Big Stories

Amit Shah fake video case: అమిత్ షా ఫేక్ వీడియో కేసు, గడువు కోరిన తెలంగాణ కాంగ్రెస్

Amit Shah fake video case:  కేంద్ర‌మంత్రి అమిత్ షా ఫేక్ వీడియో వ్యవహారంపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇందులోభాగంగా ఢిల్లీ పోలీసుల నోటీసులపై రిప్లయ్ ఇచ్చారు పీసీసీ నేతలు. కాంగ్రెస్ సోషల్‌మీడియా ఇన్‌ఛార్జ్ మన్నే సతీష్‌తోపాటు నవీన్, శివకుమార్, అస్మా తస్లీమ్‌లకు 15 రోజుల గడువు ఇవ్వాలని లీగల్ టీమ్ ఢిల్లీ పోలీసులను కోరింది.

- Advertisement -

ముఖ్యంగా ఈ నేతలు వినియోగించిన ఫోన్, ట్యాబ్, ల్యాప్‌టాప్‌లు, పీసీల వివరాలను ద్వారకా పోలీసు స్టేషన్‌కు తీసుకురావాలని నోటీసులో ప్రస్తావించారు ఢిల్లీ పోలీసులు. ప్రస్తుతం ఎన్నికలతో బిజీగా ఉన్నామని, తర్వాత వస్తామని సమాచారం ఇచ్చారు. అయితే ఈ వ్యవహారంలో సీఎం రేవంత్‌రెడ్డికు నోటీసులు ఇచ్చారు. దీనిపై కూడా నాలుగు వారాలు గడువు కోరింది తెలంగాణ పీసీసీ లీగల్ టీమ్.

- Advertisement -

అమిత్ షా ఫెక్ వీడియో షేర్ కు తనకు సంబంధం లేదని సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పోలీసులకు సమాధానం పంపారు. ఐఎన్‌సీ తెలంగాణ ట్విటర్ ఖాతాను తాను నిర్వహించడం లేదని స్పష్టం చేశారు. తాను కేవలం రెండు ట్విటర్ ఖాతాలను (CMO తెలంగాణా, వ్యక్తిగత ఖాతా) మాత్రమే వినియోగిస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి సమాధానాన్ని ఆయన తరపు న్యాయవాది సౌమ్య గుప్త ఢిల్లీ పోలీసులకు అందజేశారు.

ఇదిలావుండగా బుధవారం కేంద్రమంత్రి అమిత్ షా హైదరాబాద్‌కు రానున్నారు. ఎంపీ అభ్యర్థి మాధవీలత తరపున ఆయన ఓల్డ్ సీటీలో ప్రచారం చేయనున్నారు. ఈ క్రమంలో ఆయన ఫేక్ వీడియోపై కీలక వ్యాఖ్యలు చేస్తారని నేతలు భావిస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News