BigTV English

Dating stories: జిమ్‌లో ఆంటీతో ప్రేమ.. ఆమె భర్త కిల్లర్ అని తెలిస్తే? మరి.. ఆ రిలేషన్ నుంచి అతడు ఎలా భయటపడ్డాడు?

Dating stories: జిమ్‌లో ఆంటీతో ప్రేమ.. ఆమె భర్త కిల్లర్ అని తెలిస్తే? మరి.. ఆ రిలేషన్ నుంచి అతడు ఎలా భయటపడ్డాడు?

కొన్ని రిలేషన్‌షిప్స్ చాలా వింతగా.. చిత్రంగా ఉంటాయి. ఇటీవల ఓ యువకుడు తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. అది కాస్తా వైరల్ అయ్యింది. అతడి అనుభవం మీకు కూడా ఒక లెసన్ కావచ్చు. అసలు అతడికి ఏం జరిగింది? అతడికి ఎదురైన ఆ షాకింగ్ సంఘటన ఏమిటీ? అతని మాటల్లోనే.. “ఇప్పుడు నేను చెప్పబోయే సంఘటన సుమారు నెల క్రితం జరిగింది. చాలా రోజులుగా నేను సిటీలోనే ఉంటున్నాను. అక్కడే  చదువు కొనసాగిస్తున్నాను. ఇటీవలే మా సొంతూరికి వచ్చాను. నా స్కూల్ మేట్ ను కలిశాను. తను రోజూ జిమ్ కు వెళ్తాడు. నన్ను కూడా జిమ్ కు రమ్మని చెప్పాడు. సరే అన్నాను. అయితే, తను రోజూ సాయంత్రం జిమ్ కు వెళ్లేవాడు. కానీ, నాకు సాయంత్రం వెళ్లడం ఇష్టం లేదు. అందుకే, మార్నింగ్ జిమ్ కు వెళ్లేలా తనను ఒప్పించాను”.


తొలి చూపులోనే ఆమెను ఇష్టపడ్డా..

“తొలి రోజు జిమ్ కు వెళ్లాను. ఫిట్ నెస్ సెంటర్ లోకి అడుగు పెట్టే సమయానికి ఓ అందమైన లేడీ జిమ్ చేస్తూ కనిపించింది. ఆమె చాలా అట్రాక్టివ్ గా ఉంది. చూడగానే నచ్చింది. ఆమెను చూస్తుంటే చాలా రిచ్ లేడీలా కనిపించింది. బ్రాండెడ్ జిమ్ డ్రెస్ వేసుకుంది. ఆపిల్ వాచ్ ధరించింది. కారులో జిమ్ కు వచ్చింది. ఆమె కావాలనుకుంటే ప్రీమియం జిమ్ మెంబర్ షిప్ తీసుకోవచ్చు. కానీ, ఆమె ఇంత సాధారణ జిమ్ కు ఎందుకు వచ్చింది? అనేది అర్థం కాలేదు. ముందు ముందు తెలుస్తుందిలే అనుకున్నాను. ప్రతి రోజూ మేం 7 గంటలకు జిమ్ కు వెళ్లే వాళ్లం. తను 8 గంటలకు వచ్చేది. ఆమెను నేరుగా చూడ్డానికి కాస్త సిగ్గు అనిపించేది. కానీ, నేను వర్కౌట్స్ చేస్తుంటే  తను నన్ను చూడ్డం గమనించాను. తను నన్ను చూస్తుందో? లేదో? గమనించాలని నా ఫ్రెండ్ కు చెప్పాను. ఆమె నన్ను చూస్తుందని తను కూడా చెప్పాడు”.


మాటలు కలిసిన వేళ..

