BigTV English

Rishabh Shetty: ఏంటీ రిషబ్ శెట్టి అసలు పేరు ఇదా.. పేరు మార్పు వెనుక పెద్ద కథే వుందే!

Rishabh Shetty: ఏంటీ రిషబ్ శెట్టి అసలు పేరు ఇదా.. పేరు మార్పు వెనుక పెద్ద కథే వుందే!

Rishabh Shetty: కాంతార (Kantara) సినిమాతో దేశవ్యాప్తంగా ఫేమస్ అయిన నటుడు రిషబ్ శెట్టి (Rishabh Shetty).. ఈయన గతంలో ఒక్క కన్నడలో మాత్రమే తెలుసు. కానీ ఎప్పుడైతే కాంతార సినిమా ఇతర భాషల్లో కూడా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయిందో అప్పటినుండి దేశవ్యాప్తంగా పేరున్న హీరోగా మారిపోయారు. ఈయన స్వయంగా దర్శకత్వం వహించి నటించిన కాంతార సినిమాకి జాతీయ అవార్డు కూడా వచ్చింది. అలా నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్న కాంతార హీరో రిషబ్ శెట్టి అసలు పేరు రిషబ్ శెట్టి కాదట..ఆయన అసలు పేరు వేరే ఉందట. మరి ఇంతకీ రిషబ్ శెట్టి అసలు పేరు ఏంటి..? ఎందుకు తన పేరుని మార్చుకోవాల్సి వచ్చింది? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.


పేరు మార్చుకున్న హీరో రిషబ్ శెట్టి..

చాలామంది సెలబ్రిటీలు సినిమాల్లోకి వచ్చిన సమయంలో వాళ్ళకి ఉన్న పేరు ఇండస్ట్రీలో ముందే వచ్చి ఫేమస్ అయిన వారికి ఉంటే తమ పేరుని దర్శక నిర్మాతలు లేక హీరోలు చెప్పిన దాని ప్రకారం మార్చుకుంటూ ఉంటారు. కొంతమందేమో సొంత పేర్లతోనే కంటిన్యూ అవుతూ ఉంటారు. అలా రిషబ్ శెట్టి కూడా ఇండస్ట్రీలోకి వచ్చే ముందు తన పేరు కాస్త వెరైటీగా ఉండాలి అని మార్చుకున్నారట..

వారి వల్లే పేరులో మార్పు..


మరి ఇంతకీ రిషబ్ శెట్టి పేరు అసలు పేరు ఏంటంటే ప్రశాంత్ శెట్టి (Prashanth Shetty). అవును మీరు వినేది నిజమే. ఆయన అసలు పేరు ప్రశాంత్ శెట్టి నట.కానీ సినిమాల్లోకి వచ్చే ముందు తన పేరు కాస్త వెరైటీగా ఉండాలి అనే ఉద్దేశంతో తన స్నేహితులు చెప్పిన దాని ప్రకారం రిషబ్ శెట్టి అని మార్చుకున్నారట.. కాంతార మూవీతో వరల్డ్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్న రిషబ్ శెట్టి త్వరలోనే కాంతార చాప్టర్ 1 మూవీతో మన ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా అక్టోబర్ 2న విడుదల కాబోతుండడంతో ఈ సినిమాకి సంబంధించి వరుస ప్రమోషన్స్ చేస్తూ ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు బయట పెడుతున్నారు.

ALSO READ:OG Collections: ఊచకోత కోస్తున్న ఓజీ.. అప్పుడే రూ.200కోట్ల క్లబ్ లోకి!

ఆయనను చూసే ఇన్స్పైర్ అయ్యాను..

ఇందులో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రిషబ్ శెట్టి మాట్లాడుతూ.. “నేను సినిమాల్లోకి రావడానికి చాలా ఇబ్బందులు పడ్డాను. చిన్నతనంలో మా ఇంట్లోనే టీవీ, కరెంట్ ఉండేది.అలా టీవీలో నటుడు రాజ్ కుమార్ పాటలు చూసి హీరో అవ్వాలని ఫిక్స్ అయ్యాను. ఆ తర్వాత కన్నడ ఫేమస్ హీరో ఉపేంద్ర మా ప్రాంతానికి చెందిన వాడే కాబట్టి ఆయన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని దర్శకుడిని అవ్వాలనుకున్నా.

