Chennai News: తమిళనాడులో రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. కరూర్ తొక్కిసలాట ఘటనను అనుకూలంగా మార్చుకునే పనిలో మిగతా పార్టీలు పడ్డాయా? విజయ్‌ని అరెస్ట్ చేయాలని అధికార డీఎంకె, అన్నాడీఎంకె నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో స్టాలిన్ ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ విచారణకు ఆదేశించింది. దీనిపై నమ్మకం లేని టీవీకె పార్టీ, మద్రాసు హైకోర్టు తలుపు తట్టింది.
కరూర్‌లో టీవీకే పార్టీ ర్యాలీలో తొక్కిసలాట ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో 39 మంది మృత్యువాత పడ్డారు. ఈ ఘటనపై స్టాలిన్ సర్కార్ ఏకసభ్య కమిషన్ విచారణకు ఆదేశించింది. హైకోర్టు రిటైర్ న్యాయమూర్తి అరుణా జగదీశన్ నేతృత్వంలోని కమిషన్ ఆదివారం మధ్యాహ్నం కరూర్‌కి వస్తుందని డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ తెలిపారు. దీనిపై టీవీకే పార్టీ అనుమానం వ్యక్తం చేసింది.
ఈ ఘటన తొక్కిసలాట వల్ల జరిగిందని కాదని, ప్రభుత్వం వైఫల్యం వల్లే జరిగిందని బలంగా నమ్ముతోంది. పోలీసులు సరై ఏర్పాట్లు చేయకపోవడం వల్లే ఇదంతా జరిగిందని ఆ పార్టీ నేతలు బలంగా నమ్ముతున్నారు. ఈ క్రమంలో విజయ్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది.
కరూర్ తొక్కిసలాట ఘటనపై మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పోలీసులు లాఠీఛార్జ్ వల్లే ఘటన జరిగిందని వాదిస్తోంది. ఈ ఘటనపై సీబీఐ విచారణ చేపట్టేలా ఆదేశించాలని పిటిషన్‌లో పేర్కొంది టీవీకే పార్టీ. ఈ మేరకు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ALSO READ: పార్టీ తరపున మృతులకు రూ. 20 లక్షలు ఎక్స్‌గ్రేషియా
టీవీకే నిర్ణయం వెనుక కారణాలు చాలానే ఉన్నాయి. ఆదివారం ఉదయం అధినేత విజయ్.. పార్టీ నేతలతో ఆన్‌లైన్ సమావేశం ఏర్పాటు చేశారు. దీనిపై నేతల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారట. తొక్కిసలాట ఘటన జరిగే అవకాశముందని కొద్దిరోజుల కిందట సోషల్‌మీడియాలో పోస్టులు చక్కర్లు కొట్టిన విషయాన్ని అధినేత దృష్టికి తెచ్చారట. ఈ ఘటన వెనుక పెద్ద కుట్ర ఉందని అన్నారట.
ఈ నేపథ్యంలో హైకోర్టు తలుపు తట్టిందని అంటున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఏకసభ్య కమిషన్‌ను నియమించింది. ఈ సమయంలో హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటోందనని పార్టీల నేతలు ఆసక్తిగా గమనిస్తున్నారు. మొత్తానికి కరూర్ ఘటన తమిళనాట రాజకీయాలు కొత్త మలుపు తిరిగాయి.
విజయ్ TVK పార్టీ సంచలన నిర్ణయం
కరూర్ తొక్కిసలాట ఘటనపై మద్రాస్ హైకోర్టులో పిటిషన్
పోలీసులు లాఠీఛార్జ్ వల్లే తొక్కిసలాట జరిగిందని వాదిస్తున్న TVK పార్టీ
ఘటనపై సీబీఐ విచారణ చేపట్టేలా ఆదేశించాలని పిటిషన్‌లో పేర్కొన్న పార్టీ #TVKVijay #VijayCampaign #VijayCampaign pic.twitter.com/WJbsim4r0A
— BIG TV Breaking News (@bigtvtelugu) September 28, 2025