Big Stories

Covishield Health Risk: కోవిషీల్డ్ వ్యాక్సిన్ వల్ల గుండెపోటు? మీరు భయపడాల్సిన అవసరం ఉందా.?

Covishield Health Risk: కోవిడ్-19 మహమ్మారి తర్వాత గుండెపోటు రోగుల సంఖ్య వేగంగా పెరిగింది. అంతకుముందు కరోనా ఇన్ఫెక్షన్ మాత్రమే కారణమని భావించారు. కానీ టీకా తర్వాత కూడా, గుండె జబ్బుల కేసులు తగ్గుముఖం పట్టనప్పుడు, టీకా విశ్వసనీయతపై ప్రశ్నలు తలెత్తాయి. ఇందులో, టీకా తీసుకున్న తర్వాత మెదడు దెబ్బతిన్న ఒ వ్యక్తి బ్రిటిష్ కంపెనీ ఆస్ట్రాజెనెకాపై దాఖలు చేసిన కోర్టు కేసు కూడా ఉంది.

- Advertisement -

కోవిషీల్డ్‌కు సంబంధించి ఇటీవల కోర్టులో ఆస్ట్రాజెనెకా ఇచ్చిన స్టేట్‌మెంట్ విన్న తర్వాత, వ్యాక్సిన్ తీసుకున్న ప్రతి వ్యక్తి ఆందోళన చెందుతున్నాడు. కోవిషీల్డ్ వల్ల కలిగే దుష్ప్రభావాలను కంపెనీ కోర్టులో వివరించిందని.. అది శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణమవుతుందని.. ప్లేట్‌లెట్లను తగ్గిస్తుందని, ఇది గుండెపోటు, స్ట్రోక్‌కు కారణమవుతుందని నిపుణులు చెబుతున్న మాట. కానీ దాని అవకాశం చాలా తక్కువ. అటువంటి పరిస్థితిలో, మీరు మీ ఆరోగ్యం గురించి కూడా ఆందోళన చెందుతుంటే, ఈ నిపుణుల అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలుసుకోండి.

- Advertisement -

కోవిడ్-19 మొట్టమొదటి, ప్రభావవంతమైన వ్యాక్సిన్ అని నిరూపితమైన తర్వాత, భారత ప్రభుత్వం కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను దేశంలోని సాధారణ ప్రజలకు అందుబాటులో ఉంచింది. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ క్యాంపెయిన్ లాగా, కోట్లాది మంది ఈ వ్యాక్సిన్‌ని పొందారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, 170 కోట్ల మంది ప్రజలు కోవిషీల్డ్‌తో టీకాలు వేయించుకున్నారు.

కోవిషీల్డ్ పొందిన ప్రతి వ్యక్తి ప్రమాదంలో ఉన్నాడా?

అందరి జీవక్రియ ఒకేలా ఉండదని.. టీకా దుష్ప్రభావాలు ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటాయని అందుకే వ్యాక్సిన్ వల్ల 10 లక్షల మందిలో ఒకరికి మాత్రమే ప్రాణాపాయం ఉందని USAలోని బోస్టన్‌లోని హార్వర్డ్ మెడికల్ స్కూల్ సైంటిస్ట్ ఒకరు తెలిపారు.

టీకా దుష్ప్రభావాలు 6 నెలల్లో కనిపిస్తాయి, కానీ ఇప్పుడు అది రెండు సంవత్సరాలు పూర్తయ్యింది, కాబట్టి ఏదైనా ప్రాణాంతక ప్రమాదానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

Also Read: కోవిడ్ వ్యాక్సిన్ కు గడ్డకడుతున్న రక్తం.. నిజమేనని అంగీకరించిన ఆస్ట్రాజెనెకా..!

అమెరికన్ సొసైటీ ఆఫ్ హెమటాలజీ ప్రచురణ నివేదిక వ్యాక్సిన్ నుంచి దుష్ప్రభావాల ప్రమాదం 10 లక్షల మందిలో 3 నుంచి 15 మంది మాత్రమేనని తెలిపింది. వీటిలో కూడా 90% నయమవుతాయని.. ఇందులో మరణ సంభావ్యత 0.00013% మాత్రమే.. అంటే 10 లక్షల మందిలో 13 మంది సైడ్ ఎఫెక్ట్స్ కలిగి ఉంటారు కాబట్టి వారిలో ఒకరికి మాత్రమే ప్రాణాంతకమైన ప్రమాదం ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News