iPhone 17 cheaper| ఆపిల్ కంపెనీ ఇటీవలే iPhone 17 సిరీస్ ఫోన్లను ని విడుదల చేసింది. మరోవైపు ఈ కొత్త మోడల్స్ లాంచ్ కావడంతో ఐఫోన్ 16 ధరలకు కాస్త తగ్గాయి. పండుగ సేల్స్‌లో అందరూ ఐఫోన్ 16 కొనడానికి ఎగబడ్డారు. కానీ ఐఫోన్ 16 ఆఫర్ లో స్టాక్ అయిపోయిందని ఫ్లిప్ కార్ట్ లో కనిపిస్తోంది. దీంతో ఆఫర్ లేకుండా అసలు ధరకు ఐఫోన్ 16 ఆన్ లైన్ లో అందుబాటులోకి ఉంది. ఇదంతా చూసి షాపర్లు నిరాశ చెందారు. అయితే ఐఫోన్ 17 బేస్ మోడల్‌ని ఫ్లిప్‌కార్ట్ భారీ తగ్గింపు ఆఫర్స్ తో అందిస్తోంది. ఈ ఫోన్ ధర లాంచ్ అయినప్పటి కంటే ఇప్పుడు పండుగ సేల్ లో చాలా తక్కువగా ఉంది.
iPhone 16 ధర గతంలో రూ.51,999గా ఉండగా, చాలా మంది కొనుగోళ్లు రద్దు అయ్యాయి. ఇప్పుడు iPhone 16 ధర రూ.69,999 నుంచి ప్రారంభమవుతోంది. అయితే, iPhone 17 మరింత తక్కువ ధరకు లభిస్తోంది. దీని గురించిన వివరాలు మీ కోసం.
iPhone 17 (256GB) అధికారిక ధర రూ.82,900, కానీ బ్యాంక్ ఆఫర్‌లతో ఈ ధర రూ.76,900కి తగ్గుతుంది. పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేస్తే, మరో రూ.15,000 వరకు తగ్గింపు పొందవచ్చు, అంటే ధర రూ.61,900కి వస్తుంది. మరోవైపు iPhone 16 (256GB) ధర రూ.79,900 కంటే చాలా తక్కువ. ప్రస్తుతం క్రోమా వద్ద ఈ ఆఫర్ అందుబాటులో ఉంది.
iPhone 17 తాజా టెలజీ.. ఇది తక్కువ ధరలో లభించడం షాపర్లకు గుడ్‌న్యూస్. iPhone 16 కొనడం కంటే ఇదే బెటర్. ఇందులో పవర్‌ఫుల్ A19 చిప్, మెరుగైన కెమెరాలు ఉన్నాయి. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు, బ్యాంక్ డిస్కౌంట్‌లు వంటివి కొనుగోలును మరింత సులభం చేస్తాయి.
iPhone 17లో 6.3-అంగుళాల ప్రోమోషన్ డిస్‌ప్లే ఉంది, ఇది 10Hz నుంచి 120Hz వరకు డైనమిక్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. గరిష్టంగా 3,000 నిట్స్ బ్రైట్‌నెస్‌తో స్క్రీన్ అద్భుతంగా కనిపిస్తుంది. సెరామిక్ షీల్డ్ 2 రక్షణతో, అల్యూమినియం ఫ్రేమ్ ఫోన్‌ను పట్టుకున్నప్పుడు ప్రీమియం ఫీల్‌ను ఇస్తుంది.
A19 బయోనిక్ చిప్ అద్భుతమైన పనితీరును అందిస్తుంది. ఇది ఎన్ని యాప్‌లనైనా చాలా సాఫ్ట్‌గా రన్ చేస్తుంది. 3nm టెక్నాలజీతో పవర్ కెపాసాటీ ఎక్కువగా ఉంటుంది. ఆపిల్ iOS 26 సాఫ్ట్‌వేర్ సజావుగా నడుస్తుంది, అప్‌డేట్స్ కూడా సులభంగా అందుతాయి.
iPhone 17లో డ్యూయల్ రియర్ కెమెరాలు ఉన్నాయి. 48MP ఫ్యూజన్ సెన్సార్ మైక్రో డిటైల్స్ ను సైతం సంగ్రహిస్తుంది, 12MP టెలిఫోటో కెమెరా 2x ఆప్టికల్ జూమ్‌ను అందిస్తుంది. 18MP ఫ్రంట్ కెమెరాలో సెంటర్ స్టేజ్, AI ఫీచర్లతో వైడ్-యాంగిల్, పోర్ట్రెయిట్ మోడ్‌లు ఉన్నాయి. వీడియో కాల్స్ స్పష్టంగా ఉంటాయి.
3,561mAh బ్యాటరీ రోజంతా నడుస్తుంది. వైర్‌లెస్ ఛార్జింగ్ సౌకర్యం ఉంది, కానీ 45W వైర్డ్ ఛార్జింగ్ లేదు. రోజువారీ ఉపయోగానికి ఇది సరిపోతుంది.
బ్యాంక్ కార్డ్‌లతో మరింత సేవింగ్స్ చేయవచ్చు. నో-కాస్ట్ EMIతో వాయిదాల్లో చెల్లించవచ్చు. పాత ఫోన్ ఎక్స్ఛేంజ్‌తో మంచి విలువ పొందవచ్చు. స్టాక్ త్వరగా అయిపోతోంది, కానీ ఫ్లిప్‌కార్ట్ డెలివరీ సమస్యలు లేకుండా చూస్తోంది. iPhone 17 కొత్త ఫీచర్లతో, తక్కువ ధరలో iPhone 16 కంటే మెరుగైన ఆప్షన్. ఈ డీల్‌ను త్వరగా సద్వినియోగం చేసుకోండి!
Also Read: భారతదేశంలో అత్యధికంగా అమ్ముడుపోయే ఐఫోన్ మోడల్ ఇదే..