Tripti dimri: సినిమా ఇండస్ట్రీలో రాణించే హీరో హీరోయిన్స్, క్యారెక్టర్ ఆర్టిస్టులు, దర్శకులు, మ్యూజిక్ డైరెక్టర్లు ఇలా ఎవరైనా సరే అందరికీ ఒకే ఒక్క సినిమాతో గుర్తింపు రాదు.కొంతమందికి ఒకే ఒక్క సినిమాతో వస్తే.. మరి కొంతమందికి 10 సినిమాలు చేస్తే గానీ రాదు. కొంతమంది అయితే గుర్తింపు రాక ఇండస్ట్రీని వదిలి వెళ్ళిపోతారు. అయితే ఓవర్ నైట్ లో నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్న నటీనటులలో చాలామంది ఉన్నారు. వారిలో ఇప్పుడు మనం చెప్పుకోబోయే బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ (Tripti dimri) కూడా ఒకరు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన యానిమల్ మూవీతో ఓవర్ నైట్ లో నేషనల్ క్రష్ ట్యాగ్ సంపాదించుకుంది. అప్పటివరకు ఇండస్ట్రీలో నేషనల్ క్రష్ అంటే అందరూ రష్మిక మందన్న(Rashmika Mandanna) నే పిలుచుకునేవారు.కానీ యానిమల్ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటించినప్పటికీ రష్మికని మించి వైరల్ అయింది త్రిప్తి డిమ్రీ. ఒక్క దెబ్బతో ఈ హీరోయిన్ ఓవర్ నైట్ లో నేషనల్ క్రష్ ట్యాగ్ సంపాదించింది.
అలా రష్మిక మందన్న మెయిన్ హీరోయిన్ అయినప్పటికీ ఓ చిన్న పాటతో అందరి హృదయాన్ని కొల్లగొట్టింది త్రిప్తి డిమ్రీ. అయితే అలాంటి ఈ హీరోయిన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆ డైరెక్టర్ వల్లే నా జీవితం ఇలా అయ్యిందని, దానంతటకీ కారణం ఆయనే అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. మరి ఇంతకీ త్రిప్తి డిమ్రీ జీవితాన్ని ఇలా మార్చేసిన ఆ డైరెక్టర్ ఎవరు అనేది చూద్దాం.
నా లైఫ్ 360° తిరుగుతోంది..
త్రిప్తి డిమ్రీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో..” నా లైఫ్ 360° తిరుగుతోంది. దానంతటికీ కారణం సందీప్ రెడ్డి వంగానే. ఆయన డైరెక్షన్లో వచ్చిన యానిమల్ మూవీలో నన్ను ఓ చిన్న పాత్ర కోసం తీసుకున్నప్పటికీ నా జీవితం మారిపోయింది. ఆ సినిమా నాకు కొత్త లైఫ్ ని ఇచ్చింది. నా జీవితాన్ని కొత్త మలుపు తిప్పింది. ఆయన ఇచ్చిన అవకాశం నాకు ఓ వరం లాంటిది. లైలా మజ్ను సినిమాతో నాకు స్టార్డం లభిస్తుంది అనుకున్నా. కానీ యానిమల్ మూవీతో నన్ను అదృష్టం వరించింది. యానిమల్ మూవీలోని జోయా పాత్ర మీ అందరిని ఇంతలా ఆకట్టుకుంటుందని నాకు తెలియదు. అలాగే ఈ చిన్న పాత్ర వల్ల నాకు ఒరిగిందేమీ ఉండదని అనుకున్నాను. ఈ సినిమాతో నేను ఫేమస్ అవ్వను అనుకున్నాను. కానీ ఈ చిన్న పాత్రనే నా కెరియర్ ని మలుపు తిప్పింది. ఈ సినిమా సమయంలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా నాపైనే పూర్తి నమ్మకం పెట్టుకున్నారు. ఈ సినిమా స్క్రిప్ట్ చెప్పిన టైం లోనే సందీప్ రెడ్డి వంగా నాకు హామీ ఇచ్చారు. ఈ పాత్ర అద్భుతంగా ఉంటుంది అని నిజంగానే ఆయన చెప్పినట్లే జరిగింది. అంతా ఆయన ఆశీర్వాదమే.
ALSO READ:Rishabh Shetty: ఏంటీ రిషబ్ శెట్టి అసలు పేరు ఇదా.. పేరు మార్పు వెనుక పెద్ద కథే వుందే!
ఆయనకు రుణపడి ఉంటా..
ఈ సినిమా విడుదలై నేను ఫేమస్ అయ్యాక చాలామంది సినీ ప్రేక్షకులు నేను గతంలో నటించిన సినిమాలను మళ్లీమళ్లీ వీక్షించారు. అలా లైలా మజ్ను, బల్బ్ బుల్, ఖాలా వంటి సినిమాలు చూసి హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇక యానిమల్ మూవీ తర్వాత మళ్లీ సందీప్ రెడ్డివంగా సార్ తో వర్క్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది”. అంటూ తెలిపింది.
మళ్లీ సందీప్ డైరెక్షన్లో మూవీ..
మళ్లీ మళ్లీ ఆయనతో కలిసి వర్క్ చేయడం ఎక్జైటింగ్ గా అనిపిస్తుంది. త్వరలోనే స్పిరిట్ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకొని మీ ముందుకు రాబోతున్నాను అంటూ త్రిప్తి డిమ్రీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇక త్రిప్తి డిమ్రీకి యానిమల్ మూవీ తర్వాత సందీప్ రెడ్డి వంగా.. ప్రభాస్ హీరోగా చేస్తున్న స్పిరిట్ మూవీలో మరోసారి హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చారు. మొదట హీరోయిన్ ఛాన్స్ దీపికా పదుకొనేకి వచ్చినప్పటికీ ఆ హీరోయిన్ కండిషన్స్ కారణంగా ఆమెను తొలగించి త్రిప్తి డిమ్రీని తీసుకున్నారు.