికిచ్చే ప్రయత్నం చేస్తున్నారని పీససి చీఫ్ కు ఎమ్మెల్యే సామేలు ఫిర్యాదు చేశారట. ఇప్పుడున్న పరిస్థితుల్లో పొత్తు లేకుండా కాంగ్రెస్ పార్టీ మూడు స్థానాలు గెలవచ్చని అలాంటిది తమ నియోజక వర్గంలో బిఆర్ఎస్ నేతకు మద్దతు ఇవ్వటం ఏంటనేది సామేల్ వాదన.. అయితే మందుల సామెల్ పై బీర్ల ఐలయ్య ఆగ్రహంతో ఉన్నారట డైరీ ఎన్నికలపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విషయాలు తెలుసుకొని మాట్లాడాలని సామెల్ పై మండిపడుతున్నారట అప్పులో ఉన్న డైరీని లాభాల బాటలోకి తెచ్చేందుకు ముందునుంచి పని చేస్తున్న తనపై సామెల్ విమర్శ లను చేయటాన్ని తప్పుపడుతున్నారట.
సామెల్ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని ధ్వజం
డైరీ విషయంపై ఇప్పటివరకు మందుల సామెల్ తనతో చర్చించలేదని ఇప్పుడు నోటికవచ్చినట్టు మాట్లాడటం సరికాదని ధ్వజమెత్తున్నారు. పార్టీలో జరిగే అంతర్గత విషయాలపై మీడియాకు ఎక్కటం కరెక్ట్ కాదని జిల్లా కాంగ్రెస్ పార్టీ కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుందట. ప్రభుత్వ విప్ ఐలయ్య పార్టీ అధ్యక్షుడు అండం సంజీవ రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు సామేలుకు షోకాస్ నోటీసులు ఇవ్వాలని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు జిల్లా పార్టీ నాయకత్వం ఫిర్యాదు చేసింది. ఎన్నికల ప్రక్రియలో అభ్యంతరాలు ఉంటే ఆ సంగతిని ఎమ్మెల్యే హోదాలు పార్టీ హై కమాండ్‌కు తెలియజేయాలి తప్ప మీడియా సమావేశంలో నోటికవచ్చినట్టు మాట్లాడటం సరైన విధానం కాదని ఎన్నికలకు ముందు చివరి నిమిషంలో పార్టీలో చేరి ఎమ్మెల్యే గా గెలిచిన సామేలుకు కాంగ్రెస్ సీనియర్ల పైన విమర్శలు చేసే అర్హత లేదని యాదాద్రి జిల్లా నాయకులు మండిపడుతున్నారట..
Also Read: ఫ్యూచర్ సిటీకి పునాదిరాయి.. సీఎం రేవంత్ చేతుల మీదుగా శంకుస్థాపన
జిల్లా కాంగ్రెస్‌కు మదర్ డెయిరీ ఎన్నికల తలనొప్పి
మొత్తం మీద మదర్ డైరీ డైరెక్టర్ల ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి కొత్త తలనొప్పి తెచ్చిపెట్టింది అది అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇలా తిట్టుకుంటుంటే ప్రతిపక్ష
పార్టీ ఇదే అదునుగా మార్చుకొని స్థానిక సంస్థల ఎన్నికల్లోను పట్టు సాధించాలని చూస్తుంది. అయితే మదర్ డైరీ డైరెక్టర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అంతర్గత విభేదాలతో ఎదురుదెబ్బ తప్పలేదు. మూడు డైరెక్టర్ పోస్టుల్లో రెండు స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపు సాధించారు. కాంగ్రెస్ నేతల మధ్య అంతర్గత పోరుతో రెండు స్థానాలు బీఆర్ఎస్ గెలుచుకుని అధికార పార్టీకి షాక్ ఇచ్చింది. సామెల్ వ్యతిరేకించిన నరసింహా రెడ్డి సైతం ఈ డైరెక్టర్ ఎన్నికల్లో విజయం సాధించారు.