Bhavani Devotees Accident: విజయవాడ దుర్గమ్మ కాలినడక వెళ్తున్న భవానీ భక్తులపైకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం పుల్లలపాడులో 16వ నెంబర్ హైవేపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనా స్థలంలోనే భవానీ భక్తులు.. పకృతి శివ(35), పకృతి శ్రీను మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులు అనకాపల్లి జిల్లా నక్కలపల్లి మండలం దోసలపాడు గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
ఘటన వివరాలు
స్థానికుల సమాచారం ప్రకారం.. భక్తులు రహదారి పక్కనే నడుస్తుండగా వెనుక నుండి వచ్చిన కారు.. ఒక్కసారిగా వారిపై దూసుకెళ్లింది. దీంతో ఇద్దరు భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరొకరు గాయాలతో రోడ్డు పక్కనే పడిపోగా.. స్థానికులు వెంటనే 108 సమీప ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
పోలీసులు ఘటనాస్థలంలో
సమాచారం అందుకున్న వెంటనే పోలీసు సిబ్బంధి.. ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. కారును స్వాధీనం చేసుకుని, డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడిపాడా లేదా అన్నదానిపై కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు.
రహదారి భద్రతపై ప్రశ్నలు
ఈ ఘటనతో మరోసారి రహదారి భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జాతీయ రహదారులపై తరచుగా భక్తులు కాలినడక ప్రయాణం చేస్తుండగా, వాహనాల వేగం, డ్రైవింగ్‌లో నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. భక్తులకు ప్రత్యేక మార్గాలు, రహదారులపై జాగ్రత్తలు తీసుకునే చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Also Read: హనుమాన్ ఆలయంలో చోరీ.. హుండీ పగలగొట్టి దోచుకెళ్లిన దొంగలు
విజయవాడ దుర్గమ్మ యాత్రలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన.. రెండు కుటుంబాలను దుఃఖంలో ముంచేసింది. పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నప్పటికీ, భక్తులకు భద్రత కల్పించడం, వాహనదారులు రహదారులపై జాగ్రత్తగా నడపడం ఎంత ముఖ్యమో మరోసారి నిరూపితమైంది.