“రెండు రోజుల తర్వాత ఆమెతో మాట్లాడాలనుకున్నాను. ఆమె ఇన్ స్టా అకౌంట్ ను తెలుసుకోవాలి అనుకున్నాను. కానీ, అడగలేకపోయాను. మరుసటి రోజు కాస్త ఆలస్యంగా జిమ్ కు వెళ్లాను. తను ట్రెడ్ మిల్ మీద నడుస్తూ కనిపించింది. నేను ఆమె పక్కనే ఉన్న సైకిల్ తొక్కడం మొదలు పెట్టాను. కొద్ది సేపటి తర్వాత తనతో మాటలు కలిపాను. “హే.. మీరు ఎంత కాలం నుంచి వర్కౌట్స్ చేస్తున్నారు?” అని అడిగాను. ఆమె “2018 నుంచి చేస్తున్నాను” అని చెప్పింది. నెమ్మదిగా ఆమెతో మాటలు కలిపాను. ఆమె నా బాడీ ఫిట్ నెస్ ను మెచ్చుకుంది. నెమ్మదిగా తన ఇన్ స్టా అకౌంట్ గురించి తెలుసుకున్నా. ఇద్దరం ఒకరికొకరం ఇన్ స్టా ఐడీలను ఫాలో చేసుకున్నాం. ఇంటికి వెళ్లాక ఆమెకు మెసేజ్ చేశాను. తను రిప్లై ఇచ్చింది. “చాటింగ్ చేయడం ఇష్టం లేదు. ఫోన్ మాట్లాడుదాం” అని చెప్పింది. నేను సరే అన్నాను. జిమ్ లో జరిగే సీక్రెట్ విషయాలన్ని నాకు చెప్పడం మొదలుపెట్టింది. ఆ రోజు మధ్యాహ్నం అంతా తనతో మాట్లాడాను. ఆ తర్వాత జిమ్ లో చూసుకునే వాళ్లం. కానీ, మాట్లాడుకునేవాళ్లం కాదు”

అసలు విషయం చెప్పి షాకిచ్చిన ఫ్రెండ్..

“రెండు రోజుల తర్వాత మా ఫ్రెండ్ పెద్ద విషయం చెప్పాడు. ఆమెకు ఇప్పటికే పెళ్లైందని, ముగ్గురు పిల్లలు ఉన్నారని చెప్పాడు. ఎందుకో ఆమె వ్యక్తిగత జీవితం గురించి ఆలోచించాలి అనిపించలేదు. మరికొద్ది రోజుల్లో ఇక్కడి నుంచి వెళ్లిపోతున్నాను. ఈ కొద్ది రోజులు ఆమెతో స్పైసీగా ఉండాలనుకున్నాను. ఇద్దరి మాటల్లో ఘాటు పెరిగింది. మరుసటి రోజు మా ఫ్రెండ్ మరో పిడుగులాంటి వార్త చెప్పాడు. “ఇకపై ఆమెతో మాట్లాడ్డం మానేయాలి” అని చెప్పాడు. “ఎందుకు?” అని ప్రశ్నించగా అసలు విషయం చెప్పాడు. “ఆమె భర్త ఓ హంతకుడు. తన భార్యతో వివాహేతర సంబంధం ఉన్న వ్యక్తిని హత్య చేసి జైలుకు వెళ్లాడు. అంతేకాదు, ఆమె భర్త తన కారులో ట్రాకర్‌ ఉంచాడు.అందుకే, ఆమె ఎక్కువ దూరం వెళ్లదు. కానీ, ఆమె ఎప్పుడూ ఇతర మగాళ్ల దృష్టిని కోరుకుంటుంది” అని చెప్పాడు. అప్పుడు నాకు ఆమె ఈ జిమ్ కు ఎందుకు వచ్చిందో అర్థం అయ్యింది. ఒక్కసారిగా జరిగింది తలచుకుని షాక్ అయ్యాను. ఆమె భర్తకు చిక్కితే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో ఊహించుకుంటేనే భయంగా ఉంది. ఇకపై మార్నింగ్ జిమ్ కు వెళ్లకూడదు అనుకున్నాను. ఇంకా చెప్పాలంటే జిమ్ కు వెళ్లకపోయినా ఫర్వాలేదు అనుకున్నాను”.

Read Also: రాత్రిళ్లు ఫోన్ చూస్తున్నారా? ఇక ‘అది’ కష్టమే.. మరిచిపోండి, ఎవరు చెప్పినా వినరు కదా!

Related News

Weight Loss: ఈ యోగాసనాలతో.. 10 రోజుల్లోనే వెయిట్ లాస్

Sugar: చక్కెర తినడం 30 రోజులు ఆపేస్తే.. ఏం జరుగుతుందో తెలుసా ?

Hair Care Tips: వర్షంలో జుట్టు తడిస్తే..… వెంటనే ఇలా చేయండి?

Paneer Effects: దే…వుడా.. పన్నీరు తింటే ప్రమాదమా?

Hair Growth Tips: ఈ టిప్స్ పాటిస్తే.. వారం రోజుల్లోనే ఒత్తైన జుట్టు !

Gut Health: గట్ హెల్త్ కోసం.. ఎలాంటి ఆహారం తినాలి ?

Big Stories

×