బెంగళూరులో వాటర్ క్యాన్స్ కూడా మోసాను..

కానీ ఫైనల్ గా అటు దర్శకుడిగా ఇటు నటుడిగా రెండు విభాగాల్లో వర్క్ చేస్తున్నాను.. అలాగే జూనియర్ ఎన్టీఆర్ అమ్మాగారిది మా ఊరే కాబట్టి ఆయనతో నాకు మంచి అనుబంధం ఉంది.. ఇక చదువుకోమని మా నాన్న బెంగళూరు పంపిస్తే ఫిలిం ఇన్స్టిట్యూట్లోకి వెళ్లి డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో చేరాను.దాంతో మా నాన్నకి కోపం వచ్చి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. కానీ ఆ సమయంలో మా అక్కే నాకు డబ్బు సహాయం చేసింది. అలాగే ఓ ప్రొడక్షన్ హౌస్ లో ఆఫీస్ బాయ్ గా.. బెంగళూరులో వాటర్ క్యాన్స్ సప్లై చేసే వ్యక్తిగా.. పనిచేసిన నేను కాంతార సినిమాకు జాతీయ అవార్డు అందుకోవడం ఎంతో ఆనందంగా అనిపించింది. ఆ క్షణాలు ఎప్పటికీ మర్చిపోలేని అద్భుతమైన క్షణాలు.. అమితాబ్ బచ్చన్ గారు యాంగ్రీ యంగ్ మాన్ లాగా తెరపైన ఎలా కనిపిస్తారో ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని కాంతార సినిమాలో నేను నటించాను. అలాగే నటనలో నాకు కమల్ హాసన్ దేవుడితో సమానం.

మా పెళ్లి ఊరి పెద్దలే చేశారు..

నా భార్య ప్రగతిది నాది ఒకే ఊరు. కానీ ఈ విషయం మాకు తెలియదు. ఫేస్ బుక్ లో స్నేహితులం కూడా.. కానీ ఓ సినిమా ఫంక్షన్ లో కలుసుకొని ప్రేమలో పడ్డాం. మొదట మా పెళ్ళికి ప్రగతి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. ఎందుకంటే నేను అప్పటికి సెటిల్ అవ్వలేదు. కానీ ఊరి పెద్ద వాళ్ళ సహాయంతో మేమిద్దరం పెళ్లి బంధంతో ఒక్కటయ్యాం. అలాగే కాంతార సినిమాలోని కాస్ట్యూమ్స్ అన్ని నా భార్యనే డిజైన్ చేసింది” అంటూ ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు రిషబ్ శెట్టి..

రిషబ్ శెట్టి సినిమాలు..

ఇక ఈ హీరో నుండి రాబోయే సినిమాల విషయానికి వస్తే.. ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో జై హనుమాన్ మూవీలో నటిస్తున్నారు. బంకించంద్ర చటర్జీ నవల ఆనందమట్ ఆధారంగా తెరకెక్కుతున్న 1770 సినిమాలో కూడా నటిస్తున్నారు.అలాగే చత్రపతి శివాజీ మహారాజ్ సినిమాలో కూడా రిషబ్ శెట్టి నటిస్తున్నారు.

Related News

Tripti dimri: అతని వల్ల నా లైఫ్ 360° తిరుగుతోంది..నటి ఎమోషనల్ కామెంట్స్!

OG Collections: ఊచకోత కోస్తున్న ఓజీ.. అప్పుడే రూ.200కోట్ల క్లబ్ లోకి!

Kantara Chapter -1: బ్రహ్మకలశ సాంగ్ ఔట్.. పరవశించిపోతున్న ప్రేక్షకులు!

Puri – Sethupathi: వాయిదా పడ్డ పూరీ మూవీ టైటిల్ – టీజర్.. తొక్కిసలాటే కారణమా?

Raja Saab Trailer Time: భయానికి ద్వారాలు తెరుచుకున్నాయి.. ధైర్యం ఉంటే ఎంటర్ అవ్వండి!

Vijay Thalapathi: కరూర్ తొక్కిసలాటపై స్పందించిన విజయ్.. మనసు ముక్కలైందంటూ!

Anasuya: బికినీలో సెగలు పుట్టిస్తున్న రంగమ్మత్త.. చూపు పక్కకు తిప్పుకోనివ్వట్లేదుగా?

Big Stories

×