IND Vs PAK : ఆసియా కప్ 2025 లో భాగంగా మరికొద్ది గంటల్లో టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ పై ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా గత రెండు మ్యాచ్ లతో పోల్చితే ఈ సారి పోరుకు అభిమానుల నుంచి భారీ స్పందన లభిస్తోంది. అందుకు ప్రధాన కారణం దుబాయ్ స్టేడియం మొత్తం నిండిపోవడమే. గత రెండు మ్యాచ్ లకు ఫ్యాన్స్ అంతగా ఆసక్తి చూపించలేదు. కానీ మూడో మ్యాచ్ ఫైనల్ కావడంతో ఆసక్తి కనబరుస్తున్నారు. మరోవైపు పాకిస్తాన్ జట్టు టాస్ గెలిస్తే.. తొలుత బ్యాటింగ్ చేసి బౌలర్ షాహీన్ అఫ్రిదిని ఓపెనర్ గా బరిలోకి దించాలని భావిస్తోంది.
Also Read : IND VS PAK Final: ఇండియాను వణికిస్తున్న పాత రికార్డులు..అదే జరిగితే పాకిస్థాన్ ఛాంపియన్ కావడం పక్కా ?
షాహీన్ అఫ్రిది లీగ్ దశలో టీమిండియా పై అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అలాగే యూఏఈ, ఒమన్ దేశాలపై కూడా అఫ్రిది బాగానే ఆడాడు. మొన్న బంగ్లాదేశ్ తో మాత్రమే 19 పరుగులు చేసాడు. ప్రతీ టీమ్ తో కూడా ఆడి సిక్స్ ల మోత మోగించచడంతో అతన్ని తొలుత బ్యాటింగ్ కి పంపితే భారీ స్కోర్ సాధించవచ్చవచ్చని భావిస్తున్నట్టు సమాచారం. ఇక టీమిండియా మాత్రం టాస్ గెలిస్తే.. తొలుత ఫీల్డింగ్ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. వాస్తవానికి టీమిండియా-పాక్ తొలిసారి తలపడినప్పుడూ లీగ్ దశలో బాయ్ కాట్ ట్రెండింగ్ నడిచింది. అప్పుడు స్టేడియం వైపు ఎవ్వరూ కన్నెత్తి కూడా చూడలేదు. కానీ ఫైనల్ మ్యాచ్ కి మాత్రం అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. టీమిండియా ఇప్పటివరకు రెండు మ్యాచ్ ల్లో ఆసియాకప్ 2025లో విజయం సాధించినప్పటికీ.. ఫైనల్ ప్రత్యేకతనే వేరు. ఆసియా కప్ 2025 టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా అభిషేక్ శర్మ కొనసాగుతున్నాడు. 6 ఇన్నింగ్స్ ల్లో కలిపి 309 పరుగులు చేశాడు. ఇక మరో 11 పరుగులు చేస్తే.. టీ 20 టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్ గా రికార్డు సృష్టిస్తాడు.
టీమిండియా కీలక ఆటగాడు విరాట్ కోహ్లీని అధిగమించనున్నాడు అభిషేక్ శర్మ. అభిషేక్ 23 పరుగులు చేస్తే.. ఫిల్ సాల్ట్ రికార్డును బ్రేక్ చేయనున్నాడు. సాల్ట్ వెస్టిండీస్ పర్యటనలో 331 పరుగులు చేశాడు. మరోవైపు షేక్ హ్యాండ్ వివాదం.. మ్యాచ్ విజయాన్ని పహల్గామ్ ఉగ్రదాడి బాధితులతో పాటు సైన్యానికి అంకితం చేయడంతో టీమిండియా ఫ్యాన్స్ కుదుటపడ్డారు. సూపర్ 4 మ్యాచ్ లో పాకిస్తాన్ ప్లేయర్ల పై ఐసీసీకి ఫిర్యాదులు చేసుకోవడం వరకు వెళ్లింది. ఇక మూడోసారి టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుండటంతో ఏమవుతుందనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. అందుకే దుబాయ్ మైదానం సామర్థ్యానికి తగినట్టుగానే 28 వేల టికెట్లు అమ్ముడుపోవడం విశేషం. లీగ్ దశలో 20వేలలోపే అమ్ముడు పోగా.. సూపర్ 4 మ్యాచ్ కి 17వేల వరకు తగ్గింది. కానీ ఫైనల్ లో మాత్రం పెరిగింది. దాదాపు 41 ఏళ్ల ఆసియా కప్ హిస్టరీలో తొలిసారి భారత్-పాక్ తలపడనుండటంతో అభిమానులు పెద్ద ఎత్తున స్టేడియానికి తరలివస్తున్నట్టు క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.